Latest Updates
-
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన బాదం నూనె..ఈజీగా చేసుకోండిలా -
పండగకైనా, పార్టీకైనా స్పెషల్ స్వీట్ మాల్పువా..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
శ్రావణ శుక్రవారం స్పెషల్.. అమ్మవారికి నైవేద్యంగా కమ్మనైన ఆవ పులిహోర ఇలా చేయండి.! -
అయినవారితో ఏకీభవించలేకపోతున్నారా.. ఈ విషయాల్లో మాత్రం ‘కాదు’ అని చెప్పాల్సిందే.! -
కొత్తగా ఏదైనా తినాలని ఉందా? ఒక్కసారి ఈ రవ్వ రొట్టె చేసి చూడండి..చచ్చేదాకా ఇదే కావాలంటారు! -
ప్రపంచ అవయవదాన దినోత్సవం.. ఆర్గాన్ డొనేషన్‌పై ఇప్పటికీ వీడని అపోహలు.. వాస్తవాలివే.! -
ఈ పొడి వేసి పచ్చిమిరపకాయ వేపుడు చేస్తే.. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు! -
చపాతీ పిండి ముద్ద మిగిలితే ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. వాడే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
బీపీ, కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే నల్ల వెల్లుల్లి.. దీని ప్రయోజనాలు అదుర్స్! -
దాబా స్టైల్ వెజ్ కీమా కర్రీ.. గ్రేవీలో ఈ రెండూ కలిపారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే.!
నల్లదారాన్ని అక్కడ కట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ పవర్ వస్తుందట...!
నల్లదారాన్ని నడుముకు కట్టుకోవడం వల్ల మన పొట్ట పెరగకుండా... నడుము పరిమాణాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందట.
మన దేశంలో చాలా మంది హిందువులు నలుపు రంగును ఇష్టపడరు. అయితే నల్లదారాన్ని కట్టుకునేందుకు మాత్రం ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా ఈ నల్లదారాన్ని పాదం పై భాగంలో, మెడ, నడుము లేదా మణికట్టు చుట్టూ కట్టుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. పూర్వం మన పెద్దలు కూడా వీటిని నమ్మేవారట. ఇదే సంప్రదాయాన్ని ఇప్పటికీ చాలా మంది హిందువులు ఆచరిస్తున్నారు.

ఈ నల్లదారాన్ని పవిత్రమైనదిగా నమ్ముతున్నారు. ఇది తమను ప్రతికూల శక్తి నుండి విముక్తి కలిగిస్తుందని నమ్ముతున్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఈ నల్ల దారాన్ని స్టైలిష్ గా కనిపించేలా ధరిస్తున్నారు. మరికొందరు దీని వల్ల తమకు లక్కీ కూడా కలసి వస్తుందని నమ్ముతారు. అంతేకాదు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. నల్లదారం ధరించడం వల్ల ఇంకా ఏయే ప్రయోజనాలు ఉన్నాయి.. నిజంగా నల్లదారం ధరిస్తే పైవన్నీ జరుగుతాయా? లేక ఇది మూఢనమ్మకమేనా అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...

నలుపు అంటే అయిష్టం..
మన దేశంలో నలుపు రంగు అంటే చాలా మంది అవిశ్వాసం. ఇది ప్రతికూల శక్తిని త్వరగా గ్రహిస్తుందని చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అందుకే ఏదైనా శుభకార్యాలలో నల్లటి దుస్తులు వంటి వాటిని ధరించడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. అయితే శాస్త్రీయ పరగా నలుపు వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో కిందికి స్క్రోల్ చేసి పరిశీలిద్దాం..

జీర్ణక్రియ సక్రమంగా..
నల్లదారాన్ని నడుముకు కట్టుకోవడం వల్ల మన పొట్ట పెరగకుండా... నడుము పరిమాణాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందట. అంతేకాదు జీవక్రియ సక్రమంగా జరిగేందుకు కూడా తోడ్పడుతుందట. నడుముకు అది టైట్ గా అనిపించిందంటే మనం బరువు తగ్గాలి అని అర్థం వస్తుందట.

కొవ్వును కరిగించడంలో..
అంతేకాదు ఈ నల్లదారం బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా నిరోధించేందుకు సహాయపడుతుంది. ఇది మన ఆరోగ్యంపై కొంత ప్రతికూల ప్రభావం కూడా చూపుతుందట.

వెన్నెముక బలంగా..
ఇది వెన్నెముకను బలంగా ఉండేందుకు కూడా సహాయపడుతుందట. ఇది వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చాలా మంది నమ్ముతారు. వెన్నునొప్పి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

సంతానోత్పత్తి పెరుగుదల..
నడుముపై నల్లదారాన్ని ధరించడం వల్ల ఇది సంతాన ఉత్పత్తికి కూడా సహాయపడుతుందట. ఇది నడుముకు దగ్గరగా ఉండటం వల్ల పునరుత్పత్తి అవయవాలను చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది.

జీవక్రియ సక్రమంగా..
ఈ నల్లదారం జీవక్రియ సక్రమంగా జరిగేందుకు సహాయపడుతుంది. శరీరంలోని ఏదైనా భాగాన్ని బిగించడం వల్ల మీ జీవక్రియ సక్రమంగా పని చేయడంలో మెరుగ్గా పని చేస్తుందట. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది.

రక్తపోటు నివారణ..
మన శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు కూడా ఇది సహాయపడుతుంది. అంతేకాదు రక్తపోటును నివారిస్తుంది. హిందూ మతంలోని ప్రజలు ఈ నల్లదారం వల్ల తమకు శని ప్రభావం తగ్గిపోతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు సానుకూల శక్తిని కూడా ఇస్తుందని నమ్ముతారు.

సాంప్రదాయకంగా లాభాలేమిటంటే..
* నల్లదారాన్ని ధరించే ముందు దానిని శని మరియు హనుమంతులకు అర్పించాలి. దీని వల్ల సానుకూల శక్తి లభిస్తుంది.
* పవిత్రమైన ముహూర్తాల్లో మాత్రమే ఈ దారాన్ని ధరించాలి. లేకపోతే దీని ప్రభావం అంతగా ఉండదు.
* శనీశ్వరుని నుండి ఆశీర్వాదం కోసం ధరిస్తారు.
* ఇతరుల నుండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దూరంగా ఉండేందుకు ఈ దారాన్ని ధరిస్తారు.

గాయత్రీ మంత్రం..
* ఈ నల్లదారాన్ని ధరించిన తర్వాత గాయత్రి మంత్రం జపించాలి. ఈ మంత్రాన్ని పఠించడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి.
* ఇప్పటికే మీరు మీ మణికట్టు మీద పసుపు, ఎరుపు లేదా కుంకుమ దారం ధరించి ఉంటే అలాంటి చేతుల్లో నల్లటి దారం ధరించకూడదు.
* నల్లదారం శనిని సూచిస్తుంది. కాబట్టి గ్రహాల కదలికను మరియు దశను (గ్రహ పాలన యొక్క కాలాలు) విశ్లేషించిన అనంతరమే ఈ దారాన్ని ధరించాలి.



Click it and Unblock the Notifications