Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
జాగ్రత్త.. 2025లో ఈ రాశుల వారి ఆరోగ్యం క్షీణిస్తుంది.. చనిపోతారా?
2024 సంవత్సరాన్ని ముగించడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలున్నాయి. ఇప్పటి నుంచే చాలా మంది కొత్త సంవత్సరాన్ని కొత్త ఉత్సాహంతో సరికొత్తగా ప్రారంభించాలని అనుకుంటున్నారు. 2025లోనైనా తమ జీవితం మారనుందా? తాము అనుకున్నది సాధించగలమా అనే అయోమయంలో కొందరు, 2025ని గొప్పగా ముగించాలని మరి కొందరు అనుకుంటున్నారు. అయితే జాతకం ప్రకారం 2025లో కొన్ని రాశుల వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అన్ని విధాలుగా కలిసి వస్తున్నా, ఆరోగ్యం పరంగా మాత్రం ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందట. ఇంతకీ ఆ రాశులు ఏవంటే?
మేష రాశి:
2025లో ఈ రాశి వారిలో శని సంచారం ప్రారంభం కానుంది. దీని కారణంగా ఈ రాశి వారికి ఏప్రిల్ నెల వరకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం క్షీణించే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని ఇంటర్నల్ ఆరోగ్య సమస్యలతో పాటు పాద సంబంధిత సమస్యలతో ఈ రాశి వారు ఏప్రిల్ నెల వరకు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ నెల తరువాత క్రమక్రమంగా కోలుకొని మంచి ఫలితాలను పొందుతారు.

వృషభం
వృషభ రాశి వారు ఏప్రిల్ 2025 వరకు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈ కాలంలో, వారి రోగనిరోధక శక్తి బలహీనపడవచ్చు. దీని కారణంగా అనేక రోగాల బారిన పడే అవకాశం ఉందని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. 2025లో వచ్చే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి ఈ రాశికి చెందిన వ్యక్తులు ఇప్పటి నుంచే మానసికంగా, శారీరకంగా బలంగా తయారవ్వాలి. కాబట్టి వారు తమను తాము మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా మార్చుకోవడానికి దృష్టి పెట్టాలి. గురువు ఈ రాశిలోకి మే నెలలో ప్రవేశించనున్నాడు. అప్పటి నుంచి ఈ రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా బలపడుతుంది.
మిథున రాశి
ఈ రాశి వారికి ఏప్రిల్ నెల తరువాత శని, గురువు గ్రహాల సంచారం మొదలు కానుంది. దీని కారణంగా మిథున రాశికి చెందిన జాతకులకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీరి రాశిలో గురువు ఉండడం వల్ల వీరు స్థూలకాయం వ్యాధితో ఎక్కువగా బాధపడే అవకాశం ఉంది. అలాగే కొన్ని ఊహించని అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్సుంది. అనారోగ్యం బారిన పడడంతో ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అది ఇంకా కుంగదీసే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ రాశి వారు 2025లో తమ ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టిపెట్టాలి.
కుంభ రాశి
ఏప్రిల్ 2025 వరకు కుంభ రాశివారు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ రాశి వారికి గురువు రెండో స్థానంలో ప్రవేశించినప్పుడు ఈ ఆరోగ్య సమస్యలు మొదలుకానున్నాయి. అలాగే శని సంచారం కూడా ఉండడం వల్ల సాధారణ ఆరోగ్య సమస్య అయినా మనిషిని మరింతగా కుంగదీసే అవకాశం ఉంది. అయితే ఫిబ్రవరి తరువాత ఈ రాశిలో సంచరిస్తున్న శని తన స్థానాన్ని మార్చుకోవడం వల్ల.. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. అలాగే సాధారణ స్థితికి వచ్చేందుకు వీలు కలుగుతుంది.
సింహ రాశి:
సింహ రాశి వారు ఈ సంవత్సరం పాద సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. వారికి ఎనిమిదవ స్థానంలో శని సంచరిస్తున్నారు. దీని కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలతో పాటు పాద సంబంధిత సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. మరోవైపు, ఏడవ స్థానంలో రాహువు మరియు వారి లగ్నంలో కేతువు ఉండటం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది.
అయితే శనీశ్వరుడు వారి రాశిలో ఏడవ స్థానంలో ప్రవేశించినప్పుడు వీరి ఆరోగ్యంలో ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. 2025 ఏప్రిల్ వరకు ఇలానే కొనసాగుతుండడంతో మానసిక ప్రశాంతత ఉండదు. ఒత్తిడి పెరుగుతుంది. మే నెలలో గురువు ఈ రాశిలో ప్రవేశించడం వల్ల ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. అప్పటి నుంచి క్రమక్రమంగా కోలుకునే అవకాశం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
