Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
నిద్రలేవగానే ఇవి చూస్తే కోటీశ్వరులౌతారు..! ముందుగానే ఏర్పాట్లు చేసుకోండి..!
నిద్రలోంచి లేచిన తరువాత కొన్ని వస్తువులను చూడ్డం వల్ల మనకు చాలా శుభాలు జరుగుతాయ్. ధనప్రాప్తి కూడా కలుగుతుంది. ఇలా ప్రతీరోజు ఉదయం లేచి ఆయా వస్తువులను చూడ్డం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయ్. అయితే ఆ వస్తువులేంటో తెలుసుకుందాం. ఉదయం లేవగానే చూసే వస్తువులన్నీ కూడా శుభకరమైనవి అయ్యుండాలి. వస్తువుల్లో కూడా శుభం, అశుభం కలిగినవి వుంటాయ్. విడిచిన బట్టలను నిద్రలేవగానే చూడ్డం మంచిది కాదు. ఎందుకంటే విడిచిన బట్టలకు నెగిటివ్ ఎనర్జీ వుంటుంది. విడిచిన బట్టలను పదే పదే వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. ఎంగిలి కంచాలు, ఎంగిలి గెన్నెలను కూడా చూడవద్దు.

నిద్రలేవగానే ముందుగా మనం మన ఇష్టదైవాన్ని చూడాలి. మనం ఏ దేవుడినైతే ఇష్టపడతామో ఆ దేవుడికి సంబంధించిన చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని చూడాలి. మనం చూసే విధంగా ఆ దేవుడి ఫోటోను మన బెడ్‌రూంలో అమర్చుకుంటే సరిపోతుంది. నిద్రలేవగానే ఉదయించే సూర్యుడును, బంగారాన్ని చూడ్డం కూడా మంచిదని పండితులు చెబుతున్నారు. వీలవుతే సముద్రాన్ని చూడాలి. ఇంట్లో పెద్దవాళ్లను, తల్లిదండ్రులను చూడ్డం కూడా శుభంగా చెబుతారు. సుమంగళీ స్త్రీలను చూడాలని అంటున్నారు.
నిద్రలేవగానే ఆవుదూడ కలిసి వున్నట్లైతే చూడాలి. మంగళ తోరణాలను చూడాలి. పసుపు బట్టలను, తులసి మొక్కలను చూడాలి. నిద్రలేవగానే వాకిట్లోకి వచ్చి అక్కడ వున్న తులసి మొక్కను చూడవచ్చు. అరచేతులను రాసుకొని లక్ష్మీ దేవి, సరస్వతీ, పార్వతీ దేవిని తలుచుకొని అరచేతులను చూడాలి. ఇలా చేసిన రోజు ఆ రోజు వచ్చే కష్టాలు కొంతవరకు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు.
ఎలాగైనా ధనవంతులు కావాలని ఎవరికైతే వుంటుందో వాళ్లు తమ ఇష్టదైవాన్ని చూడాలి. ఉదయించే సూర్యుడిని, బంగారాన్ని, చేతి ఉంగరాలను, గొలుసులను చూసినా మంచి జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీతో కోటీశ్వరులౌతారు. నైరుతిలో బెెడ్ ను ఏర్పాటు చేసుకొని ఇటువంటి వస్తువులు ఈశాన్య దిశలో వుండేలా చూసుకోవాలి. నిద్రలేచినప్పుడే సూర్యుడిని తలుచుకుంటూ లేస్తే అఖండమైన ఐశ్వర్యం లభిస్తుంది. సూర్యడిని నమస్కరిస్తే ఆరోగ్యంతో పాటుు ఐశ్వర్యం లభిస్తుంది.
సూర్యడిని చూడ్డం వల్ల శాస్త్రీయంగా కూడా చాలా మంచిదని వైద్యులే చెబుతున్నారు. మైండ్ ఫ్రెష్‌గా అవుతుందని చెబుతున్నారు. బంగారాన్ని డబ్బును చూడ్డం వల్ల కూడా అది మైండ్‌లో స్వచ్ఛంగా పడిపోతుంది. మనకు మంచి జరుగుతుంది.
ఆరోగ్యం బాగా వుండాలని అనుకునే వారు ఉదయం లేవగానే సూర్యుణ్ని నమస్కరించుకోవాలి లేదంటే తులసిమొక్కనైనా దర్శించుకోవాలి. ఎవరైతే ఆధ్యాత్మిక భావనలో వుంటారో వాళ్ల ఉదయం నిద్రలేవగానే ఇష్టదైవం ప్రతిమను మాత్రమే చూడాలి. ఏదైవాన్ని ఆరాధిస్తారో ఆ దైవాన్ని మాత్రమే చూడాలి. ఎవరికైతే కోరికలు తీరలేదు అనుుకుంటారో వాళ్లు ఆ వస్తువులను చూడాలి.
నిద్రించే ముందే అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకుంటే నిద్రలేవగానే ఈ శుభకరమైన వాటిని చూసే అవకాశం వుంటుంది. ఎవరైతే అధికారం, పదవి కావాలని అనుకుంటారో వాళ్లు ఉదయం లేవగానే తూర్పు దిక్కున తిరిగి ఇంద్రుడిని తలచుకొని సూర్యదేవుడికి నమస్కరించుకోవాలి. తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు. దేవతలకు కూడా రాజు కావడం వల్ల ఇంద్రుడి ఆశీస్సులు లభిస్తాయ్.
ఎవరైతే సొంత ఇంటిని కావాలనుకుంటారో వాళ్లు దూడతో వున్న ఆవును చూడాలి. కనీసం దూడతో వన్న ఆవు ప్రతిమనైనా చూడాలి. ఉదయం లేవగానే సొంతి ఇంటి కోరికను గోమాతకు చెప్పుకుంటే నమస్కరించుకుంటూ మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. అమంగళకరంగా వున్న ఏవస్తువులను కూడా చూడవద్దని శాస్త్రం మనకు హెచ్చరిస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన వివరాలన్నీ ప్రముఖ పండితుల నుంచి సేకరించినవి, వీటిని మేము ఎట్టి పరిస్తితిలో దృవీకరించము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications