Latest Updates
-
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన!
వివాహాది శుభకార్యాలలో అక్షింతలు ఎందుకు వేస్తారు? వాటి విశిష్టత ఏమి?
వివాహ శుభకార్యంలో జీలకర్ర , బెల్లం పెటటే వేళ , మాంగల్యధారణ వేళ వధువరులపై ఆహుతులు అక్షతలు చల్లి ఆశీర్వదించడం మన హిందూ సంప్రదాయం. వివాహ శుభకార్యాల్లోనే కాదు, ప్రతి శుభకార్యంలోనూ పెద్దలు, పిన్నలకు అక్షతలు వేసి 'దీర్ఘాయుష్మాన్ భవ' ,'చిరంజీవి భవ, సంతాన ప్రాప్తిరస్తు, ఆరోగ్యప్రాప్తిరస్తు, సుఖజీవన ప్రాప్తిరస్తు'అంటూ ఆశీర్వదిస్తుంటారు.
ఇక దైవసన్నిదిలో అయితే సరేసరి, పూజారైతే మంత్రక్షతలతో అందరినీ దీవిస్తారు. అక్షతలు నుండి వచ్చినవే అక్షింతలు, క్షతం కానవి అక్షతలు. అంటే రోకలిపోటుటకు విరగని శ్రేష్టమైన బియ్యం అన్నమాట .
ఇలాంటి బియ్యాన్ని పసుపు లేక కుంకుమతో, నేతితో కలిపి అక్షతలు తయారుచేస్తారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికీ ఒక్కో ధాన్యాన్ని దానా వస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాల్లో చంద్రుడికి దానవస్తువు బియ్యం.
మనిషి మనసుపై చంద్రుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అదే విధంగా చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనసుపై ప్రభావం చూపుతుందట. చల్లేవారి శరీరంలోని విద్యుత్‌ను, ఆశీస్సులు పుచ్చుకునేవారి శరీరంలోకి సరఫరా చేస్తాయి అక్షతలు. తద్వారా తమో, రజో, సాత్వికాలనే త్రిగుణాలకు కారకాలు అవుతాయి. కాబట్టి పెద్దల్లో ఉండే సాత్విక గుణం అక్షింతల ద్వారా పిల్లలకు చేరుతుందనే ఉద్దేశంతోనే శుభకార్యాల్లో వాటిని చల్లే సంప్రదాయం పెట్టారని శాస్త్రాలు చెబుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని విషయాలను ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

హిందు సంప్రదాయంలో అక్షింతల పరమార్థమేమి?
శాస్త్రీయంగా చూస్తే, మనిషి దేహం ఓ విద్యుత్ కేంద్రం. విద్యుత్ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిసి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి.మనుషుల్లో తమో, రజో, సాత్తియాకాలనే త్రిగుణాలకు కారకము. పెద్దలు వధువరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించే సమయంలో , దేహంలోని విద్యుత్తులో కొంత బాగం ఈ అక్షతలను తాకుతాయి .

హిందు సంప్రదాయంలో అక్షింతల పరమార్థమేమి?
ఈ కారణంగా అక్షతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిన్నలకు లభిస్తుందనేది మన నమ్మకం. పెద్దలు, విధ్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు, అత్తమమామలు వివాహ సమయంలో శుభకార్యాలలో మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పరమార్థం ఇదే..!

హిందు సంప్రదాయంలో అక్షింతల పరమార్థమేమి?
మరో సిద్ధాంతం ప్రకారం చూస్తే మనిషి దేహంలో విద్యుత్ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట, వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు, విద్యుత్ ప్రసార కేంద్రం కూడా. తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్ ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరుస్సు.

అక్షతలుగా ఉపయోగించే బియ్యానికి పసుపు కుంకుమలు కలపడం ఎందుకు?
ఆయుర్వేదం ప్రకారం చర్మ సంబంధ రోగాల్ని అడ్డుకునే శక్తి పసుపు కుంకుమకుంది , అక్షతలు వేసే వారికి ఎలాంటి రోగ సమస్యలున్నా, పుచ్చుకొనే వాళ్ళకి అవి సోకకుండా ఈ పసుపు కుంకుమలు నివారిస్తాయట. అంతే కాక పసుపు కుంకుమలు శుభానికి సంకేతాలు కూడా. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యం.

భగవద్గీతలో ప్రస్తావన:
అన్నాద్భవన్తి భూతాని అని మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టీ, తిరిగి ఈ జీవుడిని భగవంతుడిలోకి చేర్చడమే. అక్షతలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది.తెలుగులో ఈ అక్షతలని తలంబ్రాలు లేదా తలబ్రాలు అని కూడా అంటారు.తలను = తల యందు పోయబడే, ప్రాలు = బియ్యం అని అర్థం.

ధాన్యలక్ష్మికి ఆహ్వానం:
పూర్వం వధువు ధాన్యలక్ష్మిగా చెప్పబడింది. ఈ తలంబ్రాల కార్యక్రమంలో బియ్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ఓ వధువా! నీవు మా ఇంటికి వచ్చాక, మన ఇంట ధాన్యం ఇలా కుప్పతెప్పలుగా విరివిగా ఉండి, మన జీవనానికి ఆధారభూతమైన ధాన్యంతో మనం నిత్య సంపదల వాళ్ళమై తులతూగుతూ ఉండాలి అనే భావానికి అనుగుణంగా ఈ తలంబ్రాల కార్యక్రమం సాగుతుంది.

వివాహకర్మ పరమార్థం
వరుడు, వధువు శిరస్సులపై తలంబ్రాలు పోసుకొనే దానికి ముందు, వరుడు ముందుగా వధువు చేతిని దర్భతో తుడిచి, దోసిలిలో రెండు మార్లుగా బియ్యాన్ని వేసి, ఆ మీదట పాలని కొద్దిగా చల్లి తలంబ్రాలకి సిద్ధం చేస్తాడు. తలంబ్రాలు వేసాక వధువు ఇలా చెయ్యాలని ఒక పద్ధతి చెబుతుంది. ఈ కాలంలో పురోహితులే చేయించి పోయిస్తున్నారు.ఈ కన్య వంశాన్ని తరింపజేయుగాక పుణ్యం వృద్ధి చెందుగాక. శాంతి, పుష్టి, సంతోషం, అభివృద్ధి, విఘ్నాలు లేకపోవడం, ఆయురారోగ్యాలు అన్నీ వీరికి కల్గుగాక! అని చదువుతూ అక్షతారోపణం (తలంబ్రాలు పోయించడం) చేయిస్తారు. ఈ చేసిన వివాహకర్మ మొత్తం అక్షతము (నాశనము లేనిది) అగుగాక! అని దీని భావం.

అక్షతలలో, తలంబ్రాలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది.
మన పూర్వీకులు ఈ వివాహ శుభకార్యాలలో, ఇతర శుభకార్యాలలో ఏర్పాటు చేసిన సంప్రదాయాల్లో, ఆచారాల్లో ఇంత గూఢార్థం ఉంది. వివాహ సమయంలో నవదంపతులు కలిసి జీవించి ఉండాలనీ, ఆదర్శ దంపతులుగా మెలగాలనీ, వధూవరులపై ఆహుతులు అక్షంతలు చల్లి ఆశీర్వదిం చడమే అక్షతల కార్యక్రమంలోని అర్థం, పరమార్థం. దాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా మెలగాలి.



Click it and Unblock the Notifications











