Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మీరు కోటీశ్వరులవ్వాలంటే..ఇంట్లో ఇలా చేయండి..లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది..!
గురువారమంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. గురువారం రోజు లక్ష్మీదేవికి చేసే పూజలు ఎన్నో విశేషమైన ఫలితాలు కలుగజేస్తాయని పండితులు చెబుతున్నారు. ఎంతటి దరిద్రంతో వున్నా సరే ఉప్పుతో ఇలా చేస్తే ధనవంతులుగా మారిపోతారు. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు ఇంట్లో ఇలా చేస్తే కష్టాల నుంచి బయటపడతారు. ధన సమస్యలు వున్న వారు ఈ విధంగా చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక సమస్యలు వున్నవారు గురువారం ఉదయం స్నానం చేసిన తరువాత పిడికెడు దొడ్డుప్పు తీసుకొని మీ ఇష్టదైవం ముందు నిలబడాలి. ఉప్పును చేతిలో అలాగే పట్టుకొని మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని మొక్కుకోవాలి. ఆ తరువాత ఉప్పును తీసి ప్రవహించే నీటిలో పడేయాలి. ఇలా చేస్తే మీకువున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయ్.

మరో విధంగా కూడా చేయవచ్చు. గురువారం రోజు ఉప్పును ఒక పొట్లంతో లేదంటే ఒక కవర్‌లో తీసుకోండి. ఈ ఉప్పును కిటికీ దగ్గర పెట్టాలి, లేదంటే నీళ్లు పడని చోటులో పెట్టాలి. ఈ ఉప్పును నెలరోజుల తరువాత తీసి ప్రవహించే నీటిలో పడేయాలి. దొడ్డుప్పు లేకపోతే సాధారణ ఉప్పుతో అయినా చేసుకోవచ్చు.
గురువారం రోజు సగం గ్లాసు నీళ్లల్లో మూడు చెంచాల ఉప్పును వేసుకోవాలి. ఈ గ్లాసును గుమ్మం పక్కన పెట్టాలి. తరువాత రోజు ఆ నీటిని తీసి షింక్‌లో పడేయాలి. లేదంటే గురువారం రోజు ఒక చిన్న బౌల్లో ఉప్పును తీసుకొని ఆ ఉప్పులో మూడు లవంగాలు , మూడు మిరియాలు వేసి బెడ్‌రూంలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల భార్యా భర్తల మధ్య వున్న గొడవలు తగ్గిపోతాయ్. అలాగే ఇంట్లో వున్న నెగటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. మిరియాలను, లవంగాలను గాజు గిన్నెలో మాత్రమే వేయండి. అల్మారా, టేబుల్ కింద ఈ గిన్నెను పెట్టవచ్చు. దీంతో మీకు వున్న అన్ని సమస్యలూ తొలగిపోతాయ్. రేపు గురువారం రోజు వీటిని పాటించి మంచి ఫలితాలను పొందండి.
హిందూ ధర్మంలో బియ్యానికి చాలా పవిత్ర స్థానం వుంది. అక్షింతలుగా ఈ బియ్యాన్ని వాడుతారు. జ్యోతిష్యంలో కూడా వీటిని ఉపయోగిస్తారు. దేవుడిని అక్షింతలంటే చాలా ఇష్టం. నాలుగు గింజలు వేస్తే దేవతలు ప్రసన్నమైపోతారు. శివునికి సోమవారం పూజ చేసేటప్పుడు ఒక కేజీ బియ్యాన్ని దగ్గర పెట్టుకొని పూజ అయిపోయిన తరువాత శివలింగంపైన ఒక గుప్పెడు బియ్యాన్ని వేసి పేదవారికి పంచాలి. ఇలా చేస్తే ఎంతో లాభం జరుగుతుంది. ప్రతీ సోమవారం ఇలా చేస్తే మీ జీవితంలో జరిగే మార్పును మీరు స్పష్టంగా చూడగలుగుతారు.
ఏదో ఒక సుమూహూర్తాన మంచి రోజున ఒక ఎర్ర రంగు వస్త్రంలో బియ్యం తీసుకోవాలి. వాటిలో విరిగిన బియ్యం లేకుండా చూడాలి. పసుపు కలిపి వాటిని జాగ్రత్తగా చుట్టి, లక్ష్మీ దేవి ముందు పెట్టి భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీకు ధనలాభం కలుగుతుంది.
లక్ష్మీ దేవి ఫోటో తీసుకొని తుడచి బొట్లు పెట్టి ఫోటోను బాగా భక్తితో అలంకరించాలి. పువ్వులతో పసుపు, కుంకుమలతో అలంకరించాలి. తరువాత 108 నాణేలను తీసుకొని ఒక్కో రూపాయి బిళ్లను అమ్మవారి ఫోటో ముందు అర్చన చేస్తూ పెట్టాలి. ఇలా ప్రతీ రోజూ చేస్తూ వుంటే మీరు కచ్ఛితంగా కోటీశ్వరులు అవుతారు.అప్పులు వున్నా కొద్ది కొద్దిగా తీరిపోతూ వుంటాయ్. ఈ పూజకు ఎలాంటి ఆహార నియమాలూ లేవు. పూజ చేసేటప్పుడు దుమ్మూ ధూలి లేకుండా చూసుకోవాలి. ఈ పూజలో వాడిన రూపాయి బిళ్లలను ఎవ్వరికీ ఇవ్వకూడదు. 41 రోజుల వరకు ఈ పూజను చేయాలి. ఈ పూజలను రూపాయి బిల్లలతో కాకుండా పసుపు కొమ్మలు, తామర గింజలతో కూడా చేయవచ్చు.



Click it and Unblock the Notifications











