మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం!

ఈ రోజుల్లో చాలామంది పురుషులను వేధిస్తున్న సమస్యల్లో వంధ్యత్వం(సంతానలేమి) ఒకటి.యువకుల్లో కూడా ఈ సమస్య కామన్ అయిపోయింది. పోషకాహార లోపం, నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి, గంటల తరబడి కదలకుండా కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. అయితే వీటన్నింటితో పాటు చాలా మంది పురుషుల మదిలో తరచుగా మెదిలే ఒక ఆసక్తికరమైన ప్రశ్న..రోజూ ధరించే అండర్ వేర్ వీర్య కణాల ఉత్పత్తి, నాణ్యతపై నిజంగానే ప్రభావం చూపుతాయా?.

ఈ సందేహానికి స్పష్టమైన, శాస్త్రీయమైన వివరణ ఇస్తూ ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ వెంకట్ సుబ్రమణియం ఇటీవల తన ఇన్‌ స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. ఆయన మాటల ప్రకారం.. ప్రస్తుత రోజుల్లో పురుషుల్లో వంధ్యత్వ సమస్య విపరీతంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోవడం, నాణ్యత లోపించడమే.

Male Infertility Does Tight Underwear Reduce Sperm Count Urologist Explains the Truth

ప్రకృతి సహజంగానే పురుషుల వృషణాలు (Testicles)శరీరానికి కొంచెం బయట వైపు ఉండేలా నిర్మించబడ్డాయి. ఎందుకంటే వృషణాల ఉష్ణోగ్రత మన శరీర సాధారణ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నప్పుడే అవి చురుగ్గా పనిచేస్తాయి. అప్పుడే ఆరోగ్యవంతమైన, నాణ్యమైన వీర్య కణాల ఉత్పత్తి జరుగుతుంది.

జామ ఆకుల టీని రోజుకు ఒక్క కప్పు తాగితే చాలు.. ఈ 4 భయంకరమైన ఆరోగ్య సమస్యలు మాయం!జామ ఆకుల టీని రోజుకు ఒక్క కప్పు తాగితే చాలు.. ఈ 4 భయంకరమైన ఆరోగ్య సమస్యలు మాయం!

ఎప్పుడైతే వృషణాల ఉష్ణోగ్రత పెరుగుతుందో, అప్పుడు ఆటోమేటిక్‌ గా వీర్యం నాణ్యత దెబ్బతింటుంది. వరికోసెల్ (Varicocele) వ్యాధి ఉన్నవారిలో లేదా వృషణాలు కిందికి దిగని పరిస్థితుల్లో ఈ వేడి కారణంగానే వీర్యకణాల ఉత్పత్తి మందగిస్తుంది. ఇదే సూత్రాన్ని లోదుస్తులకు అన్వయిస్తే, సిద్ధాంతపరంగా చూసినప్పుడు.. మరీ బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం వల్ల వృషణాల చుట్టూ గాలి సరిగ్గా ఆడదు. దీనివల్ల అక్కడ ఉష్ణోగ్రత పెరిగి, వీర్య కణాల ఉత్పత్తిపై స్వల్పంగా ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. వదులైన లోదుస్తులు ధరిస్తే, వృషణాలకు తగినంత గాలి తగిలి ఉష్ణోగ్రత పెరగకుండా ఉంటుంది కాబట్టి వీర్యకణాల ఉత్పత్తి సాఫీగా జరుగుతుంది.

అయితే ఆచరణాత్మకంగా చూస్తే ఎవరూ కూడా రోజంతా మరీ బిగుతుగా, ఊపిరి ఆడనంత టైట్ లోదుస్తులను ధరించరు. ఒకవేళ ధరించినా, సంతానోత్పత్తిని దెబ్బతీసేంత పెద్ద ప్రమాదమేమీ దీనివల్ల జరగదు. ఎందుకంటే లోదుస్తుల ప్రభావం చాలా నామమాత్రంగానే ఉంటుంది. వాస్తవానికి పురుషుల సంతానోత్పత్తిని తీవ్రంగా దెబ్బతీసే ప్రధాన శత్రువులు వేరే ఉన్నాయి. అవేంటంటే..

-సిగరెట్లు తాగడం
-విపరీతమైన మద్యపానం
-ఊబకాయం
-జంక్ ఫుడ్ తినడం, వ్యాయామం చేయకపోవడం

ఇవే నేరుగా మీ వీర్య కణాల సంఖ్యను, వాటి కదలికను, నాణ్యతను నాశనం చేస్తాయి. కాబట్టి లోదుస్తుల గురించి ఎక్కువగా భయపడటం కంటే ఈ చెడు అలవాట్లను మానుకోవడంపై దృష్టి పెట్టాలి.

Story first published: Friday, November 6, 2026, 10:00 [IST]
Desktop Bottom Promotion