Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Food eating: ఈ దిక్కున కూర్చుని తింటే..లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి పోదు!
ఇంటి నిర్మాణ సమయంలోనే వాస్తును ఫాలో అయితే చాలు అనుకుంటారు కొందరు. కేవలం ఇంటి నిర్మాణానికే కాదు జీవితంలో ప్రతిదీ వాస్తు ప్రకారం ఉంటే మంచిదని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు పరిష్కారాలు వాస్తు శాస్త్రంలో(vastu shastram) ఉన్నాయని పండితులు చెబుతారు.
ఇంటిని నిర్మించడానికి వాస్తుని ఫాలో అయినట్లే ఇంట్లో భోజనం చేసే విషయం కూడా వాస్తు ప్రకారం ఉండాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు ఉండవని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది. మన శారీరక ఆరోగ్యం మనం ఏ దిశలో కూర్చుని ఆహారం తీసుకుంటామనే దానిపై ఆధారపడి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఈ దిక్కున అస్సలు కూర్చోకూడదు
వాస్తు ప్రకారం దక్షిణాభిముఖంగా,పడమరాభిముఖంగా భోజనం చేయడం మంచిది కాదు. ఈ దిశలో కూర్చొని ఆహారం తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వాస్తు నియమాలు చెబుతున్నాయి. అలాగే సంపద కూడా ఇంట్లో నిలవదని చెబుతున్నాయి. టెన్షన్, అశాంతి, ఆరోగ్యం సరిగా లేకపోవడం వంటి సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎవరైనా దక్షిణాభిముఖంగా భోజనం చేస్తుంటే ఇంట్లో పెద్దలు ఆపి తిప్పి కూర్చోమని చెప్పేది ఇందుకే.
దీని వెనుక అసలు కారణం మరొకటి ఏంటంటే ఈ దిక్కు యమ దిక్కు..ఇది పూర్వీకుల నివాసంగా పరిగణిస్తారు. ఇక్కడ నుండి వచ్చే ప్రతికూల శక్తి మీ ఆహారాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ అంతా ఈ దిశ నుంచి ప్రవేశిస్తుంది. ఈ నేపథ్యంలో మీరు ఈ దిశలో ఆహారం తీసుకున్నప్పుడు ఆహారంతో పాటు ప్రతికూల శక్తి కూడా మీ లోపలికి ప్రవేశిస్తుంది..ఇది మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..పూర్వీకులు దక్షిణ దిశలో నివసించినట్లు భావిస్తారు. మీరు ఈ దిశలో ఆహారం తీసుకుంటే పూర్వీకులు మీ పట్ల అసంతృప్తిగా ఉంటారు. ఇది మీపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
ఈ దిక్కున కూర్చుని తింటే ఐశ్వర్యం
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి భోజనాల గది పశ్చిమ దిశలో ఉండాలి. తూర్పు దిశగా చూస్తూ కూర్చుని భోజనం చేస్తే విద్య వృద్ధి చెంది సంపద పెరుగుతుందని, జీవితం బాగుపడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే తూర్పు దిక్కునకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఉత్తరం వైపు చూస్తూ కూర్చుని భోజనం చేయడం కూడా శ్రేయస్కరమే.
భోజనం చేసే సమయంలో చెప్పులు వేసుకోకూడదు,తలపై ఎలాంటి వస్త్రం ఉండకూడదు. భోజనానికి ముందు చేతులు,కాళ్లు శుభ్రపరుచుకుని వీలైతే నేల మీద చాప పరుచుకుని కూర్చొని తింటే బెటర్ అని పండితులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











