కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన 5 ఫుడ్స్ ఇవే..

ఇటీవల కాలంలో కిడ్నీ సంబంధిత సమస్యలతో చాలామంది బాధపడుతున్నాడు. కిడ్నీ ఒక్కటి డ్యామేజ్ అయినా డయాలసిస్ అంటూ హాస్పిటల్స్ చుట్టూ తరచుగా తిరుగుతూ డబ్బు నష్టంతో పాటు మానసికంగా కూడా కుంగిపోతున్నారు. అందుకే మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తూ, తిన్న ఆమారం నుంచి వ్యర్థాలను బయటకు పంపే కిడ్నీలను ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం చాలా చాలా అవసరం.

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తమ జీవనశైలితో పాటు తినే ఆహారం చాలా చాలా ముఖ్యం. కాబట్టి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే 5 ఉత్తమ ఫుడ్స్ గురించి హార్వర్డ్ డాక్టర్ సేథీ తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో చెప్పారు. డాక్టర్ సేథీ ప్రకరం కిడ్నీల ఆరోగ్యంగా ఉండటానికి సహకరించే ఆ 5 ఫుడ్స్ ఏవో ఇక్కడ చూడండి.

Top 5 foods for kidneys health supercharge your kidneys naturally

సుగంధ మూలికలు

కొత్తిమీర, తులసి, పార్శ్లీ, థైమ్, ఒరేగానో వంటి సుగంధ మూలికల్లో యాంటి ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి కిడ్నీల ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షించి కిడ్నీల పనితీరుని మెరుగుపరుస్తాయి.

బీట్ రూట్

మార్కెట్ లో బీట్ రూట్ కనబడానే చాలామంది దానిని బాగా శుభ్రం చేయాలి, పట్టుకుంటే చేతులకు ఎర్రగా కలర్ అయినట్లు అవుతుంది, ఉడకటం కూడా టైం అవుతుందని భావించి దాని జోలికి వెళ్లరు. వాస్తవానికి బీట్ రూట్ లో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలలను విస్తరించి బీపీని కంట్రోల్ లో ఉంచుతాయి. రక్తపోటు తగ్గినప్పుడు కిడ్నీలపై పడే అనవసర భారం సమర్థవంతంగా తగ్గుతుంది.

బ్లూబెర్రీలు

బ్లూబెర్రీలలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి, పొటాషియం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కిడ్నీల ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి.

కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవేకిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే

మకాడమియా నట్స్

సాధారణంగా నట్స్ లో ఫాస్పరస్ ఎక్కువ. అయితే మకాడమియా నట్స్ లో ఫాస్పరస్ చాలా తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కిడ్నీల ఆరోగ్యానికి ఇవి గొప్ప స్నాక్.

విటమిన్ బీ ఎక్కువ ఉండే ఫుడ్స్

బీ విటమిన్ ఎక్కువగా ఉండి, పొటాపియం తక్కువగా ఉండే ఆహారాలు తినండి. ఈ ఆహారాలు శరీరంలో జీవక్రియలను వేగవంతం చేస్తాయి. ఇది కిడ్నీల పనితీరుని మెరుగుపర్చి కిడ్నీల ఆరోగ్యానికి సాయపడతాయి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, October 26, 2026, 9:47 [IST]
Desktop Bottom Promotion