Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఇంట్లో అలా జరుగుతుంటే వాస్తు దోషం ఉన్నట్లే..సింపుల్ గా ఇలా చేయండి
చాలామందికి సొంత ఇళ్లు అనేది ఓ లైఫ్ టైమ్ డ్రీమ్. జీవితకాల సంపాదనతో భూమిని కొనుగోలు చేసి అందులో తమకు నచ్చినట్లుగా ఇల్లు కట్టుకుంటారు చాలామంది.అయితే ఇల్లు కట్టే సమయంలో వాస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే వాస్తు దోషాలు సంభవిస్తాయి. పల్లెటూర్లలో అయితే ఇల్లు కట్టే ముందే అయ్యవారిని లేదా వాస్తు నిపుణుడిని పిలిపించి వారి సూచనలతో ఇంటి నిర్మాణం చేపడతారు. సిటీలు, నగరాల్లో కూడా కొంతమంది ఇలా చేస్తారు.. అయితే చాలామంది వాస్తు నమ్మనివాళ్లు మాత్రం దాన్ని లైట్ తీసుకుంటారు. తీరా ఇంటి నిర్మాణం జరిగిన తర్వాత కొన్నాళ్లకి తాము వాస్తు ప్రకారం కట్టి ఉంటే బాగుంటదని భాధపడుతుంటారు.
ఇళ్లు కట్టే సమయంలో వాస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే వాస్తు దోషాలు సంభవించవచ్చు. ఇంట్లో వాస్తు దోషాల వల్ల సంతోషకరమైన కుటుంబంలో కూడా సమస్యలు మొదలవుతాయి.అయితే వాస్తు దోషం అనేక ఇతర కారణాల వల్ల కూడా సంభవిస్తుంది.. ఇది ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంటది.

మీ ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతూ ఉంటే అది వాస్తు దోషానికి నిదర్శనమని భావించవచ్చు. అదేవిధంగా ఓ వ్యక్తి మంచిగా సంపాదిస్తున్నప్పటికీ ఇంట్లో డబ్బు నిలవకపోతే ఇది కూడా వాస్తు దోషం లక్షణమే అని అనుకోవచ్చు.అంతే కాకుండా కుటుంబంలో తరచుగా వచ్చే వ్యాధులు కూడా వాస్తు దోషానికి సంకేతం కావచ్చు. కాబట్టి ఈ సంకేతాలు కనిపించిన వెంటనే ఇంట్లో వాస్తు దోషం ఉందని భావించి.. దానిని నివారించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి.చిన్నచిన్న రెమెడీస్‌తో వాస్తు దోషాలను దూరం చేసుకోవచ్చు .
వాస్తు దోషం ఉంది మీ ఇంటికి అని చెప్పగానే చాలామంది వేలు,లక్షల రూపాయలు ఖర్చుపెట్టి రెమిడీలు చేయిస్తుంటారు.అయితే ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా వాస్తు దోషాన్ని వదిలించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
మీ ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఇంటి ప్రధాన ద్వారం మీద కుంకుమతో తొమ్మిది పొడవు, తొమ్మిది వెడల్పు గల స్వస్తిక చిహ్నాన్ని తయారు చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ప్రవేశించే నెగిటివిటీ లేదా అడ్డంకులు తొలగిపోతాయి.
ఇంట్లో గుర్రపుడెక్కను వేలాడదీయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు దోషాలు పోవాలంటే నల్ల గుర్రపుడెక్కను ఇంట్లో ఈశాన్య మూలలో వేలాడదీస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి. గుర్రపుడెక్కను ఇంట్లో వేలాడదీయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఇంట్లో ఈశాన్య మూలలో వెండి నాణెం ఉన్న మట్టి పాత్రను ఉంచి దానిని భూగర్భంలో పెట్టి ఉంచండి, అయితే ఈ పని చేసేటప్పుడు ఎవరూ చూడకూడదని గుర్తు.అయితే ఆ
కలశం పగలకూడదు. ఇంటి ఈశాన్య దిక్కు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందువల్ల ఈ మూలలోనే దానిని ఉంచాలి.
గమనిక: ఈ కథనంలో మేము పొందు పరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణులు సలహాలు తీసుకోవాలి. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి సంబంధం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications