For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పార్వతిపై బ్రహ్మ కన్నేశాడు, ముక్కోపి శివుడు బ్రహ్మకు అది లేకుండా చేశాడు, బ్రహ్మను అందుకే పూజించం

|

బ్రహ్మ దేవుడంటే అందరికీ నాలుగు తలల రూపమే గుర్తుకువస్తుంది. ఈ నాలుగు తలలూ నాలుగు వేదాలకి ప్రతిరూపం అని కొందరంటారు. అలాగే నాలుగు దిక్కులకీ ఆధారం అని అని కొందరు పేర్కొంటూ ఉంటారు. కానీ బ్రహ్మదేవుడికి సంబంధించిన నాలుగు తలలకీ సంబంధించి కొన్ని ఆసక్తికరమైన కథనాలున్నాయి. పూర్వం బ్రహ్మ, శతరూప అనే ఒక స్త్రీమూర్తిని సృష్టించాడు. వంద రకాలైన రూపాలను ధరించగల ఆ శతరూపని చూడగానే సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవునికే మతి చలించింది.

తన కూతురితో సమానురాలు అన్న విషయాన్ని కూడా గ్రహించకుండా బ్రహ్మ చూపు ఆమె మీదే నిలిచింది. ఆమె నాలుగు దిక్కులా సంచరిస్తుంటే ఆమెనే గమనించేందుకు బ్రహ్మకు నాలుగు తలలు ఉద్భవించాయి. వీటికి తోడుగా శతరూప ఊర్ధ్వముఖంగా పయనించేటప్పుడు, ఆమెనే చూస్తూ ఉండేందుకు ఐదో తల కూడా ఏర్పడింది. ఎప్పుడూ ఆమెనూ చూస్తూ ఆనందించేవాడు బ్రహ్మ.

బ్రహ్మ చేస్తున్న పనికి తగిన శిక్ష

బ్రహ్మ చేస్తున్న పనికి తగిన శిక్ష

ఇదంతా గమనించి ఈశ్వరుడు బ్రహ్మ చేస్తున్న పనికి తగిన శిక్ష విధించాలనుకున్నాడట. వెంటనే శివుడు తన త్రిశూలంతో బ్రహ్మదేవుని ఐదో శిరస్సుని ఖండించి వేశాడట. అలా ఖండించబడిన బ్రహ్మకపాలం బదరీనాధ్‌ క్షేత్రం దగ్గర పడిందని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఆ స్థలంలో కనుక పూర్వీకులకు పిండప్రదానాలను చేస్తే అధిక ఫలితం వస్తుందని భావిస్తారు.

లింగపు అంచుని చేరుకుంటే

లింగపు అంచుని చేరుకుంటే

ఇక బ్రహ్మ ఐదో తలకు సంబంధించి మరో కథ కూడా ఉంది. ఒకసారిబ్రహ్మవిష్ణువులలో ఎవరు గొప్ప అన్న వాదన బయలుదేరింది. ఆ వాదానికి విరుగుడుగా, శివుడు ఒక పరీక్షను పెట్టాడట. తాను ఒక లింగ రూపంలో ఉంటాననీ, ఎవరైతే ఆ లింగపు అంచుని చేరుకోగలుగుతారో వారు గొప్పవారని పరీక్ష పెట్టారు. ఆ పరీక్షకు బ్రహ్మ, విష్ణువులు ఇద్దరూ కూడా సరేనన్నారు.

శివలింగపు అంచులు కనిపించనేలేదు

శివలింగపు అంచులు కనిపించనేలేదు

పరమేశ్వరుడు చెప్పినట్లుగానే ఒక లింగరూపంలో వెలిశాడు. బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆ లింగాకారపు పైభాగాన్ని గుర్తించేందుకు ఎగిరిపోగా, విష్ణుమూర్తి వరాహ రూపంలో నేలని తవ్వుకుంటూ లింగపు అడుగుభాగాన్ని చేరుకునేందుకు సిద్ధపడ్డాడు.

ఎంతకాలం గడిచినా శివలింగపు అంచులు కనిపించనేలేదు. కానీ సృష్టికర్త అయిన తాను ఓటమిని ఒప్పుకోవడం ఏమిటన్న అహంకారం కలిగింది బ్రహ్మదేవునిలో. దాంతో తాను లింగపు పైభాగాన్ని దర్శించి వచ్చానని అబద్ధం చెప్పేశాడు. అంతేకాదు.. తన మాట నిజమేనంటూ ఒక మొగలిపూవు (కేతకి) చేత కూడా సాక్ష్యం చెప్పించాడు.

పరమేశ్వరునికి పట్టరాని కోపం వచ్చింది

పరమేశ్వరునికి పట్టరాని కోపం వచ్చింది

కానీ లయకారుడైన శివుని ముందు ఈ అబద్ధం చెల్లలేదు. పైగా తననే భ్రమింపచేయాలని చూసినందుకు ఆ పరమేశ్వరునికి పట్టరాని కోపం వచ్చింది. అంతే.. శివుని మూడో కంటికి బ్రహ్మకు ఉన్న ఐదో తల భస్మమైపోయింది. పైగా అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన దైవమే అబద్ధాన్ని పలకడంతో, ఇకమీదట బ్రహ్మ పూజలందుకునే అర్హతను కోల్పోతాడంటూ శపించాడు శివుడు. బ్రహ్మకు సాక్ష్యంగా నిలిచిన మొగలి పూవు కూడా ఇక మీదట పూజకు పనికిరాదంటూ శాసించాడు.

పార్వతీదేవి సౌందర్యానికి..

పార్వతీదేవి సౌందర్యానికి..

అయితే బ్రహ్మ ఐదో తలకు సంబంధించి మరో కథ కూడా ఉంది.

పార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు , బ్రహ్మ పంచముఖుడు, నాలుగు ముఖాలతో మంత్రోచ్చారణ చేస్తున్నాడు. అయితే బ్రహ్మ ఐదో తల (ఊర్ద్వముఖం) పార్వతీదేవి సౌందర్యానికి ముగ్దురాలైంది. అది గ్రహించిన పరమ శివునికి ఆగ్రహం వచ్చింది. బ్రహ్మకు బుద్ది చెప్పాలని చేయి చాచి ఒక దెబ్బ వేశాడు.

శివుడి అరచేతికి అతుక్కుపోయింది

శివుడి అరచేతికి అతుక్కుపోయింది

మహేశ్వరుడి చేతి దెబ్బ అంటే సామాన్యమైనది కాదు కదా.. దాని ప్రభావానికి బ్రహ్మ ఊర్ధ్వముఖం తెగిపోయింది కాని అది కింద పడలేదు. శివుడి అరచేతికి అతుక్కుపోయింది,ఎంత విదిలించిన అది ఆయన చేయిని వదలలేదు,క్రమక్రమంగా ఎండి చివరికి అది కపాలంగా మారిపోయింది. బ్రహ్మ అపరాధం చేశాడు.. దానికి శివుడు శిక్ష విధించాల్సి వచ్చింది.

పాపానికి ప్రాయశ్చిత్త మార్గం

పాపానికి ప్రాయశ్చిత్త మార్గం

అయితే అది సరాసరి బ్రహ్మ హత్యా పాతకంగా పరిణమించి ,ఆ పాపం అంతటి మహాదేవుడికి అంటింది. జగత్ప్రభువు,అంతటి తపశ్శాలికి ఆ పాపఫలం తప్పలేదు. దేవతలందరిని పిలిచి నిస్సంకోచంగా జరిగినదంతా వారికి చెప్పి తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గం ఏమిటొ సూచించమని పరమశివుడు అడిగాడు.

కపాలాన్నే భిక్షాపాత్రగా భావించి..

కపాలాన్నే భిక్షాపాత్రగా భావించి..

" శివా.. నీకు తెలియని ధర్మం లేదు.. ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి.. శాసించగలిగినవాడివి.. అయినా మా మీద కృపతో ఒక సలహా ఇవ్వమని కోరావు కనుక మా మేధస్సు పరిమితికి తోచింది చెబుతున్నాం.. ఈ కపాలాన్నే భిక్షాపాత్రగా భావించి,ఇంటింటికీ తిరుగుతూ ప్రతీచోటా నీ పాపం చెప్పుకుని భిక్షమడుగుతూ వెళ్లు... కొంత కాలానికి ఆ కపాలం రాలిపోవచ్చును అని చెప్పరు దేవతలు. "

పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు

పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు

పరమశివుడికి ఇది ఉచితం అనిపించింది. భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుచూ మళ్ళీ తన వివాహం జరిగిన చోటుకే చేరాడు. హిమాలయ పర్వతాలలో తాను పూర్వం కేదారేశ్వరుడుగా అవతరించాడు. అందుకు సంతసించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాలలోని శిఖరాలను, నదులను శివుడికి కానుకగా ఇచ్చేశాడు. అది తెలుసుకున్న నారాయణుడు శివుడి వద్దకు వచ్చి .. పరమశివా నీ అధీనంలో ఇన్ని శిఖరాలు ఉన్నాయికదా.. ఈ బదరీవనంలో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా అని అడిగాడట.. నారాయణుడు అంతటివాడు అడిగితే శివుడు తాను ఎలా ఇవ్వకుండా ఉండగలడా? పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు.. అప్పటి నుంచి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడా వెలిశాడని ప్రతీతి.

మహా యోగి వైరాగ్యానికి పరాకాష్ట

మహా యోగి వైరాగ్యానికి పరాకాష్ట

ఆ తరువాత శివుడు ఆయనదగ్గరకే భిక్షకు బయలుదేరాడు. ఆ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు. పరమ శివుదే నా దగ్గరికి భిక్షకి వస్తున్నాడు.. వాస్తవానికి ఇది ఆయన ఇల్లే, తన ఇంటికే ఆయన భిక్షకు వస్తున్నాడు అంటే అది ఆ మహా యోగి వైరాగ్యానికి పరాకాష్ట. ఈ అద్భుత సన్నివేశాన్ని జగత్విదితం చేయాలి. ఇది వాస్తవానికి శివక్షేత్రం,ఇందులో నేను( విష్ణువు) ఉన్నాను. ఇక్కడికి శివుడు బ్రహ్మ కపాల సహితుడై వస్తున్నాడు. చిరకాల శివ హస్త స్పర్శ వల్ల దానిలోని దుర్భావనలు అన్ని నశించిపోయాయి.

కపాలం కాస్తా ఊడి కిందపడిపోయి

కపాలం కాస్తా ఊడి కిందపడిపోయి

ఇప్పుడది పరమపవిత్రం దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి.. దానికితోడు విష్ణు శక్తి,శివ శక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి అని భావిస్తూ విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు.. అంతే ఆ కపాలం కాస్తా ఊడి కిందపడిపోయి శిలామయ శివలింగరూపంగా మారిపోయింది. అప్పటినుండి బదరీనారాయణుడి సన్నిధిలో ఉన్న శివలింగరూపధారి అయిన బ్రహ్మకపాలం మహా క్షేత్రమైంది, తమ పితృదేవతలను పునరావృతరహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునేవారికి రాజమార్గం అయ్యింది.

అదే బ్రహ్మకపాలం

అదే బ్రహ్మకపాలం

బ్రహ్మకపాలం బదరీనాధ్‌లో వుంది. బదరీనాధ్‌లోని ఆలయం అలకనంద అనే నది ఒడ్డునే ఉంది. ఆలయం దగ్గర నుంచి నది ఒడ్డు వెంటే, పొడవుగా ఉన్న మెట్లమీదుగా నడుచుకుంటూ సుమారు 50 గజాలు వెళితే.. అక్కడ నది ఒడ్డు పైన సుమారు పది అడుగుల పొడుగు, ఆరు అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల మందం ఉన్న ఒక బండ ఉంది. అదే మనం చెప్పుకునే బ్రహ్మకపాలం. ఆ బ్రహ్మ కపాలం దగ్గర పితృదేవతలకు శ్రాద్ధ కర్మ నిర్వర్తిస్తే, వారికి స్వర్గప్రాప్తి కలుగు తుందని విశ్వాసం.

శివుడు, విష్ణువు గొప్పవారు కాదు

శివుడు, విష్ణువు గొప్పవారు కాదు

అయితే బ్రహ్మ ఐదో తలకు నరికివేతకు సంబంధించి ఇంకో కథ కూడా ఉంది. ఒకసారి బ్రహ్మకు అహంకారం కలిగింది. దానితో అతను శివుడు, విష్ణువు తన కంటే గొప్పవారు కాదని వారిద్దరి కంటే తనే గొప్ప ప్రమాణాలు కలవాడినని, తననే మొదట పరిగణలోకి తీసుకోవాలని భక్తులతో అన్నారు. ఆయన తన ముందు వారి పాత్రలు ఏమీ లేదని అన్నారు. కానీ బ్రహ్మ సృష్టికర్త అని చెప్పాడు. ఇది విన్న బ్రహ్మ భక్తులు వినయంగా "అవును మీరే అత్యధికులు" అన్నారు.

శివుడు గొప్పవాడు

శివుడు గొప్పవాడు

అయితే, బ్రహ్మ భక్తులు విష్ణు తార్కికతతో ఏకీభవించలేదు. వారు విష్ణువు అన్నది బ్రహ్మతో విన్నంవించారు. అప్పుడు బ్రహ్మ, విష్ణువు పోట్లాడుకోవటం ఆరంభించారు. వారి వివాదం ఎంతకీ తెగటంలేదు. ఆ సమయంలో, శివుడు అటువైపుగా ప్రయాణిస్తున్నాడు.. విష్ణువు చివరకు నువ్వు నేను కాదు.. శివుడు గొప్పవాడని చెప్పాడు. శివుడు విష్ణువు ప్రకటనకు గర్వంగా ఫీలయ్యాడు. కాని బ్రహ్మ గట్టిగా శివుడిని వ్యతిరేకించాడు. శివుడు దయ్యాలు, రాక్షసులు మొదలైనవారితో మాత్రమే మెలుగుతాడు అని బ్రహ్మ అన్నాడు.

బ్రహ్మ ఐదో తల నరికాడు

బ్రహ్మ ఐదో తల నరికాడు

అతను ఎలా గొప్పవాడు అని బ్రహ్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మాటలు విన్న శివుడు కోపంతో ఊగిపోయాడు. దీంతో శివుడు బ్రహ్మ ఐదో తల నరికాడు. బ్రహ్మ చనిపోయి నేలకొరిగాడు. బ్రహ్మ ను అలా చూసి శివుడు బాధపడ్డాడు. అందుకే శివుడు తిరిగి బ్రహ్మకు ప్రాణం పోశాడు కానీ బ్రహ్మ కేవలం నాలుగు తలలతోనే బతకగలిగాడు. ఇలా భిన్నమైన కథలున్నాయి. మొత్తానికి బ్రహ్మదేవుడు తప్పు చేశాడని అందుకే అతని ఐదో తలను శివుడు నరికాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే బ్రహ్మను పూజించర అని అంటారు.

English summary

why lord shiva had cut fifth head of brahma

why lord shiva had cut fifth head of brahma
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more