Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
శనిదోషంతో ఇబ్బంది పడుతున్నారా?.. నివారణకు ఎలాంటి పనులు చేయాలంటే?
జాతకంలో శని దోషం కారణంగా ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కుంటూ ఉంటారు. ఏ పని తలపెట్టినా అది పూర్తవదు. శనిదోషం వల్ల కలిగే పరిణామాలు కూడా ప్రమాదకరంగా ఉంటాయి. అయితే శని దోషం నివారించడానికి గల మార్గాలు, మంత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శనిదోషం అంటే ఏంటి?
నవ గ్రహాల్లో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. శని గ్రహాన్ని కర్మ ప్రదాత అని కూడా పిలుస్తారు. శని చాలా మందగస్థుడు. నెమ్మదిగా ప్రయాణిస్తూ ఉంటాడు. ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించడానికి శనీశ్వరుడు సుమారు రెండున్నర ఏళ్ళు తీసుకుంటాడు. ఈ సమయంలో శని ఎవరి జాతకంలో అయితే ఉంటాడో.. ఆ జాతకస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. శని దోషంలో రెండు రకాల దోషాలు ఉంటాయి. అర్ధాష్టమ శని, ఏలినాటి శని. అర్ధాష్టమ శని రెండున్నర ఏళ్లు ఉంటుంది. అదే ఏలినాటి శని సుమారు ఎనిమిదేళ్ల పాటు ఉంటుందని జాతక నిపుణులు చెబుతుంటారు. శనిదోషం ఉన్న వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత మంచి పనులు చేయాలని చెబుతుంటారు.

శని దోషాన్ని ఎలా నివారించాలి:
శనిదోషం వచ్చిందంటే.. శని ఆ జాతకంలో నుంచి వెళ్లేంత వరకు ఆ దోషం పోదు. కాకపోతే కొన్ని నివారణ మార్గాల ద్వారా మనం దోషానికి సంబంధించిన ప్రభావాన్ని కొంతమేర తగ్గించొచ్చు. అందుకోసం కొన్ని మంత్రాలకు పఠిస్తే ప్రయోజనం చేకూరుతుంది. 'ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్., ఉర్వారుక్ మివ్ బంధనన్ మృత్యోర్ముక్షీయ మా మృతాత్' అనే మంత్రాన్ని పఠించడం ద్వారా ఫలితం చేకూరే అవకాశముంది.
ఎలాంటి పనులు చేయాలి:
శని దోషం పోవాలంటే మంత్రాలను పఠించడంతో పాటు కొన్ని రకాల పనులు చేయాల్సి ఉంటుంది. శనివారం రోజున దాన ధర్మాలు నిర్వహిస్తే శనీశ్వరుడు ఆశీస్సులు లభిస్తాయి. నల్ల వస్తువులు, నల్ల ఉసిరి, నల్ల నువ్వులు, ఆవాలు, నల్ల నువ్వుల నూనె, ఇనుప వస్తువులను దానం చేయడం ద్వారా.. శని దోషం చాలా వరకు తొలిగే అవకాశముంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన విషయాలు కచ్చితమైనవని మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుల సహాయాలు తీసుకుంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications