Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
ఈ పరిహారం చేస్తే ఆస్థులు అమాంతంగా పెరుగుతాయ్..!
జీవితంలో ప్రతీ వ్యక్తి ఒక సొంత ఇంటిని అయినా కొనుక్కోవాలని అనుకుంటారు. అలా కొనుక్కోలేక బాధపడేవారు చాలా మంది వున్నారు. అటువంటివారు కొన్ని పరిహారాలను చేసినట్లయితే తప్పకుండా ఆస్థులను కొనుక్కుంటారు. జీవితంలో ఎక్కువ ఆస్థులు కొనుక్కోవాలనుకుంటే, ఉన్న ఆస్థులు పెరగాలనుకుంటే, ఒక్కడైనా ఇరుక్కున్న ఆస్థులైనా తిరిగి రావాలని అను అనుకుంటే ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించాలి. అవి పాటిస్తే మీకు ఆస్థులకు సంబంధించి ఏ ఇబ్బందులు వున్నా అవన్నీ తొలగిపోతాయ్.

ఆస్థులను ఎలాగైనా కొనుక్కోవాలనుకునే వారు గురువారం రోజున 5 రాగిచెట్టు ఆకులను తీసుకోవాలి. వాటిపై గంధంతో బొట్టులాగా పెట్టాలి. ఎక్కడైతే నీరు పారుతుందో, ఆ పారే నీటిపై ఈ రాగి ఆకులను పెట్టాలి. ఇలా మూడు గురువారాలు పాటిస్తే ఆస్థులను కొనుక్కునే సామర్ధ్యాన్ని పెంచుకున్నవారౌతారు. గురువారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వచ్చిన యోగాన్నీ గురుపుష్య యోగము అని అంటారు. ఏరోజైతే గురుపుష్యమి వస్తుందో అదే రోజు పరిహారాన్ని చేసుకోవాలి.
ఎలాంటి పరిస్థితులోనైనా ఆస్థులు త్వరగా రావాలి అని అనుకున్నట్లైతే సాయంత్రం సూర్యాస్థమయ సమయంలో 1/2 లీటరు ఆవు పాలను తీసుకోవాలి. ఆ పాలలో 9 తేనె చుక్కలను వేయాలి. ఇంటి పై భాగానికి వెళ్లి అన్ని దిక్కుల్లో ఈ పాల చుక్కలను చల్లాలి. ఇంట్లో వున్న అన్ని గదుల్లో ఈ పాల చుక్కలను చల్లుతూ వుండాలి. మిగిలిన పాలను ఇంటి ముందు ధారలాగా పొయ్యాలి. గురువారం సాయంత్రం, శుక్రవారం సాయంత్ర వీలయినప్పుడల్లా ఇలా చేస్తూ వుంటే ఇలా 21 సార్లు చేస్తే ఆస్తులు కొనే యోగం తొందరగా లభిస్తుంది.

ఆదివారం ఆవుకు బెల్లాన్ని తినిపిస్తూ వుంటే కూడా ఆస్థులు తొందరగా కొనుక్కునే యోగాన్ని కలిగి వుంటారు. అమావాస్య రోజున ఆకలితోవున్న వారికి భోజనం పెట్టాలి. ఇలా చేసినట్లయితే ఆస్థులు కొనే యోగం తొందరగా వస్తుంది. గురువారం ఏదైనా ఆలయానికి వెళ్లి తులసిమొక్క ఎక్కడవుందో చూడాలి. ఆ మొక్క దగ్గరలో పెరిగిన గడ్డిని కోసి బట్టలో చుట్టి ఇంటికి తెచ్చుకోవాలి. ఆ మూటకు ధూపాన్ని వేస్తూ వుంటే మీకు ఆస్థులు కొనే యోగం పెరిగిపోతూ వుంటుంది.
రంగురంగుల గవ్వలను ఏరి తెచ్చుకోవాలి. వాటిని పొడి చేసుకొని, ఎవరినుంచైతే ఆస్థులు రావాలి అని అనుకుంటున్నారో వారి ఇంటిముందు ఈ గవ్వల పొడిని చల్లాలి. ఇలా ఏడు సార్లు చేయాలని తాంత్రిక శాస్త్రంలో చెప్పారు. ఈ పరిహారంతో వాళ్లంతట వాళ్లే వచ్చి వాళ్ల ఆస్థులను తిరిగి ఇస్తారు.
ప్రతీ ఇంట్లో కూడా మారేడు మొక్క తప్పకుండా వుండాలి. ఇంటి ఆవరణలో మారేడు మొక్క పెంచుకొని ప్రతీ శుక్రవారం ఆ మొక్క దగ్గర దీపాన్ని పెట్టి పూజచేస్తే లక్ష్మీ దేవి ఘల్లు ఘల్లు మనుకుంటూ ఇంట్లోకి వస్తుంది.
ప్రతీ ఒక్కరు ఇంట్లో కుండీలో కలబంద మొక్కను తప్పకుండా పెంచుకోవాలి. కలబంద చెట్టు దగ్గర సాయంత్రం సమయంలో అగరబత్తీలు వెలిగించి, హారతి ఇచ్చినట్లైతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఇంటి ఆవరణలో ఈ మొక్కలను పెంచుకుంటే ధనపరంగా ఎలాంటి సమస్యలు లేకుండా వుంటాయ్.
నాగవల్లీ మొక్కను కూడా ఇంటి ఆవరణలో పెంచడం చాలా మంచిది. నాగవల్లీ అంటే తమలపాకుల తీగ. ఇంటి ఆవరణలో తమలపాకు తీగ వుంటే ఆ ఇంటికి ధనలాభం జరుగుతుంది. ఆంజనేయస్వామికి తమలపాకు అంటే చాలా ఇష్టం. ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర తమలపాకు తీగను పెంచాలి.



Click it and Unblock the Notifications
