Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Yogini Ekadashi 2020 : ఈరోజున 88 వేల మంది బ్రాహ్మాణులకు ఆహారం ఇవ్వడంతో సమానమట...!
యోగిని ఏకాదశి 17వ తేదీ రాబోతోంది. ఈ సందర్భంగా యోగిని వ్రత కథతో పాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
హిందూ ధర్మం ప్రకారం యోగిని ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఇది జూన్ నెలలో 17వ తేదీన వచ్చింది. ఈ పండుగ రోజున ఉపవాస దీక్ష చేస్తే 88 వేల మంది బ్రాహ్మాణులకు ఆహారం ఇవ్వడానికి సమానం అని పురాణాలు చెబుతున్నాయి.

ఇంతకీ యోగిని ఏకాదశి నాడు ఏ దేవుడిని పూజించాలి.. ఏ సమయంలో పూజ చేయాలి. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతతో పాటు ఉపవాస దీక్ష ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

యోగిని ఏకాదశి తేదీ
హిందూ పంచాంగం ప్రకారం, క్రిష్ణ పక్షం యొక్క ఏకాదశిని యోగిని ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ యోగిని ఈ సంవత్సరం జూన్ నెలలో 17వ తేదీన వచ్చింది.

యోగిని ఏకాదశి ఉపవాసం
అయితే ఈ యోగిని ఏకాదశిని రెండురోజుల పాటు జరుపుకుంటారు. 16వ తేదీన ఉదయం 05:40 నుండి మొదలై 17వ తేదీ ఉదయం 7 గంటల 50 నిమిషాలకు ముగుస్తుంది.

పూజా విధానం..
- యోగిని ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి.
- స్నానం చేసిన తర్వాత ఉపవాస దీక్షను ప్రారంభించాలి.
- ముందుగా మీ ఇంటిని శుభ్రపరచుకోవాలి.
- అన్నిటికంటే ముఖ్యంగా పూజా మందిరాన్ని శుద్ధి చేయాలి.
- తర్వాత విష్ణువు విగ్రహం లేదా చిత్రపటం ఎదుట దీపం వెలిగించాలి.
- విష్ణువు ఆరాధనలో తులసి ఆకులను వాడాలి.
- ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో కూడా విష్ణుమూర్తి ముందు దీపం వెలిగించాలి.
- విష్ణు సహస్రనామాన్ని పఠించాలి.
- మీ స్తోమతకు తగ్గట్టు బ్రాహ్మాణులకు లేదా పేదలకు ఆహారాన్ని అందివ్వాలి.
- అలాగే ఆర్థిక సహాయం కూడా చేయొచ్చు.
- ఈ పవిత్రమైన తక్కువ ఆహారం తీసుకోవాలి.
- పవిత్రమైన వస్త్రాలు ధరించాలి.
- స్వామి వారిని ఇంట్లో పూజించిన తర్వాత, మర్రిచెట్టు దగ్గరకు వెళ్లి పూజలు చేయాలి.
- మాంసాహారం జోలికి అస్సలు పోకూడదు.

ఉపవాసం ఎప్పుడు ముగించాలంటే..
మీరు చేపట్టిన ఉపవాస దీక్షను సూర్యాస్తమయం తర్వాత విరమించాలి. ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం సమయానికి ఉపవాసాన్ని విరమించకూడదు. దీని వల్ల మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ లభిస్తాయి.

యోగిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం ఓ పూల తోటలో హేమ్ అనే తోటమాలి ఉన్నాడు. తను పనిలో పడిపోయి ఒక తప్పు చేస్తాడు. దీంతో ఆ వ్యక్తి శాపగ్రస్తుడవుతాడు. ఈ కారణంగా అతనికి కుష్టు వ్యాధి వస్తుంది. అతడిని చూసిన ఒక సాధువు యోగిని ఏకాదశి నాడు ఉపవాసం చేయమని సూచిస్తాడు. ఆ సాధువు చెప్పినట్టు దీక్ష చేయడంతో అతని కుష్టువ్యాధి నయమైందనీ.. అందుకే యోగిని ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడిందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు 88 వేల మంది బ్రాహ్మాణులకు ఆహారం ఇచ్చినంత సమానమని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే మోక్షం కూడా లభిస్తుందట.




Click it and Unblock the Notifications