Latest Updates
-
పెళ్లిళ్లలో ఇది లేకుండా భోజనం పూర్తి కాదు.. నోరూరించే ఆంధ్రా స్టైల్ గోంగూర శనగపప్పు పులుసు.! -
షాపులో దొరికే కల్తీ బెల్లం వద్దు.. ఇంట్లోనే స్వచ్ఛమైన బెల్లం చేసుకోండిలా! -
దానిమ్మ గింజలు ఏ రంగులో ఉంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయో తెలుసా.. USDA డేటా ఇదే.! -
చిట్టి గణేశుడిని ఇంట్లోకి తెస్తున్నారా.. సంప్రదాయం ప్రకారం ఎన్ని రోజులు పూజించాలో తెలుసా.? -
కార్పొరేట్ ఉద్యోగులే ఆశ్చర్యపోయేలా పనిమనిషి జీ'వి'తం.. ఆమె సేవింగ్స్ ప్లానింగ్‌కి హ్యాట్సఫ్.! -
ఆరోగ్య సిరి, రుచుల గని..వేళ్లు కొరుక్కునే మునగాకు ఇడ్లీ తయారీ విధానం ఇదే! -
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా! -
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.! -
రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి -
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.!
అంగారకుడి నీచ సంచారం.. ఈ 4 రాశుల వారు కళ్లు తెరిచి ఉండకపోతే పక్కాగా నష్టపోతారు!
జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు సేనాపతిగా, ధైర్య సాహసాలకు, శారీరక శక్తికి కారకుడిగా అంగారకుడిని (కుజుడు) భావిస్తారు. అలాంటి కుజుడు తన నీచ రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించడం జ్యోతిష్యపరంగా పెను మార్పులకు దారితీస్తుంది. 2026 సెప్టెంబర్ 18, శుక్రవారం సాయంత్రం 4:44 గంటలకు కుజుడు కర్కాటక రాశిలోకి గోచారం చేయనున్నాడు. నవంబర్ 12 వరకు ఆయన అదే రాశిలో సంచరిస్తాడు.
సాధారణంగా కర్కాటక రాశిలో కుజుడు నీచ స్థితి(బలహీనంగా)లో ఉంటాడు. కుజుడు ఈ రాశిలోకి ప్రవేశించిన మరుక్షణం నుంచే ఆ ప్రభావం నాలుగు రాశుల వారిపై తీవ్రంగా పడనుంది. ఆ నాలుగు రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

కర్కాటక రాశి
కుజుడు నేరుగా మీ రాశిలోనే నీచ స్థితిలో సంచరించడం వల్ల మీకు సవాళ్లు స్వాగతం పలుకుతాయి. మీ తల్లిగారి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. చిన్నపాటి గొడవలు కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అనుకోని ఖర్చులు మీ జేబుకు చిల్లులు పెడతాయి. ఈ కాలంలో శత్రువులు మీపై పైచేయి సాధించే అవకాశం ఉంది కాబట్టి అడుగడుగునా జాగ్రత్త అవసరం.
మిథున రాశి
ఈ కుజ గోచారం మిథున రాశి వారికి ఊహించని ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. మీ మాట తీరుపై నియంత్రణ లేకపోతే గొడవలు పెద్దవి అవుతాయి. కాబట్టి కఠినంగా, అహంకారంతో మాట్లాడటం మానుకోండి. కొన్ని శారీరక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. మనసులో తెలియని ఆందోళన, అశాంతి నెలకొంటాయి. ముఖ్యంగా చెడు స్నేహాలకు దూరంగా ఉండకపోతే ఊహించని భారీ నష్టాలను చవిచూడక తప్పదు.

సింహ రాశి
సింహ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా కొంత భారాన్ని మోపుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఇతరులతో వాదనలకు, కలహాలకు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. భూమి లేదా స్థిరాస్తుల వ్యవహారాల్లో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. విద్యార్థులు చదువులో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు. ఆస్తి వివాదాల వల్ల కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితులు రావచ్చు.
ధనుస్సు రాశి
కర్కాటకంలో కుజుడి సంచారం ధనుస్సు రాశి వారికి అంతగా కలిసిరాదు. అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. పిల్లల ప్రవర్తన మీ ఆందోళనలను పెంచుతుంది. ఆఫీసులో జరిగే రాజకీయాలకు మీరు బలి పశువు అయ్యే ప్రమాదం ఉంది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని రహస్య శత్రువులు మీకు తీవ్ర నష్టం కలిగించేందుకు కుట్రలు పన్నుతారు. ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల విషయంలో కఠినమైన జాగ్రత్తలు తీసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
