Latest Updates
-
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే!
Astrology Today In Telugu: భాగస్వామితో అపార్థాలు..యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్!
మన రోజువారీ జీవితంలో జరగబోయే విషయాలను జ్యోతిష్యశాస్త్రం అంచనా వేస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల స్థానాలు, నక్షత్రాల కదలికల ఆధారంగా ప్రతిరోజూ అన్ని రాశులకు ఫలితాలు మారుతూ ఉంటాయి. ఆ విధంగా ఇవాళ మంగళవారం ఏప్రిల్ 15,2025 ఏ రాశుల వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది..ఏ రాశుల వ్యక్తులు సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది.. ఆరోగ్యపరంగా,వృత్తి పరంగా,ఆర్థికపరంగా,కుటుంబ జీవితంలో,వ్యాపారస్తులకు ఎలాంటి మార్పులు ఉంటాయనే దాని వివరాలను మీ రాశి ప్రకారం ఇక్కడ చూసి తెలుసుకోండి.
మేషం
ఈ రోజు మేష రాశి వ్యక్తులకు శక్తివంతమైన, ఉత్సాహభరితమైన రోజుగా ఉంటుంది. మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి స్ట్రాంగ్ గా ఉంటారు. కార్యాలయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా మీరు కొన్ని మంచి అవకాశాలను పొందవచ్చు..కానీ జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. భాగస్వామితో విభేధాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కొన్ని చిన్న సమస్యలు ఉండవచ్చు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి.

వృషభం
ఈ రోజు మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. సహనంతో ఉండటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం ముఖ్యం. కార్యాలయంలో మీ సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థికంగా లాభాలు పొందుతారు కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీ బడ్జెట్ ను జాగ్రత్తగా నిర్వహించండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు. మీ భాగస్వామితో ఓపికగా మాట్లాడండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది..కానీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అవివాహితులకు పెళ్లి సంబంధం వచ్చే ఛాన్స్ ఉంది.
మిథునం
ఈ రోజు మిథునరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త ఆలోచనలతో నిండి ఉంటారు,వాటిని ఆచరణలో పెట్టడానికి ఇది మంచి సమయం. కార్యాలయంలో మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా మీరు కొన్ని లాభాలను పొందవచ్చు. అనవసరమైన ఖర్చులు,పెట్టుబడులకు దూరంగా ఉండాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. భాగస్వామితో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది, కానీ ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. డ్రైవింగ్ చేయడం మానుకోవడం బెటర్..ఎందుకంటే శారీరకంగా గాయపడే అవకాశం ఉంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.
కర్కాటకం
ఈ రోజు మీరు భావోద్వేగంగా ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందవచ్చు. మీరు కూడా శారీరక నొప్పిని అనుభవించే అవకాశం ఉంది. కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా మీరు కొన్ని నష్టాలను చవిచూడవలసి రావచ్చు, కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు. మీ భాగస్వామితో శాంతంగా మాట్లాడండి. ఏదైనా యాత్రకు వెళ్లాలని ఫ్లాన్ చేస్తుంటే దాన్ని రద్దు చేసుకోవాలని పండితులు తెలిపారు.
సింహం
ఈ రోజు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కార్యాలయంలో మీ నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. ఆర్థికంగా మీరు కొన్ని మంచి అవకాశాలను పొందవచ్చు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ ఇంటికి ఓ ముఖ్యమైన అతిథి రావొచ్చు..వారిని చూసి మీరు చాలా సంతోషిస్తారు. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది.
కన్య
ఈ రోజు మీరు కొన్ని విషయాల్లో నిరాశ చెందవచ్చు. మీ ప్రణాళికలు అనుకున్న విధంగా జరగకపోవచ్చు. కార్యాలయంలో మీరు మరింత కష్టపడవలసి ఉంటుంది. ఆర్థికంగా, మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. యోగా, ధ్యానం మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న మీ నిరీక్షణ ముగుస్తుంది. ఈ రోజు మీరు ప్రత్యేకమైన వ్యక్తిని కలవొచ్చు. వ్యాపారస్థులకు ఈ రోజు ఒక సువర్ణావకాశం.
తుల
ఈ రోజు మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. కార్యాలయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. ఆర్థికంగా మీరు కొన్ని లాభాలను పొందవచ్చు. ప్రేమ జీవితం చాలా రొమాంటిక్ గా ఉంటుంది. మీ భాగస్వామితో ఒక ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. మాకు రావాల్సిన పెండింగ్ బకాయిలను తిరిగి పొందే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుడితో వాగ్వాదం ఉండొచ్చు. తగాదాలకు దూరంగా ఉండాలి..ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకూడదు.
వృశ్చికం
ఈ రోజు మీరు కొన్ని రహస్యమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కార్యాలయంలో మీ సహోద్యోగుల నుండి మీకు సహాయం లభిస్తుంది. ఆర్థికంగా మీరు కొన్ని ఊహించని లాభాలను పొందవచ్చు. ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి..లేకుంటే నష్టం జరగవచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి..మీ శత్రువులు మిమ్మల్ని రెచ్చగొట్టవచ్చు.
ధనుస్సు
ఈ రోజు ధనుస్సు రాశి వ్యక్తులు ప్రయాణాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కొత్త ప్రదేశాలను సందర్శించడం మీకు ఆనందాన్నిస్తుంది. కార్యాలయంలో మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఆర్థికంగా మీరు కొన్ని మంచి పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ మాటలను నియంత్రించుకోవాలి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఇవాళ ధనస్సు రాశి వారు చేసే ప్రతి పనిలో విజయమే లభిస్తుంది.
మకరం
మకర రాశి వ్యక్తులు ఈ రోజు మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడవలసి ఉంటుంది. కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం ముఖ్యం. కుటుంబంలో ఏదైనా పాత వివాదం జరుగుతుంటే అది ముగిసిపోయే ఛాన్స్ ఉంది.
కుంభం
కుంభరాశి వ్యక్తులు ఈ రోజు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విషయాలపై ఆసక్తి చూపుతారు. కార్యాలయంలో మీ ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా కొన్ని కొత్త ఆదాయ మార్గాలను కనుగొనవచ్చు. స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కోర్టులో ఆస్తికి సంబంధించి ఏదైనా కేసు నడుస్తుంటే విచారణ కారణంగా మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్గా ఉండకూడదు. ఏదైనా ఇబ్బంది వస్తే టైంకి డాక్టర్ ని సంప్రదించాలి.
మీనం
ఈ రోజు మీన రాశి వ్యక్తులు ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ దృష్టి పెడతారు. దేవాలయాలను సందర్శించడం లేదా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు ప్రశాంతతను ఇస్తుంది. కార్యాలయంలో మీరు మీ పనులను పూర్తి చేయడానికి మరింత సమయం కేటాయించవలసి ఉంటుంది. ఆర్థికంగా మీరు కొన్ని మంచి ఫలితాలను పొందవచ్చు. కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో కొన్ని చిన్న సమస్యలు ఉండవచ్చు. పాత అనారోగ్యాలు ఏవైనా తిరిగి కనిపించవచ్చు. ఈ రోజు ప్రయాణానికి దూరంగా ఉండటం బెటర్. మీ ప్రియమూన వ్యక్తి ఆరోగ్యం గురించి విచారకరమైన వార్తలు వినే ఛాన్ప్ ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











