Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
స్త్రీలు ఈ పనులు చేస్తే వెంటనే విధవలైపోతారు.. జీవితాంతం దుఖ్ఖాన్ని అనుభవిస్తారు..!
మహిళలు తొందరగా విధవ కావడానికి కొన్ని ప్రత్యేక కారణాలు వున్నాయని హిందూ శాస్త్రం మనకు చెబుతోంది. స్త్రీలు ఏ పనులు చేస్తే ఎప్పుడూ దరిద్ర బాధలను అనుభవిస్తారో, జీవితాంతం ఎందుకు కష్టాలను అనుభవిస్తూ వుంటారో తెలుసుకుందాం. ఈ అన్నింటికీ సమాధానాలను సాక్షాత్తు చవన మహర్శి భార్య సుకన్యా దేవి సమాధానాన్ని తెలిపింది. చాలా మందికి పురాణాల్లో వున్న సుకన్యా దేవి గురించి తెలియదు. పూర్వం శర్యాతి మహారాజు వుండేవాడు. ఆయనకు 400ల మంది భార్యలున్నా సంతానం లేదు. ఎన్నో పూజలు చేస్తే ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడబిడ్డకు సుకన్యా అని నామకరణం చేశాడు. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశాడు ఈ సుకన్యా దేవిని. సుకన్యా దేవి మంచి అందగత్తె చిన్నప్పుడే గురువుల దగ్గర మంచి అభ్యాసం చేసింది. సంగీతంతో పాటు నాట్యం అన్నీ చదువుకుంది. శర్యాతి మహారాజు సుకన్యా దేవికి పెళ్లి చేయాలని ఆలోచిస్తూ వుంటే ఒక రోజు ఈ సుకన్యా దేవి ఉద్యానవనంలో ఆడుకోవడానికి వెళ్తుంది.

చవన మహర్శి కళ్లు తెరిచి తపస్సు చేసేవాడు. అలా తపస్సు చేస్తూ వుంటే శరీరం చుట్టూ పుట్ట ఏర్పడుతుంది. కళ్లు వింతగా మెరుస్తుండడంతో అప్పుడు చవన మహర్శి రెండు కళ్లనూ పొడిచేస్తుంది. కళ్లల్లోంచి రక్తం వస్తుంది. వెంటనే భయపడి సుకన్యా దేవి అక్కడి నుంచి పారిపోతుంది. చవన మహర్శితో పాటు రాజ్యంలోని అందరికీ మలమూత్ర భంగం ఏర్పడుతుంది. దీంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆ రాజ్యంలోని రాజు చవన మహర్శి పాదాల మీద పడతాడు. 100 మందిని పెట్టి వారు మీకు సేవలు చేసేలా చేస్తానని మహారాజు అంటాడు. డబ్బులు తీసుకున్నవారు సేవలు చేయరు, నా అనుకున్న వాళ్లు మాత్రమే సేవలు చేస్తారని అంటాడు. నా కూతురుని ఇచ్చి మీకు పెళ్లి చేస్తానని చవన మహర్శి అంటాడు.
నా వల్ల చవన మహర్శి కళ్లు పోయింది కాబట్టి నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటానని సుకన్యా దేవి ముందుకు వస్తుంది. అప్పటి నుంచి ఆయనకు ఎన్నో సేవలను ఆమె చేస్తూ వస్తోంది. సుకన్యా దేవిని పెళ్లి చేసుకుంటానని సూర్య దేవుని పుత్రులు అంటారు. నేను చవని మహర్శి భార్యను ఎట్టిపరిస్థితుల్లో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను అంటుంది. ఆమె పురాణాల్లో మహాపతివ్రతగా పేరు గాంచింది. కొంతమంది స్త్రీలు వచ్చి సుకన్యా దేవిని ప్రశ్నలు అడుగుతారు. నువ్వు చవన మహర్శి అర్ధాంగివి, ఎటువంటి స్త్రీలు తొందరగా విధవ అవుతారని అడుగుతుంది. స్త్రీలు ఎటువంటి పనులు చేయడం వల్ల దుఖం అనుభవించాల్సి వస్తుందో చెప్పమంటాడు. ఈ సందర్భంగా స్త్రీలకు కొన్ని అద్భుతమైన విషయాన్ని చెబుతుంది.

స్త్రీలు పొరపాటును కూడా 8 పనులు అస్సలు చేయకూడదని సుకన్యా దేవి చెబుతుంది. ఈ ఎనిమిది పనులు చేసిన వారు త్వరగా విధవలౌతారని అంటుంది. మొదటిది.. పుడకను స్త్రీలు ఎట్టిపరిస్థితిల్లో తొక్కవద్దు. ఒక వేళ తొక్కినట్లయితే స్త్రీలు జీవితాంతం ఏడుస్తూ బాధలు పడవలసి వస్తుంది. స్త్రీలు జీవితాంతం కన్నీళ్లు కార్చవలసిందే, కష్టాలు పడవలసిందే. రెండవది.. చేతికి ధరించిన గాజులకు కూడా పగలగొట్టరాదు. గాజులను అమ్మవారు స్త్రీలకు ప్రసాదించిన భాగ్యవస్తువు కాబట్టి పగులకొట్టుకోవద్దని చెబుతారు.
మూడవది.. పళ్లు తోమకుండా ఏమి తినవద్దు, కనీసం తాగవద్దు. నాల్గవది.. ఉదయం, సాయంత్రం సమయంలో నిద్రపోయే వారు జీవితంలో చాలా కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. నాల్గవది.. పసుపు, కుంకుమ, ఉప్పును కాళితో తొక్కవద్దు. 5వది.. స్త్రీలు భర్తను ఏకవచనంతో పిలవరాదు, భర్తకు శాపనార్ధాలు పెడితే కూడా తొందరగా విధవ అవుతారు. 6వది.. స్త్రీలు నోటితో దీపాన్ని ఆర్పరాదు. నోటి ఎంగిలి అగ్నిదేవుడిపై పడితే ఆ స్త్రీ విధవ అయ్యే పరిస్థితి వస్తుంది. 7వది.. మంగళ సూత్రాన్ని ఎప్పుడంటే అప్పుడు తీయవద్దు. ఇటువంటి తప్పులను స్త్రీలు ఎట్టిపరిస్థితిలో చేయవద్దని మహాపతివ్రత అయిన సుకన్యా దేవి తెలిపింది.



Click it and Unblock the Notifications