షుగర్ పేషెంట్లు తినాల్సిన బెస్ట్ హెల్తీ స్నాక్స్ ఇవే..

ఆహారం తీసుకునేటప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అందులో కార్బోహైడ్రేట్ కంటెంట్ కొంచెం తక్కువ ఉండాలి, అది కూడా సంక్షిష్ట కార్బోహైడ్రేట్స్ అంటే నెమ్మదిగా షుగర్ లెవల్స్ ని పెంచాలి,దానికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ ఎంచుకోవాలి, అందులో ప్రొటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, కొంత మోడరేటెడ్ క్వాంటిటీ ఫ్యాట్ కూడా ఉండాలి. ముఖ్యంగా వంట చేసే విధానం కూడా చూసుకోవాలి. ఉప్పు ఎంత వేస్తున్నారు, ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తున్నారా అనేది కూడా గమనించుకోవాలి.

చాలామంది షుగర్ పేషెంట్లు చెప్పే మాట ఏంటంటే.. బ్రేక్ ఫాస్ట్ చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలేస్తుంది,సాయంత్రం 5 అయ్యేసరికి చాలా ఆకలేస్తోంది, చాలా నీరసంగా ఉందని అంటుంటారు. ఆఫీసు టైంలో మధ్యలో ఆకలేస్తే ఏం తినాలనే సందేహం కూడా వీరిలో ఉంటుంది. షుగర్ పేషెంట్లు ఏ స్నాక్స్ తింటే మంచిది, ఏ టైంలో తినాలి, ఎంతత క్వాంటిటీ తింటే మంచిదో ప్రముఖ డాక్టర్ దీప్తి కరేటి తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో వివరించారు.

Best Healthy Snacks for Diabetic Patients to Manage Blood Sugar Naturally

షుగర్ వ్యాధి ఉన్నవాళ్లకి ఎక్కువగా ఆకలి ఎందుకు

దీనికి ముఖ్య కారణం ఒకటి షుగర్ లెవల్స్ పడిపోవడం(low blood sugar levels). మనం ఉదయం వేసుకున్న ట్యాబ్లెట్స్ కానీ లేదా మధ్యాహ్నాం వేసుకున్న ట్యాబ్లెట్స్ కానీ, ఇన్సులిన్ డోస్ కొంచెం ఎక్కువ అయినా లేకపోతేనో, తిన్న ఆహారం క్వాంటిటీ ఆ రోజు టేస్ట్ గా లేకో లేదా ఆహారం అందుబాటులో లేకో తక్కువ ఆహారం తీసుకున్నా కూడా.. కొంతమంది ఎక్కువ వాకింగ్ చేస్తుంటారు, ఎక్సర్ సైజ్ పెరిగిపోయినా, పనిలో కష్టం పెరిగిపోయినా కూడా షుగర్ లెవల్స్ డ్రాప్ అవుతుంటాయి కాబట్టి సాయంత్రం 5 గంటల సమయానికి నీరసంగా అనిపిస్తుంది. కాబట్టి నీరసం అంటే షుగర్ లెవల్స్ డ్రాప్ అవుతున్నట్లు.

మనం ఎప్పుడూ షుగర్ లెవల్స్ తగ్గనివ్వకూడదు. హై షుగర్ ఎంత ప్రమాదకరమో, లో బ్లడ్ షుగర్ అంతకన్నా ప్రమాదకరం. కాబట్టి స్నాక్ తినడం చాలా ముఖ్యం. అది కూడా టైమ్.. మిడ్ మీల్ స్నాకా, బ్రేక్ ఫాస్ట్ - లంచ్ మధ్యలో, లంచ్ కి - డిన్నర్ కి మధ్యలో ఖచ్చితంగా స్నాక్ తింటేనే మంచిదని డాక్టర్ దీప్తి సూచిస్తున్నారు.

ఎంటువంటి స్నాక్స్ తినాలి?

స్పౌట్స్ సలాడ్ తినండి

మిక్స్డ్ స్పౌట్స్ సలాడ్ తింటే ఆరోగ్యానికి ఇంకా చాలా మంది. ఈ మిక్స్డ్ స్ప్రౌట్స్ సలాడ్ లో..శనగలు, పెసలు, కొందరు పల్లీలు కూడా ఇందులో వేసుకుని కలుపుకుని తింటారు. దీనిని తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ రాకుండా ఉంటుంది. ఇందులో వెజిటేబుల్స్..కీరదోస,టమాటో, బాదంపప్పు, వాల్ నట్స్ కలిపి తింటే ఇంకా మంచిది.

గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది?గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది?

1 కప్పు పెరుగు

సాయంత్రం 4 గంటలకు 1 కప్పు పెరుగు మీగడ లేకుండా తీసుకోండి. అందులో గుప్పెడు దానిమ్మ గింజలు వేసుకుని తినండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

-ఉడికించిన కోడిగుడ్డు,బాదంపప్పులు, ఉడికించిన శనగలు, రాగి జావ కూడా తక్కువ పిండి కలుపుకుని తీసుకోవచ్చని,అది కూడా బ్రేక్ పాస్ట్ తిన్న వెంటనే తాగకూడదని, 11 గంటల టైంకి తాగాలని డాక్టర్ దీప్తి సూచిస్తున్నారు.

-ఓట్స్ సూప్ వంటివి తీసుకోవచ్చు. వెజిటేబుల్ సలాడ్ తీసుకోవచ్చు. వెజిటేబల్ సూప్ కూడా మంచి స్నాక్ ఆప్షన్.

-మిడ్ మీల్ స్నాక్ గా ఒక జామకాయ తినండి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మలబద్దకం సమస్య కూడా నివారించవచ్చు.

-ఒక యాపిల్ పండు కూడా తినొచ్చు. జస్ట్ నాలుగు బొప్పాయి ముక్కలు తినొచ్చు, దానిమ్మ పండు కూడా తినొచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion