Latest Updates
-
బీహారీ స్పెషల్ దాల్ పిఠీ..ఇది తింటే పిజ్జా, బర్గర్లు కూడా మర్చిపోతారు! -
షుగర్ పేషెంట్లు తినాల్సిన బెస్ట్ హెల్తీ స్నాక్స్ ఇవే.. -
బెండకాయ ఫ్రై ఇలా చేస్తే..కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ..పప్పుచారు, రసంలో నంజుకుంటే కేక -
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన 5 ఫుడ్స్ ఇవే.. -
ఎనకటి తరం హెల్తీ బ్రేక్ ఫాస్ట్..పోషకాలు నిండిన రాగి మునగాకు రొట్టె..చేయడం చాలా ఈజీ -
మా కంపెనీలో ఎందుకు పని చేయాలనుకుంటున్నారు? అభ్యర్థి ఆన్సర్ తో నెట్టింట రచ్చ.. -
గొంతు గరగరను తగ్గించే,రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి కొత్తిమీర సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
రైస్ vs చపాతీ..రాత్రి డిన్నర్ లోకి ఏది తినాలి?..డాక్టర్ దీప్తి చెప్పిన కీలక విషయం.. -
రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
కొరియన్ల లాగా మెరిసే చర్మం మీ సొంతం కావాలా? అయితే ఈ 5 పండ్లు తినాల్సిందే!
పంజాబీ జీరా ఆలూ ఫ్రై.. అన్నం, పూరీ, చపాతీల్లోకి అదిరిపోయే సైడ్ డిష్!
కూరగాయల్లో రారాజు బంగాళదుంప అనడంలో ఎలాంటి సందేహం లేదు. వేపుడు చేసినా, కూర వండినా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. చికెన్ లాగే బంగాళదుంపతోనూ ఎన్నో వెరైటీలు చేయొచ్చు. అందులో ఒకటే.. కమ్మని వాసనతో నోరూరించే పంజాబీ జీరా ఆలూ (జీలకర్ర-బంగాళదుంప వేపుడు).
ఇంట్లోనే ఉండే సాధారణ మసాలాలతో పంజాబీ స్టైల్‌లో చేసే ఈ వేపుడు రుచి అద్భుతంగా ఉంటుంది. అన్నం, పప్పులోకి మాత్రమే కాకుండా పూరీ, చపాతీల్లోకి కూడా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. పంజాబీ జీరా ఆలూ ఫ్రై మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు- అర కేజీ
నూనె - 4 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 4 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు - 4
ధనియాలు - 4 టేబుల్ స్పూన్లు
పసుపు - అర టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 2
కారం - ఒకటిన్నర టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
ఆమ్చూర్ పొడి - 4 టేబుల్ స్పూన్లు
నిమ్మకాయ - 1
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - ఒక గుప్పెడు
బెండకాయ ఫ్రై ఇలా చేస్తే..కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ..పప్పుచారు, రసంలో నంజుకుంటే కేక
తయారీ విధానం
-ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసి 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. దుంపలు మరీ మెత్తగా అవ్వకూడదు, వాటి ఆకారం కోల్పోకుండా చూసుకోవాలి. పెద్ద బంగాళదుంపలైతే ఉడికాక ముక్కలుగా కోసుకోవాలి. తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో ధనియాలు, ఎండు మిరపకాయలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి.
-స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడయ్యాక మంటను మీడియంలో పెట్టి జీలకర్ర వేయించాలి. జీలకర్ర మాడిపోకుండా చూసుకోవాలి.
-ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ధనియాలు-ఎండుమిర్చి మిశ్రమం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి, సరిపడా ఉప్పు వేసి మసాలాలను బాగా కలపాలి.
-ఉడికించిన బంగాళదుంపలను అందులో వేసి మసాలా అంతా పట్టేలా బాగా కలిపి, మూతపెట్టి 10-12 నిమిషాల పాటు సన్నని మంటపై మగ్గనివ్వాలి.
-చివరగా స్టవ్ ఆఫ్ చేసి.. నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కలుపుకుంటే చాలు.
-అంతే ఎంతో రుచికరమైన పంజాబీ స్టైల్ జీరా ఆలూ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
