Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
దయ తలిచిన శనీశ్వరుడు.. 19 సంవత్సరాలు ఈ రాశుల వారికి తిరుగు ఉండదు!
నవ గ్రహాలలో శని గ్రహానికి చాలా నెమ్మదిగా కదిలే గ్రహంగా పేరుంది. ఈ గ్రహం ఏదైనా ఒక రాశిలో ప్రవేశిస్తే సుమారు రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు. ఈ రెండున్నర సంవత్సరాల పాటు ఆ రాశుల వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తాడు. శనీశ్వరుడు అనుకూలమైన ప్రయోజనాలను ఇస్తాడు. అలాగే దుష్ప్రయోజనాలను అందిస్తాడు. ఎవరికైతే శని మహా దశ పడుతుందో వారికి శనీశ్వరుడు అద్భుతమైన ప్రయోజనాలను అందించనున్నాడు. ఈ మహర్దశ ఉన్న వ్యక్తులకు సుమారు 19 సంవత్సరాల పాటు శని ప్రయోజనాలు కలగనున్నాయి.
శని గ్రహ స్థితిని బట్టి ఒక్కో రాశికి శని మహాదశ ప్రభావం మారుతుంది. ఇది ప్రయోజనకరమైన మరియు హానికరమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. ఈ కాలంలో మహాదశ ఫలాలను ఆ వ్యక్తి చర్యలను బట్టి అందించనున్నాడు. సాధారణంగా శని మహాదశ కాలంలో చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. కొన్ని రాశుల వారు కోర్టు కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. శత్రువుల నుండి సమస్యలను ఎదుర్కొంటారు. శని మహాదశ వల్ల ఏ రాశి వారికి అదృష్టం వరించనుందో చూద్దాం.

కన్య
కన్య రాశి వారికి శని మహాదశ నుండి గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రాశుల వారు శని భగవానుని ఆశీర్వాదంతో ఈ కాలంలో చాలా శక్తివంతంగా, ధనవంతులుగా మారతారు. ఈ సమయంలో ఈ రాశి వారు పనులు తక్కువగా చేసినప్పటికీ, వారు చేస్తున్న పనులు వారు సాధిస్తున్న విజయాలు వారి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునే విధంగా ఉంటాయి. ఈ శని మహర్దశ కాలంలో ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టతలు పెరిగిపోతాయి. డబ్బు కుప్పలు కుప్పలుగా సంపాదిస్తారు. ఆర్ధిక లోటు ఉండదు. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు భారీగా లాభాలు సాధించగలుగుతారు.
తులా రాశి
తులా రాశిలో శనీశ్వరుడు నాలుగు, అయిదవ స్థానాలకు అధిపతి. దీని కారణంగా శని మహర్దశ కారణంగా ఈ రాశి వారికి మంచి ఫలితాలు దక్కనున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వారికీ ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సానుకూల ఆలోచన ధోరణితో ఉంటారు. ఆర్ధిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. డబ్బులు బాగా సంపాదిస్తారు. ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎలాంటి గందరగోళం లేకుండా స్పష్టమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఈ నిర్ణయాలు మంచి ఫలితాలు పొందుతారు. ఆ నిర్ణయాలే ఈ రాశి వారికి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు సహాయపడతాయి.
ధనుస్సు రాశి
శనీశ్వరుడు ఈ రాశి వారికి చెందిన రెండు, మూడో స్థానాలకు అధిపతిగా ఉన్నాడు. దీని కారణంగా శనీశ్వరుడు ఈ శని మహర్దశ కాలంలో ఈ రాశి వారికి మంచి ఫలితాలను అందించనున్నాడు. ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు కస్టపడి పని చేస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. సానుకూలమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. శని భగవానుడి ఆశీర్వాదంతో వైవాహిక జీవితం కూడా సుఖమయంగా ఉంటుంది. జీవితంలో ఆనందమైన క్షణాలను గడుపుతారు. వ్యాపారులు భారీగా లాభాలను పొందుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
