Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
వణుకు పుట్టిస్తున్న నోస్ట్రాడమస్ జోస్యం..2025 చివరిలో ప్రళయం తప్పదా? కరోనాను మించిన ముప్పు?
ప్రస్తుతం బాబా వంగా అంచనాలను చాలా మంది విశ్వసిస్తారు.దీనికి కారణం ఆమె అంచనా వేసిన అనేక సంఘటనలు నిజమయ్యాయి. అయితే బాగా వంగా కంటే 500 ఏళ్ల ముందే ఫ్రెంచ్ కు చెందిన జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ భవిష్యత్తులో జరబోయే అనేక సంఘటనలు ముందే ఊహించి చెప్పారు. 1555లో ఆయన లెస్ ప్రాఫెటీస్ అనే గ్రంథంలో వేలాది ప్రవచనాలను సంకేతాల రూపంలో రాశారు. నోస్ట్రాడమస్ అంచనాలు అనేకం నిజమయ్యాయి. హిట్లర్ అధికారంలోకి రావడం, జాన్ ఎఫ్. కెన్నెడీ హత్య, నెపోలియన్ ఆవిర్భావం, 9/11 దాడుల వంటి అనేక వాటి గురించి నోస్ట్రడామస్ వేసిన అంచనాలు నిజమయ్యాయి.
ప్రతి సంవత్సరం చివరికి వస్తున్న కొద్దీ రాబోయే కొత్త ఏడాది ఎలా ఉంటుందోనన్న ఆశలు, అంచనాలు మొదలవుతాయి. కానీ 2025 సంవత్సరం ముగింపు మాత్రం ఆశ కంటే ఎక్కువగా ఆందోళనను రేకెత్తిస్తోంది. దీనికి కారణం ఏంటంటే..2025 చివరి నెల డిసెంబర్ మానవాళి చరిత్రలోనే ఒక భయానక అధ్యాయాన్ని లిఖించబోతోందని నోస్ట్రాడమస్ హెచ్చరికలు సూచిస్తున్నాయి. ఆయన అంచనాల ప్రకారం డిసెంబర్ 2025లో ప్రపంచవ్యాప్తంగా అశాంతి, ఆందోళనలు తారస్థాయికి చేరుకుంటాయని ఆయన చెప్పినట్లు ఒక రిపోర్ట్ వెల్లడించింది.

భూమిపై భీకర యుద్ధం తప్పదా
2025లో ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుందని, అది ప్రపంచ శాంతికి పెను ముప్పుగా పరిణమిస్తుందని నోస్ట్రాడమస్ స్పష్టంగా చెప్పినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. లోపల, బయట ఉన్న శత్రువు తలెత్తలేడు అనే ఆయన వాక్యం..దేశాల మధ్య అంతర్గత కలహాలు, సరిహద్దు ఘర్షణలు తీవ్రరూపం దాల్చి ఒక పెద్ద యుద్ధానికి దారితీయవచ్చని సూచిస్తోంది. ఈ యుద్ధం కారణంగా అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
విశ్వం నుండి దూసుకొచ్చే అగ్నిగోళం
యుద్ధమే కాకుండా, ప్రకృతి వైపరీత్యాలు కూడా మానవాళిని వెంటాడతాయని నోస్ట్రాడమస్ ప్రవచించారు. ఆయన రాసిన ఒక కవితలో ఆకాశం నుండి దూసుకొచ్చే అగ్నిగోళం గురించి ప్రస్తావన ఉంది. ఇది విశ్వం నుండి భూమిపైకి దూసుకొచ్చి తీవ్రమైన గందరగోళాన్ని, విలయాన్ని సృష్టిస్తుందని ఆయన హెచ్చరించారు. దీన్ని గ్రహశకలం లేదా తోకచుక్కగా భావిస్తున్నారు. 2026 నాటికి ఇలాంటి భౌతిక ఢీకొనే సంభావ్యత 30 శాతం పెరగవచ్చని అంచనాలు ఉండటం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది.
తిరిగి రానున్న పాత వ్యాధులు
5 ఏళ్ల క్రితం వచ్చిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచం ఎంత అల్లకల్లోలం అయ్యిందో కళ్లారా చూశాం. అయితే మళ్లీ ఇప్పుడు అలాంటి భయంకరమైన వ్యాధి వస్తే ఊహించడానికే భయం వేస్తుంది. అయితే కాలగర్భంలో కలిసిపోయాయనుకున్న పాత వ్యాధులు, ప్రాణాంతక మహమ్మారులు పెద్ద పరిమాణంలో తిరిగి విజృంభిస్తాయని ఆయన తెలిపారు. ఇది భూమిపై మానవాళికి ఒక భయంకరమైన శత్రువుగా పరిణమించి, ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను కుప్పకూల్చే ప్రమాదం ఉందని ఆయన ప్రవచనం చెబుతోంది. ఇవి కేవలం అంచనాలేనా లేక రాబోయే ప్రమాదానికి సంకేతాలా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ 2025 ముగింపు సమీపిస్తున్న వేళ ఈ ప్రవచనాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications