Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
శ్రావణమాసంలో శివ పూజ, ఈ 5 ఆకులతో కొలిస్తే పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు, అదృష్టం వరిస్తుంది
శ్రావణమాసం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నెల. ఈ నెలలో శివుడిని కొలిస్తే, ఏకాగ్రతతో పరమేశ్వరుడిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. శ్రావణ సోమవారం రోజు ప్రత్యేక పూజలు, ఆరాధనలు, అభిషేకాలు, శివ మంత్రాల పఠనంతో తమకు నచ్చిన విధంగా పూజిస్తే పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడని, అదృష్టం వరిస్తుందని అంటారు. అయితే శివయ్యకు చేసే పూజలు కొన్ని రకాల వస్తువులను వాడితే మరింత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. దేవదేవుడికి ఇష్టమైన కొన్ని ఆకులను పూజలు భాగం చేయడం వల్ల ఆయన సంతోషిస్తాడు భావిస్తారు.

శివుడిని భోళా శంకరుడు అని కూడా అంటారు. చిన్న పాటి పూజతో అయిన ఆయన సంతోషిస్తాడు. నియమ నిబంధనలకు లోబడి చేసే పూజాది కార్యక్రమాలతో ఆయన ప్రసన్నమవుతాడు. అందుకే భోళా శంకరుడిగా పిలుస్తారు. శివయ్యకు కొన్ని ఆకులు అంటే చాలా ప్రీతిపాత్రం. శివుడిని సంతోషపరిచే ఆకులను పూజలో భాగం చేయడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్కులు చెబుతున్నారు.
ఈ ఆకులు సమర్పిస్తే శివయ్య సంతోషిస్తాడు:
శివ పురాణం ప్రకారం పరమేశ్వరుడికి జమ్మి ఆకులు అంటే చాలా ప్రీతి. శివలింగంతో పాటు గణపతికి జమ్మి ఆకులను సమర్పించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పూర్ణిమ విశ్వాసం ప్రకారం, శివుడికి జమ్మి ఆకులు సమర్పించడం వల్ల సమస్యలు తొలగిపోతాయి, కష్టాలు దూరమవుతాయి, అశాంతి తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది, నష్టాలు పోయి లాభాలు వస్తాయి. జమ్మి ఆకులను పరమేశ్వరుడికి సమర్పించడం వల్ల శని దోషం కూడా తగ్గుముఖం పడుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు.
పరమేశ్వరుడికి ఈ ఆకులు అంటే ప్రీతి:
బిల్వపత్రం అన్నా పరమేశ్వరుడికి మక్కువే. అయితే బిల్వపత్రం దొరకని సమయంలో దానికి బదులు రావి ఆకులు కూడా సమర్పించవచ్చని పండితులు చెబుతున్నారు. సోమవతి అమావాస్య రోజున పరమేశ్వరుడికి రావి ఆకులు సమర్పించి శక్తి మేర పూజిస్తే ఆయన సంతోషిస్తాడట. దీని వల్ల బాధలు, కష్టాలు, నష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.
అభిషేకం సమయంలో ఈ ఆకులు సమర్పించాలి:
శివుని అభిషేకంలో భాంగ్ ఉపయోగిస్తారు. దాంతో పాటు లింగంపై గంజాయి ఆకులను కూడా సమర్పిస్తారు. ఇలా గంజాయి ఆకులతో పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతోషిస్తాడని అంటారు. మనస్ఫూర్తిగా, పూర్తి ఏకాగ్రతతో శివయ్యను పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పరధ్యానంతో చేసే పూజల వల్ల ప్రయోజనం ఉండదని పండితులు చెబుతున్నారు.
ధాతుర పండు, దానికి ఉండే ఆకులు :
ధాతుర పండు, దానికి ఉండే రెండు ఆకులు సమర్పించడం వల్ల శివానుగ్రహం పొందవచ్చునట. శివుడికి సమర్పించడానికి ధాతురా పండ్లు లభించని పరిస్థితిలో కనీసం ధాతురా ఆకులైనా సమర్పించాలని జ్యోతిష్కులు సూచిస్తున్నారు. దీని వల్ల శివయ్స ప్రసన్నం అవుతాడని చెబుతున్నారు.
దుర్వా ఆకులు:
దుర్వా అమృతం అనే పదం వినే ఉంటారు చాలా మంది. హిందూ మత గ్రంథాల్లో దుర్వా గురించి ఎంతో ప్రత్యేకంగా చెప్పబడింది. శివయ్యకు దుర్వా ప్రీతిపాత్రమైనవి. లింగంపై దుర్వా గడ్డిని సమర్పిస్తే ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. పరమేశ్వరుడి పూజల్లో ప్రత్యేకంగా వినియోగించే దుర్వా గడ్డి ఆకులను సమర్పించడం మంచి చేస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications