Latest Updates
-
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్!
జాబ్ లో ఎంత కష్టపడ్డా గుర్తింపు, ప్రమోషన్ రావట్లేదా? ఈ పవర్ ఫుల్ పరిహారంతో మీ జాతకమే మారిపోతుంది
ఉద్యోగ జీవితంలో ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో అడుగుపెడతాం. కానీ కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు దక్కవు. ప్రమోషన్లలో జాప్యం, చేసిన పనికి గుర్తింపు లేకపోవడం, పై అధికారుల నుండి ఒత్తిడి, తోటి ఉద్యోగుల నుండి అడ్డంకులు ఇలాంటివి మనల్ని మానసికంగా, శారీరకంగా అలసటకు గురిచేస్తాయి. లోపల ఏదో తెలియని నిరాశ ఆవరిస్తుంది. అదే సమయంలో మన కన్నా తక్కువ పనిచేసేటోళ్లకి, పెద్దగా తెలివిలేదనుకునేటోళ్లకి కూడా ప్రమోషన్స్ వస్తుంటాయి..ఇక వారు చేసే ఓవరాక్షన్ కి పెద్ద చిరాకు వస్తుంటది. మీరు కూడా ఇలాంటి సమస్యలతో సతమతమవుతూ, మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించడం లేదని భావిస్తుంటే ఓ చిన్న జ్యోతిష్య చిట్కాతో ఈ ప్రాబ్లమ్ కి చెక్ పెట్టవచ్చని పండితులు చెబుతున్నారు.
కర్ఫూరంతో ఇలా
జ్యోతిష్య పండితుల ప్రకారం కర్పూరం శుక్ర గ్రహానికి ప్రతీక. శుక్రుడు జీవితంలో ఆనందం, శ్రేయస్సు, భోగభాగ్యాలను ప్రసాదిస్తాడు. జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉంటే ఉద్యోగ, వ్యాపార, వృత్తిపరమైన సమస్యలు తొలగిపోయి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ పరిహారంలో కర్పూరంతో పాటు మరో రెండు వస్తువులను ఉపయోగించడం వల్ల దీని శక్తి రెట్టింపు అవుతుంది. ఈ మూడు వస్తువుల కలయిక ఒక శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీని సృష్టించి మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణాన్ని తొలగిస్తుంది.

పరిహారం చేసే విధానం
సూర్యాస్తమయం తర్వాత(సాయంత్రం 7 గంటల టైంలో) ప్రశాంతమైన వాతావరణంలో ఒక మట్టి ప్రమిదను తీసుకోండి. దానిలో ముందుగా సిద్ధం చేసుకున్న 7 కర్పూరం బిళ్ళలు, 7 లవంగాలు, 7 తెల్ల పంచదార చిలకలు ఉంచండి. ఇప్పుడు దానిని వెలిగించి మీ ఇంటిలోని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచండి. ఈ రెండు దిశలు ఉద్యోగంలో అభివృద్ధికి, ఆర్థిక పురోగతికి అత్యంత శుభప్రదమైనవిగా పరిగణిస్తారు. ఈ దీపం వెలిగించేటప్పుడు మీరు ఒంటరిగా ఉండాలి. మీతో పాటు మరెవరూ ఉండకూడదు. పూర్తి ఏకాగ్రతతో మీ మనసులోని కోరికను తలచుకుంటూ శ్రద్ధతో ఈ పరిహారం చేయాలి. అప్పుడే ఫలితం లభిస్తుందట.
పరిహారం పూర్తయిన తర్వాత ప్రమిదలో మిగిలిన బూడిదను జాగ్రత్తగా సేకరించండి. ఈ బూడిదను ప్రవహించే నీటిలో కలిపివేయాలి. ఇలా చేయడం వల్ల మీపై ఉన్న ప్రతికూల శక్తుల ప్రభావం పూర్తిగా తొలగిపోయి, సానుకూల మార్పులు కనిపిస్తాయి. మీ ఉద్యోగ జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోయి, మీరు కోరుకున్న విజయం, గుర్తింపు, పదోన్నతి లభిస్తాయని చెబుతున్నారు.
ప్రతిరోజూ సాయంత్రం ఈ పరిహారం చేస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయని..ఒకవేళ ప్రతిరోజూ సాధ్యం కాకపోతే కనీసం శుక్రవారం నాడు తప్పకుండా చేయాలని.. శుక్రవారం శుక్రుడికి అంకితం చేయబడిన రోజు కాబట్టి ఆ రోజు చేసే పరిహారాలు త్వరితగతిన ఫలితాలనిస్తాయని పండితులు చెబుతున్నారు. మీరు స్వయంగా చేయలేని పక్షంలో మీ అమ్మ లేదా సోదరి చేత చేయించవచ్చు. స్త్రీలు చేసే శుక్ర సంబంధిత పరిహారాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయని శాస్త్రం చెబుతోంది.
ఈ పరిహారం ఎప్పుడు చేయకూడదు?
ఈ శక్తివంతమైన పరిహారం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కుటుంబంలో ఎవరైనా ఇటీవల మరణించి ఉంటే ఈ పరిహారం చేయకూడదు. పితృ పక్షం రోజులలో, మహిళలు ఋతుస్రావ సమయంలో ఈ పరిహారం చేయకూడదని పండితులు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











