Latest Updates
-
పొద్దున్నే 9 గంటలలోపు ఈ 5 పనులు చేస్తే.. మీ ఆయుష్షు 20 ఏళ్లు పెరుగుతుంది! -
శరీరంలో చెత్త మొత్తాన్ని తొలగించి, లివర్ ని శుభ్రపర్చే టీ ..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
చలికాలంలో దగ్గు, జలుబు మాయం చేసే సూప్ ఇదే..ఇడ్లీతో ముంచుకుని తిన్నా కేక -
అందమైన అమ్మాయి పిలిచిందని వెళ్తే..యువకుడికి ఊహించని షాక్! -
విటమిన్ A, C, K, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ కూర తింటే చలికాలంలో రోగాలన్నీ పరార్! -
బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే రవ్వ బన్ అప్పం.. తింటే వదలరు..10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
కీళ్ల నొప్పులు మాయం చేసే 1:4 మ్యాజిక్..ఇలా చేస్తే జీవితంలో మోకాళ్ల నొప్పులు రావు! -
చలికాలంలో ఎముకలను దృఢంగా ఉంచే రాగి మునగాకు రోటీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
టపాసుల నిప్పురవ్వలు పడి చర్మం కాలితే వెంటనే చేయాల్సిన, చేయకూడని పనులివే! -
దీపావళి స్పెషల్..బ్యాచిలర్స్ కూడా సులభంగా వండేలా.. అదిరిపోయే పొల్లాచి చికెన్ బిర్యానీ చేసుకోండిలా..
పురాణాల ప్రకారం ఉత్తరం వైపు ఎందుకు పడుకోకూడదు ?
ఉత్తరంవైపు తిరిగి పడుకోకూడదని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. ఎందుకు ఉత్తరం వైపు తిరిగి పడుకోకూడని ఎప్పుడు ఆలోచించారా ? దీనికి చాలా కారణాలు, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. పెద్దవాళ్ల మాటలు ఊరికే పోవు. వాళ్లు ఏ సంప్రదాయం తీసుకొచ్చినా.. అందులో చాలా ప్రాధాన్యతలుంటాయి. ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకపోవడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకవేళ ఉత్తరం దిశగా తలచేసి పడుకోవడం వల్ల ఖచ్చితంగా చెడు కలలు వస్తాయని.. అవి మన మనసుని దెబ్బతీసేలా ఉంటాయట. ఉత్తరం దిశగా పడుకోవడం వల్ల మన శరీరం పాజిటివ్ ఎనర్జీని కోల్పోతుంది. ఇది ఒక ముఖ్యమైన కారణం. పూర్వీకుల నుంచి చెబుతున్న అద్భుతమైన నమ్మకం ఇది.
అంతేకాదు హిందూ పురాణాల ప్రకారం గణపతి తలకు ఏనుగు తల పెట్టడానికి కూడా ఈ నార్త్ డైరెక్షన్ తో సంబంధముంది. ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇంకా నార్త్ డైరెక్షన్ లో నిద్రించకపోవడం వెనక ఉన్న మరిన్ని కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

పార్వతి
పార్వతీ దేవి పుణ్యస్నానానికి వెళ్లినప్పుడు గణపతిని తలుపు దగ్గర కాపాలాగా పెడుతుంది. ఎవరినీ లోపలికి రానివ్వకుండా చూసుకోవాలని వినాయకుడికి సూచిస్తుంది పార్వతిదేవి. అయితే అప్పుడు శివుడు పార్వతిని చూడటానికి వచ్చి.. తనను లోపలికి అనుమతించాలని వినాయకుడిని కోరుతాడు.

శివుడితో గొడవ
కానీ వినాయకుడికి శివుడు పార్వతిదేవి భర్త అని తెలిసినా కూడా.. పార్వతిదేవిని చూడటానికి శివుడిని లోపలికి వెళ్లనివ్వకుండా.. అడ్డుకుంటాడు.

వినాయకుడి తల
పార్వతీదేవి పుణ్యస్నానం పూర్తయిన తర్వాత బయటకు వచ్చి చూసేసరికి.. గణపతి, శివుడు గొడవ పడుతూ ఉంటారు. శివుడు తీవ్ర ఆగ్రహానికి లోనై.. అతని బటులతో వినాయకుడి తల నరికించేస్తాడు.

కోపంతో పార్వతి
పార్వతీదేవి చాలా ఆగ్రహానికి లోనవుతుంది. తన బిడ్డను తిరికి కాపాడాలని మొండిపట్టుదలగా ఉంటుంది. దీంతో ఆ శివుడు.. ఉత్తరం దిశగా పడుకున్న తలను నరికి తీసుకురావాలని ఆదేశిస్తారు.

ఉత్తరం దిశ
శివుడి ఆదేశంలో.. అతని బటులు.. ఉత్తరం దిశగా నిద్రిస్తున్న జీవుల కోసం వెతుకుతారు.

ఏనుగు తల
శివుడి అనుచరులు ఉత్తరం దిశగా పడుకున్న ఏనుగును చూస్తారు. దీంతో ఏనుగు తల నరికి తీసుకెళ్లి శివుడికి ఇస్తారు. ఇలా ఉత్తరంవైపు పడుకున్న జీవి తల తీసుకురమన్నాడు కాబట్టి.. ఇటువైపు తిరిగి పడుకోకూడదనే ఒక నమ్మకం మొదలైంది.

వినాయకుడు
ఇలా వినాయకుడు మళ్లీ ఏనుగు తలతో పునర్ జన్మ పొందుతారు. ఆ తర్వాత అందరి దేవుడిగా వినాయకుడు మారిపోయాడు. ప్రజలు ముందుగా పూజించే దైవంగా వినాయకుడు ఉంటాడని శివుడు పార్వతికి మాటిస్తాడు.

సైంటిఫిక్ రీజన్స్
మనం ఉత్తరం దిశగా తలపెట్టి పడుకోవడం వల్ల.. మన శరీరంలో రక్త ప్రసరణకు ఆటకం అవుతుందని, దీనివల్ల నిద్రలో ఆటంకం ఏర్పడుతుందని సైన్స్ చెబుతుంది. అలాగే మనలోనే ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోతాయట.

నిద్రించడానికి అనుకూలమైన దిశలు
హిందూ పురాణాల ప్రకారం తూర్పు లేదా పడమర వైపు నిద్రించడం మంచిది. దీని వల్ల బ్లడ్ సర్కులేషన్ పెరిగి, ఆరోగ్యం బావుంటుందని ఒక నమ్మకం ఉంది.



Click it and Unblock the Notifications
