Latest Updates
-
పక్కా స్ట్రీట్ స్టైల్ మోమోస్ చట్నీ..దీన్ని నంజుకొని తింటుంటే ఎన్నైనా అలా పోతూ ఉంటాయ్! -
రోజూ తినే రైతాతో బోర్ కొట్టిందా? అయితే కమ్మని తడ్కా వెజిటబుల్ రైతా ట్రై చేయండి! -
శాడిస్ట్ పెళ్లాంతో తట్టుకోలేకపోతున్నా: భార్య శృంగార కోరిక తీర్చలేక..పోలీస్ స్టేషన్ లో భర్త కంప్లెయింట్! -
రైస్ పొటాటో ఊతప్పం..ఇంతకుముందు తిన్న ఊతప్పం రుచులన్నీ మర్చిపోతారు! -
Hanuman Mantras: మోస్ట్ పవర్ ఫుల్ హనుమాన్ మంత్రాలు..దెయ్యాలు కూడా గజగజ వణకాల్సిందే! -
సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - గురువారం, 02 ఏప్రిల్ 2026 -
నోటికి ఏమీ రుచించట్లేదా? అయితే ఈ ఘాటైన వెల్లుల్లి చట్నీ ట్రై చేయండి! -
జై భజరంగ్ బలి..మీ బంధుమిత్రులకు హనుమాన్ జయంతి విషెస్ ఇలా అందంగా చెప్పండి! -
నోరూరించే గోంగూర బోటీ.. ఇలా వండితే రుచి అదుర్స్! -
హనుమాన్ చాలీసా ఎలా చదవాలి? మీ కోరికలు తీరాలంటే ఈ 4 నియమాలు పాటించాల్సిందే!
పనీర్ కుర్చాన్: స్పెషల్ వెజిటేరియన్ రిసిపి
పనీర్ కుర్చాన్ నార్త్ ఇండియన్ డిఫ్. ముఖ్యంగా పంజాబీ ట్రెడిషనల్ డిష్. అయినా ఈ పనీర్ కుర్చాన్ ను మన ఇండియాలో ప్రతి రాష్ట్రంలోనూ వివిధ ప్రాంతాల్లో తయారుచేస్తారు. ముఖ్యంగా ఇది ఇక రెస్టారెంట్ రిసిపి. కుర్చాన్ అంటే, వివిధ రకాల మసాలాను దంటించి తయారుచేయడం. ఈ వంటకు కొన్ని బేసిక్ మసాలా దినుసులను ఉపయోగించడం వల్ల మంచి టేస్ట్ మరియు ఫ్లేవర్ కలిగి ఉంటుంది.
పనీర్, క్యాప్సికమ్ రెండూ ప్రధానమైన వెజిటేరియన్ వస్తువులుగా ఉపయోగించి, దీన్ని తయారుచేస్తారు. ఇది చాలా స్పైసీగా మరియు టేస్టీగా నోరూరిస్తుంటుంది. ఇది ఒక అద్భుతమైన, రుచికరమైన డిష్ . పనీర్ కుర్చాన్ ను చాలా సులభంగా, త్వరగా తయారుచేయడానికి ఈ క్రింది పద్దతిని అనుసరించండి...

కావలసిన పదార్థాలు:
పనీర్: 50grm
గ్రీన్ క్యాప్సికమ్: 1
నూనె: 2tbsp
ఉల్లి తరుగు: 1/2cup
టొమాటో తరుగు: 1/2cup
పచ్చి మిర్చి తరుగు: 2tsp
టొమాటో గుజ్జు: 1cup
గరం మసాలా: 1tsp
బటర్: 50grms
క్రీమ్: 1/2cup
చాట్‌మసాలా పౌడర్: 1tsp
కారం: 1tsp
మెంతి ఆకులు: 2tsp(డ్రై)
ఉప్పు: రుచికి తగినంత
అల్లం తురుము: 1tsp
కొత్తిమీర: చిన్న కట్ట
తయారు చేయు విధానం:
1. ముందుగా పనీర్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
2. తర్వాత గ్రీన్ క్యాప్సికమ్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి.
3. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి, ఉల్లి తరుగు, టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించాలి.
4. తర్వాత అందులోనే టమాటో గుజ్జు, గరం మసాలా, బటర్, క్రీమ్, చాట్ మసాలా, కారం జత చేయాలి. తరిగిఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు, మెంతి ఆకులు, ఉప్పు వేసి బాగా వేయించాలి.
5. చివరగా అల్లం తురుము వేసి బాగా కలిపి దించేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications











