For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించడాన్ని ఎందుకు ఇష్టపడతారు?

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించడాన్ని ఎందుకు ఇష్టపడతారు?

|

శ్రావణ మాసంను మనని ప్రకృతితో ముడిపెట్టే ఒక పవిత్రమైన నెలగా భావిస్తారు. శివునికి నీటిని సమర్పించడంలోనే, ప్రకృతితో మనకు ఉన్న అనుబంధం కనిపిస్తుంది. ప్రకృతి యొక్క రంగు ఆకుపచ్చ. పచ్చదనంతోనే మన అదృష్టం పెనవేసుకుని ఉంటుంది. ఆకుపచ్చని వస్త్రాలను ధరించడం శుభసూచకమే కాక, మనకు అదృష్టం తీసుకువస్తుంది. అంతేకాక,ఈ విధంగా మనం ప్రకృతికి కృతజ్ఞతను తెలుపవచ్చు. మహిళలు ఎక్కువగా ఆకుపచ్చని గాజులు ధరించడాన్ని ఇష్టపడతారు. చాలా మంది స్త్రీలు ఆకుపచ్చని చీరలు మరియు దుస్తులు ధరిస్తారు.

ఆకుపచ్చ రంగుకు హిందూ వివాహ క్రతువుకు విడదీయరాని సంబంధం ఉంది.

హిందూ మతంలో ఆకుపచ్చ రంగు వివాహంతో సంబంధం కలిగి ఉంది. ఎరుపు వలె, ఆకుపచ్చ రంగు కూడా, ఒక వివాహిత జీవితంలో మంచి అదృష్టం మరియు ఆనందం తీసుకునివస్తుందని నమ్ముతారు. అందువల్ల, మహిళలు కూడా వారి ఆనందకరమైన వైవాహిక జీవితం కోసం, భర్త యొక్క సుదీర్ఘ ఆయుష్షు కొరకు ఆ పరమశివుని ఆశీర్వాదం పొందడానికి ఆకుపచ్చ రంగు గాజులు మరియు ఆకుపచ్చ దుస్తులను ధరిస్తారు.

Why Women Should Prefer Green Colour During The Shravan Month

ఆకుపచ్చరంగు ప్రకృతి పట్ల కృతజ్ఞతకు మరియు అదృష్టంకు సంకేతం.

హిందూ గ్రంథాలలో ప్రస్తావించినట్లు, మనం ప్రకృతిని వివిధ రూపాల్లో ఆరాధిస్తాము. తులసి, మర్రి మరియు అరటి మొక్కలను హిందూమతంలో పవిత్రమైనవిగా భావిస్తారు. మనం ప్రకృతి పట్ల మనకున్న కృతజ్ఞతను చూపటంలో భాగంగా, నీటికి, సూర్యునికి, దైవిక శక్తులుగా భావించి ప్రార్ధన చేస్తాము. పచ్చని రంగులను ధరించిన వ్యక్తి, ప్రకృతి చేత ఆశీర్వదింపబడతారని నమ్ముతారు.

వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఆకుపచ్చ రంగు

బుధుడు, ఒక వ్యక్తి యొక్క ప్రగతి మరియు వృత్తిల నిర్దేశకుడు. బుధ దేవుడు, బుధ గ్రహం యొక్క అధిపతి. ఆకుపచ్చ రంగు అతనికి ప్రీతిపాత్రమైనది. అందువలన, ఆకుపచ్చ రంగు ధరించడం ద్వారా వృత్తిపరంగా మంచి అదృష్టం కలుగుతుంది.

శివుడు ఒక యోగి, ప్రకృతి సౌందర్యం మధ్య ధ్యానం చేయడం ఆయనకు చాలా ఇష్టం. ఆకు పచ్చని రంగు ధరించడం, శివుడు సంతోషపరచగల అనేక మార్గాల్లో ఒకటి. అంతేకాదు , ఇది విష్ణువును కూడా ఆనందిపచేస్తుంది.

అందువల్ల, శ్రావణ మాసంలో దేశవ్యాప్తంగా మహిళలు ఆకుపచ్చ రంగును ధరించడానికి ఇష్టపడతారు. దీని వెనుక వివిధ కారణాలు ఉన్నాయి. ముందుగానే సన్నాహాలు చేసుకుని, దేవుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో మరియు అంకితభావంతో పూజిస్తారు. ఈ సంవత్సరం శ్రావణ మాసం ఉత్తర భారతదేశంలో జూలై 28వ తేదీ నుండి, దక్షిణ భారతదేశంలో ఆగష్టు 12వ తేదీ నుండి ప్రారంభమవుతుంది.

ఈ ప్రాంతాల్లోని వారు అనుసరించే క్యాలెండర్లలో ఉన్న వ్యత్యాసం కారణంగా తేదీలు మారుతూ ఉంటాయి. ఏదేమైనా, పండుగలు మాత్రం ఒకటే తేదీలలో వస్తాయి. పండుగలు వచ్చే నెల యొక్క పేరులో మాత్రమే తేడా ఉంటుంది.

శ్రావణ మాసం మరియు ప్రకృతి ఆరాధన:

శ్రావణ మాసపు కథ లక్ష్మి దేవి, విష్ణువు మీద అలుకబూని వైకుంఠం విడిచిపెట్టి వెళ్లిన కాలం నాటిది. తరువాత కాలంలో దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మధనం జరిపినప్పుడు లక్ష్మీ దేవి మళ్ళా సాక్షాత్కరించింది.

కానీ లక్ష్మీ దేవి ఆవిర్భావంనకు ముందు, ఒక కుండ ఉద్భవించింది. ఆ కుండలోని పదార్ధానికి, అక్కడ ఉన్న వారందరిని దహించివేసే శక్తి ఉందని వారంతా భావించారు. అప్పుడు శివుడు, వారందరి రక్షణార్ధం ఆ కుండలోని పదార్థాన్ని తన గొంతులో దాచుకున్నాడు. అప్పుడు అతని కంఠం నీలం రంగులోకి మారింది. ఈ సంఘటన వలన ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. దాని "నీలం రంగులో ఉన్న కంఠం కలిగి ఉన్నవాడు" అని అర్ధం.

శివుని శరీరం విషనిరోధకమని ప్రతి ఒక్కరికి తెలుసినప్పటికీ, అతని శరీరం మీద విషం యొక్క దుష్ప్రభావాలను నివారించడానికి గంగా నది యొక్క జలం అతనికి ఇవ్వబడింది. అందువలన గంగానదీ జలాన్ని అమృతంగా పేర్కొంటారు.

శ్రావణ మాసం: చిన్న చిన్న పనులే మనను శివుని కృపకు పాత్రులను చేస్తాయి.

హిందూమతంలో ప్రకృతి ఆరాధనకు ఎంతో ప్రఖ్యాత ప్రాధాన్యత ఇవ్వబడటానికి ఇది మరొక కారణం. అంతేకాకుండా, ఈ సంఘటన జరిగినది శ్రావణ మాసంలోనే కనుక, ఈ నెలను ప్రధానంగా శివునికి అంకితం చేసారు.

English summary

Why Women Should Prefer Green Colour During The Shravan Month

Shravana is the month of festivals. Amongst the various rituals practised in the month, wearing green colour is the most prevalent one. There are various implications of the colour green, amongst which, its auspiciousness for marriage and good luck and being dear to Budh Deva, the lord of Mercury, the planet which is associated with career and professional growth,
Desktop Bottom Promotion