Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
శివరాత్రి నుంచి ఈ మూడు రాశుల వారి జీవితం మూడు పూలు ఆరు కాయలుగా మారుతుంది!
హిందూ మతంలో రాశి ఫలాలకు ప్రాముఖ్యత ఉంది. అలాగే మాస శివరాత్రికి కూడా అంతే ప్రత్యేకత ఉంది. ప్రతినెలా వచ్చే మాస శివరాత్రి రోజు భక్తులు ఉపవాసంతో ఉండడంతో పాటు ఆది దంపతులైన శివ పార్వతుల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల శివ పార్వతుల ఆశీస్సులు తమపై ఉంటాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అయితే జోతిష్య శాస్త్రం ప్రకారం మార్గశిర నెలలో వచ్చే మాస శివరాత్రి పలు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానుంది. మరీ ముఖ్యంగా మూడు రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి రానుంది. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మాస శివరాత్రి ఎప్పుడొస్తుంది అంటే
జోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మార్గశిర నెలలో మాస శివరాత్రి డిసెంబర్ 29వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 30వ తేదీన ముగుస్తుంది. ఈ మాస శివరాత్రి తిథి డిసెంబర్ 29 తెల్లవారుజామున 3.32 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే డిసెంబర్ 30న ఉదయం 4:01 గంటలకు ముగుస్తుంది. దీంతో ప్రతి ఒక్కరూ ఈనెల 29వ తేదీన మాస శివరాత్రి జరుపుకోవాలని పండిత నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ మాస శివరాత్రి పలు అదృష్ట యోగాలను పలు రాశుల వారికి తీసుకురానుంది. ఆ రాశులు ఏవంటే?

సింహ రాశి:
సింహ రాశి జాతకులకు ఈ మాస శివరాత్రి నుంచి దశ తిరగనుంది. వీరికి అనేక విధాలుగా ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు ఈ నెలలో భారీగా లభ్ది పొందుతారు. వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. అంతే కాదు ప్రేమలో ఉన్న వ్యక్తుల ప్రేమ విజయవంతం అవుతుంది. అలాగే కోల్పోయినవన్నీ దక్కే అవకాశం ఉంటుంది.
మకర రాశి:
మకర రాశి వారికి ఈ మాస శివరాత్రి నుంచి భారీగా ఆర్ధిక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరికి సంపద, శ్రేయస్సుతో పాటు అనేక విధాలుగా ఆదాయం చేకూరనుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అలాగే కుటుంబంలోని సమస్యలన్నీ తీరిపోతాయి. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. అయితే ఈ రాశి వారు గంగాజలంతో నల్ల నువ్వులను కలిపి శివయ్యకు జలాభిషేకం చేస్తే ఇంకా ఉత్తమ ఫలితాలు పొందుతారు.
మిధున రాశి:
ఈ మిథున రాశి జాతకులకు ఈ మాస శివరాత్రి నుంచి శుభఘడియలు ప్రారంభం కానున్నాయి. ఈ రాశి వారికి శివుడి విశేషమైన ఆశీస్సులు ఈ రాశి వారికి లభిస్తాయి. అలాగే ఈ రాశి వారు భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. ఇల్లు లేదా ఇతర ఆస్తుల్లో పెట్టుబడులు పెడతారు. సమాజంలో ఉత్తమమైన ప్రతిభను కనబరిచి మంచి గుర్తింపును తెచ్చుకుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications