Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
Makar sankranti 2025: సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా? ఎవరికీ తెలియని అసలు కథ ఇదేనండోయ్!
సంక్రాంతి వచ్చిదంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో సందడి, సరదా నెలకొంటుంది. అందుకే సంక్రాంతిని సరదాల సంక్రాంతి అని కూడా పిలుస్తుంటారు. వాకిట్లో రంగు రంగుల ముగ్గులు, హరిదాసుల సందడులు, వంటింట్లో గుమగుమలాడే పిండి వంటలు, బంధువుల కేరింతలు. ఇవన్నీ కలిపితే సంక్రాంతి మనకు కనుల పండువగా కనిపిస్తుంటుంది. ఈ సంక్రాంతికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గాలిపటాలు ఎగిరేస్తూ ఉంటారు. పెద్దలు కూడా చిన్న పిల్లల మాదిరిగా అయిపోయి పంతగులను ఎగరేస్తారు. అసలు సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగరేస్తారు? దాని వెనుక న్నా అసలు కథ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దేవుళ్ల ఆహ్వానం కోసం
సంక్రాంతికి పంతంగులు ఎగరేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. సాధారణంగా సంక్రాంతి చలికాలంలో వస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తాడు. అందుకే సూర్యుడిని అంకితం చేస్తూ గాలిపటాన్ని ఎగరేస్తారు. అలాగే చలికాలం పూర్తయి వసంతంలోకి అడుగుపెడుతున్నామని చెప్పడానికి ఈ పంతంగులను ఎగరేస్తారని పెద్దలు చెబుతుంటారు. అలాగే దేవతలు ఆరు నెలల తరువాత సంక్రాంతికి నిద్ర నుంచి మేల్కొంటారట. వారిని స్వాగతం పలికేందుకు ఆకాశంలో పంతంగులను ఎగరేస్తారని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే పురాణాల ప్రకారం శ్రీరాముడు.. హనుమంతుడితో పాటు తన తమ్ముళ్లు లక్ష్మణుడు, ఇతరులతో కలిసి సంక్రాంతి రోజున గాలిపటం ఎగరేశారని, అప్పటి నుంచి సంక్రాంతికి గాలిపటం ఎగరేసే సంప్రదాయం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.
ఆరోగ్యం కోసం కూడా
గాలిపటం ఎగరేయడం కేవలం వినోదం కోసం మాత్రమే కాదు.. గాలిపటం ఎగరేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఈ గాలిపటాన్ని ఎగరేయడం వల్ల సూర్యుని నుంచి వచ్చే సూర్యకిరణాలు మన శరీరంపై నేరుగా పడతాయి. దీనివల్ల శరీరానికి ఎంతగానో అవసరమైన విటమిన్ డీ పుష్కలంగా లభిస్తుంది. ఫలితంగా విటమిన్ డీ కొరకు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. దీంతో పాటు ఎండలో ఉండడం వల్ల ఆహ్లాదకరమైన ప్రశాంతత దొరుకుతుంది. అలాగే గుండెకు కూడా చాలా మంచిది.
సుమారు 2 వేల సంవత్సరాల క్రితం నాటి నుంచే గాలిపటం ఎగరేస్తున్నారు. మొడ్డమొదటిగా చైనాలో గాలిపటం ఎగరేశారని చెబుతుంటారు. అప్పటి నుంచి గాలిపటం ఎగరేసే సంప్రదాయం వచ్చిందని నమ్ముతుంటారు. కానీ అందులో నిజం లేదని కొందరి వాదన. మన దేశంలోని చాలా ప్రాంతాల్లో గాలిపటాలను ఎగరేస్తుంటారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను జరుపుకునేటప్పుడు ఈ గాలిపటాన్ని ఎగరేస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గాలిపటాలను ఎగరేస్తూ పండగను జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications
