Latest Updates
-
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే! -
పెళ్లిళ్ల సీజన్ రద్దీ.. మీ వేడుకను పాడుచేయకుండా ఇలా ప్లాన్ చేసుకోండి! -
బిర్యానీ, పులావ్ బోర్ కొట్టిందా? అయితే ఈ సండే ఆలూ చికెన్ రైస్ ట్రై చేయండి! -
దగ్గు, గొంతు నొప్పితో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం పొందండి -
Happy akshaya tritiya 2026: అక్షయ తృతీయ నాడు మీ బంధుమిత్రులకు పంపాల్సిన బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్! -
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది! -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. కటాఫ్ మార్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందేనా? -
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే! -
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా?
Char Dham Yatra 2023: చార్ ధామ్ యాత్ర ఎందుకంత ప్రమాదకరం?
చార్ ధామ్ యాత్ర చేయాలని చాలా మంది కోరుకుంటారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ యాత్ర చాలా ప్రమాదకరమైంది కూడా. ప్రతీ ఏటా వేసవి కాలంలో మాత్రమే వెళ్లగలిగే ఈ యాత్ర కోసం సంవత్సరమంతా వేచి చూస్తుంటారు. ప్రాణాలకు తెగించి మరీ ఈ యాత్రకు వెళ్తుంటారు. అసలు ఈ యాత్ర ఎందుకు అంత ప్రమాదకరం, అందుకు కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ యాత్రలో నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాల సందర్శన ఉంటుంది. అయితే ఈ నాలుగు కూడా హిమాలయ ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నాయి. అక్కడ క్షణానికోసారి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి.

ఉష్ణోగ్రత, తేమ, అతినీల లోహిత కిరణాలు, గాలి పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. ఒక్కోసారి ఆక్సిజన్ స్థాయిలు మొత్తం పడిపోతుంటాయి. వీటి వల్లే చార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు.
అత్యంత ఎత్తులో దివ్యక్షేత్రాలు:
ఉత్తరకాశీ జిల్లాలోని యమునోత్రి, గంగోత్రి, రుద్రప్రయాగ్ లోని కేదార్ నాథ్, చమోలీలోని బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలు చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. కేదార్‌నాథ్ దాదాపు 11,700 అడుగుల ఎత్తులో ఉండగా, గంగోత్రి 10,200 అడుగుల ఎత్తులో ఉంది. విపరీతమైన ఎత్తులో ఉండడంతో పర్వతారోహణ చేస్తేనే ఆలయాన్ని సందర్శించవచ్చు.
అందులోనూ అక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ యాత్ర దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన యాత్రగా పరిగణిస్తారు. ఈ యాత్రకు వెళ్లే భక్తులకు ముందుగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. యాత్ర ప్రారంభమై, ముగిసేంత వరకు అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుంటారో లేదో చూస్తారు.
కేదార్ నాథ్ చేరుకోవడానికి సోన్ ప్రయాగ్ లోని భక్తులు వాహనాలు పార్క్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి 8 కి.మీల దూరంలో ఉన్న గౌరీకుండ్ కు భక్తులను తీసుకెళ్లేందుకు ప్రభుత్వ వాహనాలు ఉంటాయి. కానీ అవి తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది నడుచుకుంటూనే వెళ్లిపోతుంటారు.
ఆక్సిజన్ పడిపోతుంది, శ్వాస ఇబ్బందిగా ఉంటుంది:
ఇరుకైన దార్ల గుండా దాదాపు 16 కి.మీల ప్రయాణం చేయాల్సి ఉండగా.. మధ్యలో గుర్రాలు వెళ్తుంటే మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే షార్ట్ కట్ లలో వెళ్లాలంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయని.. దాని ద్వారా మనుషులు చాలా అలసిపోతారని చెబుతారు. ముఖ్యంగా చివరి 8 నుంచి 10 కిలో మీటర్లలో ఆక్సిజన్, ఉష్ణోగ్రత స్థాయిలు తరచుగా పడిపోవడం వంటివి జరుగుతుంటాయి. వీటి వల్లే మనుషులు ప్రాణాలు కోల్పోతారు. ముఖ్యంగా ఆక్సజిన్ స్థాయి 21శాతం కాగా నత్రజని 78 శాతంగా ఉంటుంది. వీటి వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతుంటారు.

ఆక్సిజన్ తగ్గితే శరీరం ఎలా ప్రభావితం అవుతుంది?
ఆక్సిజన్ స్థాయిలు తగ్గినప్పుడు శరీరం ప్రతిస్పందిస్తుంది. ఆక్సిజన్ తీసుకోవడం పెంచే ప్రయత్నంలో ఎక్కవ గాలిని పీలుస్తుంటాం. అయినప్పటికీ తక్కువ మొత్తంలోనే ఆక్సిజన్ మన కండరాలకు చేరుకుంటుంది.
తక్కువ తేమ కారణంగా, ఎత్తులో ఉన్న మొదటి కొన్ని గంటల్లో నీటి నష్టం పెరుగుతుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురవుతుంటారు. అప్పుడు మన శరీరం కూడా తక్కువ ఆక్సిజన్ స్థాయిని సర్దుబాటు చేయడానికి ప్రారంభిస్తుంది. కానీ దీనివల్ల కండర ద్రవ్యరాశికి రక్త నాళాల నిష్పత్తితో పాటు హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వృద్ధులకు, ఒత్తిడిని తట్టుకునే శక్తి తక్కువగా ఉండటం మరియు ధమనులలో అడ్డంకులు ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
గుండెపోటు వచ్చే ప్రమాదం!:
చార్ ధామ్ యాత్రకు వచ్చే వాళ్లలో మధుమేహం ఉన్న వాళ్లు ఉంటే లాక్టిక్ అసిడోసిస్ కారణంగా వ్యక్తి చనిపోవచ్చు. అలాగే ఈ యాత్రకు వచ్చిన వారిలో చాలా మంది గుండెపోటుతో చనిపోయిన వారే ఉన్నారు. "ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు కరోనరీ నాళాలు కుంచించుకుపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి.
దీంతో శరీరంలో రక్త సరఫరా తగ్గుతుంది. అటువంటి స్థితిలో మనం శారీరక శ్రమ చేసినప్పుడు, అది శరీరాన్ని మరింత ప్రభావితం చేస్తుంది. అందుకే చార్ ధామ్ యాత్ర ప్రమాదకరం అవుతుంటుంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు?
యాత్రను ప్లాన్ చేయడానికి ముందు అత్యంత ముఖ్యమైన దశ వైద్య పరీక్ష చేయించుకోవడం. అందుకు అవసరమైన అన్ని మందులను వెంట పెట్టుకొని వెళ్లడం చాలా మంచిది.



Click it and Unblock the Notifications











