Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
100 ఏళ్లలో ఒక్కసారి వచ్చే అరుదైన రోజు.. ధన త్రయోదశి రోజు ఈ పూజలు చేస్తే డబ్బే డబ్బు!
దీపావళికి ముందు ధన త్రయోదశి జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం జరుపుకునే ఈ ధన త్రయోదశి పండగ అత్యంత ప్రత్యేకమైనదని చెబుతున్నారు. ఈ సంవత్సరం రోజున త్రిగ్రహి యోగం, త్రిపుష్కర యోగం, ఇంద్ర యోగం, శష మహాపురుష, ధత, సౌమ్య యోగం వంటి ఏడు కలయికలతో ఈ ధన త్రయోదశి వస్తుంది. సుమారు 100 ఏళ్ల తరువాత ఇలాంటి అరుదైన రోజు వస్తుందని పండిత నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రోజు ఎలాంటి పూజలు చేయాలి, ఏ విధమైన నైవేద్యం సమర్పించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఎందుకు ఈ యోగం ఏర్పడుతుందంటే..
ఈ సంవత్సరం ఏర్పడుతున్న ధనత్రయోదశి 100 సంవత్సరాల తరువాత అత్యంత శుభ ఘడియాల మధ్య ఏర్పడుతుంది. ఈనెల 29న శుక్రుడు, బుధుడు వృశ్చిక రాశిలో కలిసి ఉంటారు. దీని కారణంగా ఈ అత్యంత అరుదైన ధన యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాల కారణంగా మనిషి జీవితంలో ఎన్నో లాభాలు గడుస్తారు. ఏ రాశి వారు అయినప్పటికీ ధనత్రయోదశి రోజున చేయాల్సిన పూజలు చేస్తే.. జీవితం ఒక్కసారిగా మారిపోతుంది.

బుధుడు, శుక్ర గ్రహాల కలయిక వల్ల మనిషి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. అనుకున్న కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి. సమాజంలో గుర్తింపు కూడా వస్తుంది.
ఏ దేవుళ్లను పూజిస్తే మంచిది..
ఏడు యోగాల కలయిక వల్ల ఏర్పడుతున్న ఈ ధన త్రయోదశి అత్యంత ప్రత్యేకమైనదిగా మారింది. దీని కారణంగా ఈరోజుకు చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. అలాంటి రోజున లక్ష్మీదేవి, గణేషుడిని పూజిస్తే చాలా మంచిదట. అలాగే కుబేరుడు, ధన్వంతరి మాత విగ్రహాలను కూడా పూజిస్తే చాలా శుభమని, ఆదాయ అస్థిరత తొలిగి జీవితంలో చాలా మంచి స్థాయికి వెళ్తారని పండితులు చెబుతున్నారు.
ఎలా పూజించాలంటే..
ఈ ధన త్రయోదశి నాడు సాయంత్రం పూజ స్థలంలో లక్ష్మీదేవి, కుబేరుడి విగ్రహాలను ముందుగా ప్రతిష్టించాలి. అనంతరం ధన్వంతరి మాత, గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి.. మూడు విగ్రహాల ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అనంతరం దేవతలందరికీ హారతి ఇచ్చి, నమస్కరించుకోవాలి. అనంతరం పూలు చల్లి, పూల మాల వేసి.. లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తే చాలా మంచిది. అలాంటప్పుడే లక్ష్మీదేవి కరుణ భక్తులపై ఉంటుందని నమ్మకం.
ఏ ఏ వస్తువులు కొనాలి?
ధన త్రయోదశి నాడు వస్తువులను కొంటె చాలా మంచిదని చెబుతుంటారు. అందుకే చాలా మంది బంగారం, లేదా వెండి వస్తువులను కొంటూ ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. అయితే ఈ ప్రత్యేకమైన ధన త్రయోదశి రోజున బంగారం వెండితో పాటు ఈ వస్తువులను కూడా కొంటె మంచి ఫలితాలను పొందొచ్చట. అందులో లక్ష్మీదేవి, గణేశుడు విగ్రహాలు, ధనియాలు, పసుపు, మట్టి పాత్రలు, అష్టధాతు పాత్రలు, ఇత్తడి, రాగి, అలంకార వస్తువులు, భూములు, భవనాలు, వాహనాలు కూడా కొంటె మంచి జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
శుభ ఘడియలు ఎప్పుడున్నాయి?:
ఈ అత్యంత అరుదైన ధనత్రయోదశిని ఈ శుభ ఘడియల్లో జరుపుకుంటే ప్రయోజనాలు కూడా రెట్టింపు స్థాయిలో ఉంటుందట. పంచాంగం ప్రకారం ఈరోజు ఉదయం 6.47 గంటల నుంచి రేపు ఉదయం 10:31 గంటల వరకు ఇంద్రయాగం, త్రిపుష్కర యోగం ఉండనుంది. ఈ కాలంలో మంచి ఘడియలు ఉన్నట్లు జోతిష్యులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు జోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు లేదా నమ్మే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications