Latest Updates
-
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా
హనుమంతుడు ఎక్కడ ఉన్నాడు.. అది నిజంగా హనుమంతుడి ఫోటేనేనా..?
హనుమంతుడిపై ఎన్నో మిస్టరీలు ఇంకా అలాగే ఉన్నాయ్. హనుమంతుడు ఆకారం, హనుమంతుడికి ఉన్న శక్తులు, హనుమంతుడు సంజీవనీ పర్వతం ఎత్తడం లాంటి ఎన్నో విషయాలు ఇప్పటికీ చాలా మందికి అంతు చిక్కని విధంగా ఉన్నాయ్. అయితే హనుమంతుడిని చూశామని చాలా మంది చెప్పడం విని ఉంటాం. కొందరు హనుమంతుడిని హిమాలయాల్లో, కశ్మీర్ ప్రాంతాల్లో చూశామంటారు. కలియుగంలో కూడా హనుమంతుడు ఉన్నాడని, అయితే వయసు మీదపడి ముసలివాడిలా అయ్యాడనే కూడా కొందరు చెబుతుంటారు. నిజంగా హనుమంతుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు..?
హనుమంతుడికి పుత్రుడు
హనుమంతుడు త్రేతాయుగంలో అంజనీ దేవికి తండ్రి కేసరికి జన్మించాడు. హనుమంతుడిని కోతిగా పురాణాలు చెబుతుంటాయ్. హనుమంతుడికి పుత్రుడు కూడా ఉన్నాడు హనుమంతుడి చెమట బిందువులు సముద్రంలో పడితే ఆ చెమట బిందువులను ఓ చేప మింగి మకరధ్వజుడికి జన్మనిస్తుంది. మకరధ్వజుడు సగం కోతి, సగం చేప శరీరాన్ని కలిగి ఉంటాడు. హనుమంతుడు కోతిజాతికి చెందిన వాడుగా చెబుతుంటారు. కానీ అప్పటి త్రేతాయుగంలో హనుమంతుడు మనుషుల్లోనే ఓ ప్రత్యేక జాతికి చెందిన వాడని వాల్మీకి రామాయణం స్పష్టం చేస్తుంది.
మాతంగ్ పర్వతం
హనుమంతుడు కర్నాటకలోని హంపీలో ఉన్న మాతంగ్ పర్వతం వద్ద మాతంగ్ రుషి ఆశ్రమంలో జన్మించాడని అంటారు. రావణుడితో యుద్ధం తరువాత హనుమంతుడు ఏమయ్యాడని అందరూ భావిస్తారు. హనుమంతుడిని త్రేతాయుగం తరువాత వచ్చే ద్వాపర యుగంలో చూడవచ్చు. మహాభారతంలో కూడా హనుమంతుడి గురించి ప్రస్తావన ఉంది. అర్జునుడి రథంపై హనుమంతుడి పతాకం చూడవచ్చు.
మహాభారతంలో హనుమంతుడు
ఒకసందర్భంలో భీముడు అడవిలో వెళ్తుండగా మధ్యలో హనుమంతుడు అడ్డుపడతాడు, పక్కకి తొలగమని భీముడు హనుమంతుడితో అంటాడు. నేను పక్కకు తొలగనుకావాలంటే నువ్వే నన్ను పక్కకు తొలగించు అంటాడు. భీముడి బలాన్ని ఎంత ఉపయోగించినా హనుమంతుడిని కొంచెం కూడా పక్కకు జరపలేడు. దీంతో హనుమంతుడు సాధారణ వానరుడు కాదని భీముడు తెలుసుకొంటాడు. హనుమంతుడి ఆశీస్సులు తీసుకుంటాడు.

హనుమంతుడి దర్శనం
దేవుళ్లు అవతారాలు చాలిస్తారు. కానీ హనుమంతుడు తన అవతారాన్ని చాలించినట్లు పురాణాల్లో ఎక్కడా లేదు. కలియుగంలో కూడా హనుమంతుడు ఉంటాడని పురాణాల్లో చెప్పబడి ఉంది. ఓ హనుమంతుడి భక్తుడు మానససరోవర యాత్ర చేస్తున్నప్పుడు తనకు హనుమంతుడి దర్శనం అయింది. దర్శనం కాగానే ఆ చిత్రాన్ని కెమెరాల్లో బంధించాడు. కానీ హనుమంతుడి దర్శనం కాగానే అతను మరణించాడు. స్నేహితులు ఆ కెమారాలోని ఫోటోను డెవలప్ చేసి హనుమంతుడి చిత్రాన్ని కనుగ్గొన్నారు. వయసు మీద పడిన ఓ వానరం పురాణ గ్రంధాలను చదువుతున్నట్లు ఉండే చిత్రాన్ని మనము ఇంటర్నెట్‌లో చూడవచ్చు. అదే హనుమంతుడి రియల్ ఫోటో అని చాలా మంది నిర్ధారణకు వచ్చారు. అప్పటి నుంచి హనుమంతుడు మాసనసరోవర్ నది ప్రాంత పర్వతాల్లో ఉన్నడని భక్తుల నమ్మకం.



Click it and Unblock the Notifications
