Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఆషాఢ అమావాస్య ఎప్పుడు? ఆ రోజున ఈ ఒక్కపని చేస్తే చాలు మీకు అఖండ రాజయోగం పడుతుంది.
వైదిక శాస్త్రం ప్రకారం హిందు మతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్య ఉంది. ప్రతి నెలలో అమావాస్య వస్తుంది. అలా కొన్ని నెలల్లో వచ్చే అమావాస్యలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి జూలైలో వచ్చే ఆషాఢ అమావాస్య. ఎందుకంటే ఈ అమావాస్య తిథి శ్రీ మహా విష్ణువుకి అంకితం చేయబడినది. ఈ అమావాష్య రోజును విష్ణువును పూజిస్తారు. హిందూ మతవిశ్వాసాల ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ముఖ్యమైనది తిధి. ఈ సవంవత్సరం 05 జూలైన ఆషాడ అమావాస్య వచ్చింది.ఆషాఢ అమావాస్య రోజును కొన్ని నియమాలను పాటిస్తే మంచిదని,వాటి ద్వారా అఖండ రాజమోగం పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఆషాఢ అమావాస్య ఎప్పుడు, ప్రాముఖ్యత మరియు నియమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
అమావాస్య జూలై 2024: ఆషాఢ అమావాస్య తేదీ మరియు సమయం
ఆషాఢ అమావాస్య తేదీ - 5 జూలై 2024
అమావాస్య తిథి 4:57 AM, 5 జూలై 2024 ప్రారంభమై
అమావాస్య తిథి 4:26 AM, 6 జూలై 2024 ముగుస్తుంది

ఆషాఢ అమావాస్య ప్రాముఖ్యత
ఆషాఢ అమావాస్య రోజును పిత్రుదేవుళ్లను స్మరించుకోవడం మరియు గౌరవించడం కోసం అంకితం చేయబడింది. ఆషాఢ అమావాస్య రోజు పితృలకు పిండప్రధానం చేస్తారు.ఈ రోజున నిర్దిష్టమైన ఆచారాలు నిర్వహించడం వల్ల మరణించిన(పితృలు) వాళ్ళు శాంతి పొందుతారని, వారి ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుందని హిందువులు నమ్ముతారు. ఈ రోజు వారి పేరుమీద చేసే ధానదర్మాల వల్ల విశేష ప్రయోజనాలు పొందుతారు.
ఆషాఢ అమావాస్య రోజున పాటించాల్సిన నియమాలు
ఆషాడ అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేవకూడదు. అలా లేస్తే దరిధ్ర దేవత తిష్టవేసుకుని కూర్చుటుంది. ఆషాడ అమావాస్య నాడు పాటించే నియమాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మన ఇంట్లో ఉన్న ధరిద్రదేవతని తరిమేసి లక్ష్మీదేవిని ఆవ్వానించవచ్చు.
అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అలా ఈ రోజున తలస్నానం చేకపోతే దరిద్రం చుట్టుకుంటుంది. మరొక విషయం ఏంటంటే ఈ రోజున ఎట్టి పరిస్థితిలో తలకు నూనె రాయకూడదు.
అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీ దేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి అందులో ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో 5 వత్తులు వేసి దీపారాధన చేయాలి. అలా ఈ దీపాన్నీ లక్ష్మీ దేవి పటం ముందు ఉంచి దీపారాదన చేయాలి. ఇలా ఎవరైతో చేస్తారు అలాంటి వారికి అష్ట దరిద్రాలు పోయి, అష్టఐశ్వార్యాలు లభిస్తాయి.

పౌరానికి గ్రంథాల ప్రకారం ఈ అమావస్య నాడు పూజలు మరియు ఉపవాసాలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయి. అలాగే ఇంటి ఈశ్యాన్యంలో దీపారాధన చేయండి. ఇలా చేస్తే లక్ష్మీ దేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. అలాగే దీపాలకు ఆవు నెయ్యి ఉపయోగించండి.
అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనబడితే వాటి ఆహారం వేయండి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదలు పొందుతారు. మీకోరికలు నెరవేరుతాయి.
ఇక ఈ మద్య కాలంలో ద్రుష్టిని తొలగించుకోవడానికి కాళ్ళకు నల్లదారం కట్టుకుంటారు. అమావాస్య రోజున ఆధారం తొలగించి కొత్తదారాన్ని కట్టుకోండి, అలా చేయడం వల్ల మీపై నర ద్రుష్టి తగలదు. అలాగే ఆర్థిక కష్టాలు ఉండవు. ఆడవాళ్ళు ఎడమకాలికి, మగవాళ్లు కుడికాలికి కట్టుకోవాలి.
చాలా కాలం నుండి డబ్బు సమస్యలతో బాధపడుతుంటే గాయత్రీ మంత్రం జపించడం ద్వారా డబ్బు సమస్యలు తీరుతాయి.
అమావాస్య రోజున రాత్రి నిద్రించే ముందు 11 లవంగాలను ఒక గిననెలో తీసుకుని ,వాటి మీద నెయ్యి వేసి కాల్చాలి. లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాప్తి చెందడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
అమావాస్య అంటే లక్ష్మీ దేవికి అంత్యంత ప్రీతకరమైన రోజు. అమావాస్య రోజున సాయంత్ర సమయంలో ఒక రాగి చెంబులో నీళ్ళు పోసి దాన్ని ఇంటి గుమ్మం ముందు ఉంచండి, ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిధ్ర దేవత వెళ్లిపోతుంది.మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు.
అలాగే అమావాస్య రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి, దానిమీద స్వస్తిక్ చిహ్నం రాయండి. మీ బీరువాలు చిన్న లక్ష్మీ కాయిన్ లేదా లక్ష్మీ ఫోటోను ఉంచడం వల్ల బీరువాలో లక్ష్మీ దేవి స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది. తద్వారా మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది.
లక్ష్మీ దేవికి ఎరుపు వస్త్రం అటే ఇష్టం కాబట్టి, అమావాస్య రోజును బీరువాలో ఎరుపు వస్త్రాన్ని పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఆదాయం బాగా పెరుగుతుంది. అమావాస్య రోజును స్నానం నీటిలో పసుపువేసుకుని స్నానం చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి,అలాగే ఇంట్లో కూడా పసుపునీళ్ళు చల్లడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
అమావాస్య రోజును గోవుకి ఆహారం ఇవ్వడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఆషాఢ అమాస్య రోజున గోవుకు గట్టి తినిపిస్తే కష్టాలు తొలగిపోయి తరతరాల ఐశ్వర్యం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications