Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
హర హర మహాదేవ్:ఈరోజు మీ రాశి ప్రకారం ఆ శివ మంత్రాన్ని పఠిస్తే తిరుగులేని శక్తులు
ఈ రోజు(ఫిబ్రవరి 26)ప్రపంచవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు శివ భక్తులు. హిందూమతంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటైన మహాశివరాత్రి శివుడికి అంకితం చేయబడింది. ఇవాళ ఉదయం నుంచే శివాలయాలన్నీ శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మన దేశంలో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లోని శివాలయాలకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని శివ పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ మహా శివరాత్రి నాడు మీరు శివుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే, ఆయన ఆశీస్సులు పొందాలనుకుంటే మీ రాశికి తగిన శివ మంత్రాన్ని పఠించండి. మొత్తం 12 రాశులకు సంబంధించిన శివ మంత్రం ఏంటో ఇక్కడ చూడండి.

మేషం
మేష రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఈ రాశి వ్యక్తులు మహా శివరాత్రి రోజున 'నాగేశ్వరాయ నమః' అనే శివ మంత్రాన్ని జపించడం మంచిది.
వృషభం
వృషభ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ రాశి వ్యక్తులు మహా శివరాత్రి రోజున 'ఓం త్రినేత్రాయ నమః' అనే శివ మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది.
మిథునం
మిథున రాశి అధిపతి బుధుడు. ఈ రాశి వ్యక్తులు మహా శివరాత్రి రోజు 'ఓం శ్రీకంఠాయ నమః' అనే శివ మంత్రాన్ని జపించాలి.
కర్కాటకం
కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. కాబట్టి కర్కాటక రాశి వారు శివుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మహాశివరాత్రి రోజున 'ఓం జ్ఞానఫుదాయ నమః 'అనే శివ మంత్రాన్ని జపించడం మంచిది.
సింహం
సింహ రాశి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారు శివుని అనుగ్రహం పొందాలనుకుంటే 'ఓం ఓంకారయే నమః' అనే మంత్రాన్ని జపించాలి.
కన్య
కన్యా రాశి అధిపతి బుధుడు. ఈ కన్య రాశి వారు మహా శివరాత్రి రోజున " ఓం యుక్తకేశాత్మరూపాయ నమః " అనే మంత్రాన్ని పఠించాలి.
తుల
తులరాశి అధిపతి శుక్రుడు. తుల రాశి వారు మహా శివరాత్రి రోజున 'ఓం నందీశ్వరాయ నమః' అనే శివ మంత్రాన్ని జపించాలి.
వృశ్చికం
వృశ్చిక రాశి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారు మహా శివరాత్రి రోజున ' ఓం గంగేత్రాయ నమః ' వంటి కొన్ని మంత్రాలను పఠించాలి.
ధనుస్సు
ధనుస్సు రాశి అధిపతి గురువు. ధనుస్సు రాశి వారు మహా శివరాత్రి రోజున 'ఓం జ్ఞానఫుదాయ నమః ' అనే శివ మంత్రాన్ని జపించడం ద్వారా శివుని ఆశీస్సులు పొందుతారు.
మకరం
మకర రాశి అధిపతి శని. శని గ్రహం శివునికి గొప్ప భక్తుడు. కాబట్టి మకర రాశి వారు మహా శివరాత్రి రోజున 'ఓం సోమనాథాయ నమః' అనే మంత్రాన్ని జపించి శివుని ఆశీస్సులు పొందాలి.
కుంభం
కుంభ రాశి అధిపతి కూడా శని దేవుడే కాబట్టి ఈ రాశి వ్యక్తులు మహా శివరాత్రి రోజున 'ఓం తత్పురుషాయ నమః' అనే శివ మంత్రాన్ని జపించాలి.
మీనం
మీన రాశి అధిపతి గురువు. కాబట్టి ఈ రాశి వ్యక్తులు మహా శివరాత్రి సమయంలో 'ఓం దయానిధి నమః' అనే శివ మంత్రాన్ని 108 సార్లు జపించాలి .
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications