Latest Updates
-
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే!
వారాహి అమ్మవారు ఎలా ఉద్భవించారు.. రాత్రి సమయంలోనే వారాహి అమ్మవారి ఆలయాలు ఎందుకు తెరుస్తారో తెలుసా..?
దుర్గా అమ్మవారి శక్తి నుంచి ఏడు స్వరూపాలు ఉద్భవించాయ్. వీళ్లను సప్తమాత్రికులు అని అంటాము. ఈ సప్త మాత్రికుల్లో ఒకరే వారాహి దేవి. ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రి సమయంలో మాత్రమే పూజిస్తారు. ఉదయం ఈ అమ్మవారి ఆలయాలు మూసి వుంటాయ్. వారాహి అమ్మవారిని రాత్రి మాత్రమే ఎందుకు పూజిస్తారు, వారాహి అమ్మవారు ఎలా జన్మించారు ? వారాహి అమ్మవారి భర్త ఎవరు ? వీటిని సంబంధించిన విషయాలను ఇప్పుడు మీకు అందిస్తున్నాం.
వారాహి అమ్మవారి గురించి హిందూ పురాణాల్లో వుంది. వాటిలో దేవీ భాగవత పురాణాల్లో రక్తభీజుడనే రాక్షసుడు దేవతలను, ప్రజల్ని బాగా హింసిస్తుండేవాడు. అప్పుడు దేవతలందరూ అమ్మవారి దగ్గరికి వెళ్లి సహాయం కోరుతారు. పార్వతీ దేవి ఉగ్రరూపంతో రక్తభీజుడిని అంతం చేయడానికి వెళ్తుంది. కానీ రక్తభీజుడిని అంతం చేస్తున్నప్పుడు రక్తభీజుడి ఒక్కో చుక్క రక్తం నేలమీద పడినప్పుడు మరొక రక్తభీజుడు ఉద్భవిస్తాడు. దీంతో ఇలా చాలా మంది రక్తభీజులు ఉద్భవిస్తారు. వేల మంది రక్తభీజులు రావడంతో వారిని చంపడం అమ్మవారికి అసాధ్యమవుతుంది. అప్పుడు తన దేహం నుంచి సప్త మాతలను సృష్టిస్తుంది. ఈ సప్త మాతలకు తాంత్రిక శక్తులు వుంటాయ్. ఈ పప్త మాతలు బ్రహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాని, కైమారి, వారాహి, చాముండి. ఈ ఏడు అవతారాలు రక్తభీజుడిని చంపడంలో సహాయపడ్డారు.
వారాహి అమ్మవారు తన దంతాలతో రక్తభీజులందరినీ అంతం చేస్తూవుంది. తరువాత రక్తభీజులు దుర్గా అమ్మవారి ముందు రావడంతో అమ్మవారు ఆ రక్తభీజుడిని అంతం చేస్తుంది. తరువాత హిరణ్యాక్షుడనే రాక్షసుడు వారాహి అమ్మవారి అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు. దీంతో అమ్మవారు ప్రత్యక్షమై వరం అడుగుతుంది. తనకు అమరత్వం కావాలని అడుగుతారు. కుదరదని వారాహి అమ్మవారు చెబుతుంది. నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ చంపడానికి వీలు లేదని హిరణ్యాక్షుడు అంటాడు. దానికి అమ్మవారు సరే అంటుంది. నేను నీ భక్తున్ని కాబట్టి నువ్వు నన్ను చంపవద్దు అని అంటాడు.

ఈ వరాన్ని అండగా చూసుకొని భూలోకంపై హిరణ్యాక్షుడు రెచ్చిపోయి చిత్రహింసలు పెడతాడు. అప్పుడు హిరణ్యాక్షుడిని చంపడానికి వారాహి అమ్మవారి నుంచి హిరణ్యాక్షుడు ఉద్భవిస్తాడు. వారాహి అమ్మవారి నుంచి వచ్చిన అవతారమే వరాహ అవతారం. మత్స్యపురాణంలో శివుడి చెమటతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు. తరువాత దేవతలపైనే యుద్ధాన్ని మొదలుపెడతాడు. ఈ అంధకాసురుడిని చంపడానికి కూడా శివుడు పార్వతీ దేవిలోని వారాహి అమ్మవారిని తలచకుంటాడని వుంది.
వామన పురాణంలో అమ్మవారు వారాహి అమ్మవారిని వీపు భాగం నుంచి పుట్టించినట్టుగా వుంది. రాక్షసులను అంతం చేయడానికి వారాహి అమ్మవారు వస్తారు. శివుడి నుంచి అష్టభైరవులు ఉద్భవిస్తారు. వీరిలో ఒకరైన ఉన్మత్త భైరవుడే వారాహి అమ్మవారి భర్తగా శాస్త్రం చెబుతోంది. వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైంది. చాలా ఈ అమ్మవారికి ఆలయాలు చాలా తక్కువగా వుంటాయ్. ఆలయం కూడా కేవలం రెండు, మూడు గంటలు మాత్రమే అది కూడా రాత్రి లేదంటే ఉదయం మాత్రమే తెరిచి వుంటుంది.



Click it and Unblock the Notifications











