For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంపశయ్య మీద ఉన్న భీష్ముని చూసి ద్రౌపది అపహాస్యం చేసింది ఎందుకు ?

|

అంపశయ్య మీద ఉన్న భీష్ముని చూసి ద్రౌపది అపహాస్యం చేసింది ఎందుకు ?

భీష్మ పితామహుడు మహాభారతంలో అత్యంత ముఖ్యమైన పాత్రలలో ఒకరు. అతను శoతనుడు మరియు గంగా దేవి కుమారుడు. గంగా దేవి , శంతనునితో పెళ్లి సందర్భంగా తనను వలచి వచ్చిన శంతనునికి తన బిడ్డల విషయంలో తాను ఎటువంటి చర్యకు పాల్పడినా, తనను ఏమీ అడగకూడదని షరతు పెట్టి వివాహమాడింది. తద్వారా వారిద్దరికీ పుట్టిన పిల్లలను వరుసగా 7 మందిని నదిలో వదిలేస్తూ వచ్చింది. ఈ పరిణామానికి కూడా వేరే కథ ఉన్నది. ఆ క్రమంలో శంతనుడు మనోవ్యధకు గురయ్యాడు. తద్వారా 8 వ సంతానాన్ని నదిలో విడువబోగా అడ్డుకున్న శoతనుడిని షరతు ప్రకారం గంగాదేవి వదిలేసి వెళ్ళిపోయింది.

గంగా దేవి వదిలి వెళ్ళిన పిదప, శంతనుడు మళ్ళీ సత్యవతిని వివాహం చేసుకున్నాడు. నిజానికి సత్యవతికి వ్యాసునితో పరాశరుడు జన్మించాడు. ఆ సందర్భంలో సత్యవతికి వ్యాసుడు, సుగంధం విరజిమ్మేలా వరాన్ని ప్రసాదించాడు. తద్వారా సత్యవతికి మత్స్యగంది అను నామధేయం కూడా ఉంది. తన తండ్రి సత్యవతిని పెళ్ళి చేసుకోవాలంటే భీష్ముడు సింహాసనాన్ని విడిచిపెట్టి, తన జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలన్న సత్యవతి తండ్రి కోరికను అనుసరించి భీష్ముడు ప్రతిజ్ఞ పూనాడు. ఆ కారణం చేత సింహాసనానికి కట్టుబడి ఉన్నాడు కానీ ఏనాడు కూడా సింహాసనాన్ని అధిష్టించాలని కోరుకోలేదు.

Why Did Draupadi Mock At Bhishma When He Was Lying On An Arrow Bed?

సత్యవతికి ఇద్దరు కుమారులు ఉన్నారు, వీరు చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు. వీరి పెళ్లి నేపద్యంలో భాగంగా భీష్ముడు కాశీరాజు యొక్క ముగ్గురు రాకుమార్తెలను అపహరించాడు. వారు అంబ, అంబిక మరియు అంబాలిక. అంబిక చిత్రాoగదుని, మరియు అంబాలిక విచిత్ర వీర్యుని పెళ్లి చేసుకొనుటకు అంగీకరించగా, అంబ మాత్రo వివాహాన్ని వ్యతిరేకించింది. దీనికి కారణం ఆమె చేడి దేశపు రాజైన శల్యుని ప్రేమించడమే. తద్వారా భీష్ముడు ఆమెని వదిలివేసినాడు. కానీ శల్యుడు ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించిన కారణంగా, ఆమె తిరిగి భీష్ముని కడకు వచ్చి తనను వివాహం చేసుకోమని అర్ధించగా, తాను జీవితమంతా వివాహం చేసుకోకుండా భీష్మ ప్రతిజ్ఞ చేసిన కారణాన వివాహమాడలేనని, తనను క్షమించమని ఆమె ప్రతిపాదనను తిరస్కరించాడు. ఈ కారణం వలన అంబ జీవితం అగమ్య గోచరంగా తయారయింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని అంటారు, కానీ ఇక్కడ జరిగిన తప్పు వలన ఆడ కూతురికి అన్యాయం జరిగిందని భావించిన అంబ, భీష్ముని పై కోపాన్ని పెంచుకుంది.

భీష్మ పితామహునికి అంబ శాపం :

నిరాశపడి, మనసు గాయపడిన కారణంగా జీవితం వ్యర్థమైన భావనకు గురైన అంబ భీష్ముని, నీ జీవితం కూడా అసంపూర్తిగా ముగుస్తుందని మరియు మరలా మనిషిగా జన్మించి, తన మరణానికి కారణం అవుతానని శాపమిచ్చింది. తద్వారా అంబ శిఖండిగా జన్మనెత్తింది. ప్రతీకారం తీర్చుకోవటానికి, అంబ తీవ్రమైన తపస్సు ద్వారా శివుడిని అనుగ్రహం పొందింది. తద్వారా ఒక ఆశీర్వాదంతో, ఆమె తదుపరి జీవితంలో పాంచాల రాజు ద్రుపదుని కుమార్తెగా జన్మించింది. ఈ అమ్మాయికి శిఖండి అనే పేరు వచ్చింది. ఆ అమ్మాయి జన్మించినప్పుడు, బాలుడిగా పెంచాలని ఆకాశంలో ఒక దైవిక ప్రవచనము వినిపించింది అని నమ్ముతారు. దృపదునికి దృష్టద్యుమ్నుడు అనే కొడుకు, ద్రౌపది అనే కూతురు కూడా ఉన్నది. ద్రౌపది పాండవుల భార్య.

అర్జునుడు భీష్ముని ఓడించుట :

మహాభారత యుద్ద సమయంలో భీష్ముని ఓడించడం అత్యంత క్లిష్టమైన అంశంగా పాండవులకు నెలకొంది. ఆ సమయంలో, ధర్మరాజు తో కూడిన పరివారం భీష్ముని కడకు వెళ్లి మిమ్ములను ఓడించే మార్గాన్ని ఉపదేశమిమ్మని అడగగా, భీష్ముడు వారి పై నున్న ప్రేమతో “ పేడి వ్యక్తితో నేను తలపడను” అని తెలిపాడు. తద్వారా మరుసటి రోజు తనకు తగిలిన బాణం అర్జునుడిది కాదని గుర్తించిన భీష్ముడు, అర్జునుడి ముందున్న శిఖండిని చూసి అస్త్ర సన్యాసం చేయగా, ఆ సమయాన అర్జునుడు భీష్మునిపై బాణాలను సంధించాడు. ఆ విధంగా అంబ శిఖండి రూపంలో తన పగను తీర్చుకుంది.

భీష్ముడు యుద్ధం చేసినన్ని రోజులు కర్ణుడు యుద్ధం చేయనని ప్రతిన పూనాడు, తద్వారా అంపశయ్య మీదకు భీష్ముడు చేరుకున్న తర్వాత కర్ణుడు భాద్యతను తీసుకున్నాడు. కానీ కర్ణుడు కేవలం రెండు రోజులే యుద్ధం చేశాడు.

భీష్మ పితామహునికి స్వచ్చంద మరణం వరం :

అయితే, భీష్మ పితామహుడు బాణాలు తగిలినా చనిపోలేదు. అర్జునుడు ఏర్పాటు చేసిన అంపశయ్య మీద, అతను సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈ స్వచ్చంద మరణానికి వెనుక కథ కూడా ఉంది. దీనికి కారణం అతను తన తండ్రి నుండి ఆశీర్వాదం పొందడమే. అతడు ఎన్నటికీ పెళ్లి చేసుకోకూడదని భీష్మప్రతిజ్ఞ చేశాక, అతని తండ్రి "స్వచ్చంద మరణం" లేదా స్వీయ - ప్రకటిత మరణం అనే వరాన్ని అతనికి ఇచ్చాడు. తద్వారా తాను కోరుకున్నప్పుడు మాత్రమే చనిపోతాడని అర్థం. అందువలన, అతడు అంపశయ్య మీద ఉన్నా కూడా మరణం లేకుండా ఉండగలిగాడు.

తద్వారా, అంపశయ్య మీద ఉన్నా కూడా పూర్తిగా యుద్ధాన్ని చూడగలిగాడు. నియమం ప్రకారం, ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత యుద్ధం నిలిపివేయబడుతుంది. ఈ సమయంలో, అందరు యోధులు అతని చుట్టూ కూర్చుని అతని తెలివైన ఉపన్యాసాలు వినేవారు.

భీష్ముని అపహాస్యం చేసిన ద్రౌపది :

ఒకరోజు, అతను తన బంధువులు మరియు యోధులు చూట్టూతా చేరి ఉన్న సమయాన, ద్రౌపది అక్కడకు వచ్చింది. ఆమె మనసులో లోతుగా ఏదో ఆలోచిస్తూ, అతనిని చూస్తూ ఆమె అపహాస్యం చేసింది. హస్తినాపురo రాణి ప్రమాణాలకు వ్యతిరేకంగా అలాంటి ప్రవర్తనను కలిగి ఉండకూడదని, నీ ప్రవర్తనను నేను వ్యతిరేకిస్తున్నా అని భీష్మ పితామహుడు ఆమెతో అసంతృప్తి వ్యక్తం చేసాడు. చివరగా ఒక నవ్వు నవ్వి, అత్యంత తెలివైన సమాధానం ఇచ్చింది ద్రౌపది. అంత పెద్ద రాజ ప్రాసాదంలో సభా మధ్యమున లైంగిక వేధింపులకు గురైనప్పుడు, కౌరవులకు, కురు రాజులు ప్రవర్తించిన విధానం ప్రమాణాలకు సరైనదిగా ఉన్నదా ? లేదా వారoదరిలో పెద్దవారై నిశ్శబ్దంగా, వారు చేస్తున్న పాశవిక చర్యను ఆపకుండా ఉన్న మీకు ఆ ప్రమాణాలు వర్తించవా ? అని అడిగింది. నిజానికి ద్రౌపది పడిన కష్టానికి అత్యంత భాద పడిన వారిలో భీష్ముడు ప్రధముడు. కానీ కొన్ని అనివార్యకారణాల కారణంగా ప్రతిఘటించలేక పోయాడు. ఆ పరిణామం వలన కురుక్షేత్రం జరిగి కౌరవనాశనం కూడా జరుగుతుందని తెలిసిన వాడు భీష్ముడు.

ద్రౌపది మాటలలోని అంతరార్ధాన్ని గ్రహించిన భీష్మ పితామహుడు, పశ్చాత్తాపానికిలోనై తనను క్షమించవలసినదిగా ద్రౌపదిని వేడుకున్నాడు. తర్వాతి కాలంలో కృష్ణుని సలహా మేరకు ఉత్తరాయణ కాలం తొలి ఏకాదశి రోజున తనకు తానే స్వయంగా నిర్ణయించుకుని ప్రాణం వదిలాడు భీష్ముడు. ఆరోజే భీష్మ ఏకాదశి లేదా తొలిఏకాదశిగా పిలుస్తారు.

English summary

Why Did Draupadi Mock At Bhishma When He Was Lying On An Arrow Bed?

Droupadi laughed at the pitiable condition of Bhishmapitamah, while he lay on the arrow bed after being attacked by Arjuna. He condemned Droupadi for a behavior against the standards of the Hastinapur Queen. However, Droupadi reminded him of the day when she was being molested by the Kouravas and Bhishma Pitamah had also gone against the standards then.
Story first published: Saturday, May 12, 2018, 19:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more