Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
శుభ గ్రహ సంయోగంతో ఈ రాశులకు తిరుగులేని శక్తులు..పేదలు కూడా మహారాజులైపోతారు,అఖంఢ ధనయోగం
సనాతన ధర్మంలో అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. పంచాంగం ప్రకారం ప్రతి నెలా క్రిష్ణ పక్షంలో చివరి రోజున అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. ప్రతి ఏటా వచ్చే 12 అమావాస్య తిథులలో మౌని అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ పవిత్రమైన రోజున దానం, పూజలు,జపం వంటివి పాటిస్తుంటారు. ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి 29, 2025న వస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మౌని అమావాస్య నాడు మూడు గ్రహాల ప్రత్యేక కలయిక జరుగుతుంది. దీనిని త్రిగ్రాహి సంయోగం అంటారు. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. మౌని అమావాస్య నాడు సూర్యుడు, చంద్రుడు, బుధుడు మకరరాశిలో ఉంటారు. మూడు గ్రహాలు కలిసి ఉండటం వల్ల త్రిగ్రాహి యోగం కలుగుతుంది. ఈ యోగ ప్రభావం వల్ల ఏయే రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ చూడండి.

వృషభం
వృషభ రాశి వారి జీవితాల్లో కొనసాగుతున్న సమస్యలు తీరబోతున్నాయి. మతపరమైన విషయాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది. కోరికలు నెరవేరతాయి. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో విజయం సాధించవచ్చు. ఉద్యోగాలు చేసేవారికి విపరీతమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమను అందుకుంటారు. ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారు ప్రయాణాలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
తుల రాశి
తుల రాశి వారు తమ కెరీర్‌లో పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. మీరు మీ ప్రియమైనవారి నుండి మద్దతు పొందుతారు. వ్యాపార పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆస్తులు కొనుగోలు చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. భౌతిక ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. ఉద్యోగాలు చేసేవారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి తల్లితో ఆనుభం కూడా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కన్య రాశి
త్రిగ్రాహి యోగం వల్ల కన్య రాశి వారు తమ వృత్తిలో పురోగతిని పొందుతారు. ఉన్నతాధికారుల నుంచి సహకారం అందుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు ఇది మంచి సమయం.
మకర రాశి
మకర రాశి వారికి అదృష్టం ఏర్పడుతుంది. మీరు కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. భూమి, భవనం, వాహన కొనుగోలుకు అవకాశం ఉంది. వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వైవాహిక జీవితం కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
