Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
కన్నెర్ర చేసిన గురువు.. డబ్బు విషయంలో ఈ 6 రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే
జ్యోతిష్య శాస్త్రంలో గురువు చాలా ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. అలాంటి ముఖ్యమైన గురువు మే 25న వృషభ రాశి నుండి మిథున రాశికి మారిపోతున్నారు. ఇది ఏకంగా 12 నెలల పాటు కొనసాగుతుంది. గురువు ఈ మార్పుతో కొన్ని రాశులకు ధన, అధికార సంబంధిత యోగాలను ఇచ్చినా, మరికొన్ని రాశులకు కష్టం తీసుకురానున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, గురువు ధన, గృహ, పుత్ర, శుభ కార్యాల కారకుడు. కానీ, దుస్థానాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ అంశాలకు ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారు ఈ మార్పులో దుస్థానాల్లో గురువు ప్రవేశించడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అయితే గురువు ఈ సంచారం వలన ఏ రాశి వారికి ఎలాంటి దుష్ప్రయోజనాలు కలుగుతాయి? వారు ఏ విధమైన కష్టాలను అనుభవిస్తారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేషం: ఈ రాశికి గురువు తృతీయ స్థానంలో ప్రవేశించడం వల్ల శ్రమకు తగ్గ ఫలితం లేకపోవచ్చు. ఇతరుల నుంచి అపోహలు, అసమ్మతులు ఎదురవవచ్చు. ఆదాయ మార్గాలు తగ్గిపోవడం, సరైన లాభం పొందకపోవడం వంటి విషయాలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు నష్టాలు కలిగించవచ్చు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ప్రతికూలతలు ఉంటాయి. ఆరోగ్యంతో కూడిన ఇబ్బందులు ఉంటాయి.

మిథునం: ఈ రాశికి గురువు సంచారం వల్ల వ్యక్తిగత ప్రాధాన్యం తగ్గవచ్చు. ఆత్మవిశ్వాసం, ధైర్యం తగ్గవచ్చు. ఉద్యోగంలో కష్టపడినా గుర్తింపు రావడం కష్టంగా ఉంటుంది. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వేతనం తగ్గడం, దూర ప్రాంతాల్లో పని చేయాల్సి రావచ్చు. కుటుంబ జీవితం అసంతృప్తిగా ఉండవచ్చు. ఆదాయం తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
కర్కాటకం: ఈ రాశి వారు 12వ స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. వైద్య ఖర్చులు, వృథా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాలలో చికాకులు ఏర్పడవచ్చు. ఆస్తి వివాదాలు, వితరణ ఇబ్బందులు ఉండవచ్చు. శుభ కార్యాలు కూడా వాయిదా పడతాయి.
కన్య: ఈ రాశికి గురువు దశమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో అవగాహన తగ్గే అవకాశం ఉంది. పనివాట్లు పెరిగి, అధికారులు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. వ్యాపారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు కోల్పోవచ్చు. డబ్బు విషయాలలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ప్రయాణాలు కూడా నష్టాలను కలిగిస్తాయి. ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది.
వృశ్చికం: ఈ రాశికి గురువు అష్టమ స్థానంలో ప్రవేశించడం వల్ల గృహ సంబంధిత పనులు విఘ్నాలతో కూడి ఉంటాయి. ఆదాయం వృద్ధి ఆలస్యం అవుతుంది. మిత్రుల నుంచి మోసాలు ఎదురవవచ్చు. రావలసిన డబ్బు అందక, ఇవ్వాల్సిన డబ్బు కూడా ఇవ్వలేక ఇబ్బంది పడవచ్చు. పెళ్లి ప్రయత్నాలు అడ్డుకావచ్చు. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు ఆర్థిక భారం పెంచవచ్చు.
మకరం: ఈ రాశి వారికి ఆరవ స్థానంలో గురువు ప్రవేశించడం వల్ల ఆర్థిక నష్టాలు లేదా మోసాలు పెరిగే అవకాశం ఉంది. సన్నిహితుల నుంచీ కూడా మోసాలు జరగవచ్చు. గృహ సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. కుటుంబ సంబంధాలలో కూడా విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications