Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
మీ అరచేతిలో V ఆకారం ఉందా? 35 ఏళ్ల తర్వాత మీరు ఊహించని విధంగా లైఫ్!
హస్తసాముద్రికం అనేది మన భవిష్యత్తును, వ్యక్తిత్వాన్ని కళ్లకు కట్టినట్లు చూపే ఒక అద్భుతమైన శాస్త్రం. మన అరచేతిలో ఉండే గీతలు మన జీవితంలోని ఎన్నో రహస్యాలను తమలో దాచుకుంటాయి. కొందరి అరచేతిలో V ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. దీనినే హస్తసాముద్రికంలో విష్ణు రేఖ అని పిలుస్తారు. ఈ రేఖ ఎక్కడా తెగిపోకుండా, స్పష్టంగా ఉంటే అది అదృష్టానికి, జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పులకు సంకేతంగా భావిస్తారు.

V రేఖ ఎక్కడ ఉంటుంది?
ఈ విష్ణు రేఖ సాధారణంగా చూపుడు వేలు కింద లేదా చూపుడు వేలు, మధ్య వేలుకి మధ్యలో ఏర్పడుతుంది. ఈ గీతను వేరే ఇతర గీతలు ఏవీ అడ్డంగా ఖండించకుండా, చాలా స్పష్టంగా ఉంటేనే దానికి పూర్తి ఫలితం దక్కుతుంది. సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు ఆశీస్సులు వీరికి మెండుగా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతారు.
35 ఏళ్ల తర్వాతే అసలైన అదృష్టం
ఈ విష్ణు రేఖ ఉన్నవారి జీవితం మొదటి నుంచే పూలపాన్పులా సాగిపోతుందని అనుకుంటే పొరపాటే. వీరు తమ లక్ష్యాలను చేరుకోవడానికి యవ్వనంలో ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, వీరి జీవితంలో అసలైన మలుపు 35 ఏళ్ల వయసు తర్వాతే మొదలవుతుంది. అప్పటివరకు వీరు పడిన కష్టానికంతా ప్రతిఫలం దక్కుతుంది. అదృష్టం తలుపు తడుతుంది. కెరీర్ లో అద్భుతమైన పురోగతి, ఉన్నత శిఖరాలు సొంతమవుతాయి. విజయం కాస్త ఆలస్యంగా వచ్చినా, అది చాలా స్థిరంగా, శాశ్వతంగా ఉంటుంది.
క్రమశిక్షణ, నిరాడంబర జీవితం
ఈ రేఖ ఉన్నవారు చాలా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. వీరికి ఆడంబరాలు, పనికిరాని ప్రదర్శనలంటే అస్సలు గిట్టదు. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయినీ చాలా జాగ్రత్తగా, అత్యవసరమైన చోట మాత్రమే ఖర్చు చేస్తారు. కెరీర్, వ్యక్తిగత జీవితానికి మధ్య అద్భుతమైన బ్యాలెన్స్ ను పాటిస్తారు. వీరి ఈ లక్షణమే వీరిని ఉన్నత స్థాయికి చేర్చుతుంది.
ఓటమిని అంగీకరించని నైజం
పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే.. వీరు ఎప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోరు. ఓటమిని అంత ఈజీగా ఒప్పకోరు. ఎంతటి కష్టాలొచ్చినా పాజిటివ్ దృక్పథంతో, ధైర్యంగా ఎదుర్కొంటారు. కెరీర్ లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతూనే ఉంటారు.
డబ్బుకు ఎన్నటికీ లోటు ఉండదు
విష్ణు రేఖ ఉన్న వ్యక్తులపై శ్రీహరి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి. వీరు అత్యంత కుబేరులు కాకపోవచ్చు, కానీ వీరి జీవితంలో డబ్బుకు, అవసరాలకు ఎప్పుడూ లోటు రాదు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటి నుంచి సులువుగా బయటపడతారు. సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరి ఆర్థిక స్థితి ఎప్పుడూ భద్రంగానే ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
