Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
శ్రీనివాసుడికి శనివారమే ఎందుకు ప్రీతికరం ?
పురాణాలలో ఏయే వారాలలో ఏ దేవుని పూజిస్తే ఫలితం ఉంటుందో నిర్ణయించారు. అంటే.. ఆదివారం సూర్యభగవానుడు, సోమవారం శివుడు, మంగళవారం సుబ్రమణ్యస్వామి, ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్పస్వామి, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకం. ఇలా ఒక్కో రోజుని ఒక్కో దేవునికి ప్రత్యేకంగా చెప్పబడింది.
వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేకం కావడంతో.. ఆ రోజు ఆ దేవుడికి పూజలు, దర్శనాలు చేసుకుంటారు. కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం శ్రీనివాసుడు. ప్రతి భక్తుడు ఆ అలంకారప్రియుడిని శనివారమే దర్శించుకోవాలని భావిస్తాడు. ఇంతకీ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎందుకు ప్రత్యేకం ? ఆ రోజే ఏడుకొండల వాడిని పూజించాలా ? మిగిలిన రోజుల్లో శ్రీనివాసుడి కరుణాకటాక్షాలు పొందలేమా ?

సాధారణంగా శనివారం అంటే శనిదోషాల నివృత్తి కోసం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధిస్తారు. వెంకటేశ్వర స్వామిని శనివారం పూజించడం వెనక చాలా కారణాలే ఉన్నాయి. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం కావడం, శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం కావడం, వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్ట మొదటి సారి దర్శించిన రోజు శనివారం కావడం, ఆలయం నిర్మాణం చేయమని శ్ర్రీనివాసుడు తొండమాను చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారమే కావడంతో వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరంగా మారింది.
అలాగే శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసినది కూడా శనివారమే కావడం విశేషం. అంతేకాదు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహమాడినది కూడా శనివారం అవడంతో శనివారానికి, శ్రీనివాసుడికి గట్టి బంధం ఏర్పడింది. అలాగే శ్రీనివాసుని సుదర్శనం పుట్టిన రోజు కూడా శనివారం అవడంతో.. ఆ ఏడుకొండల స్వామి వేంకటేశ్వరునికి శనివారం అంటే అత్యంత ప్రీతికరమైనది. అందుకే ప్రతి భక్తుడూ శనివారమే.. ఆ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలని కోరుకుంటాడు.



Click it and Unblock the Notifications