Latest Updates
-
ఇట్ట తయారయ్యారేందే: ప్రియుడితో సుఖం కావాలని భర్తను దారుణంగా.. -
ప్రేమించిన పాపానికి ఇంత ఘోరమా? తండ్రీకొడుకులను నగ్నంగా నడిపించిన యువతి కుటుంబం! -
పంజాబీ జీరా ఆలూ ఫ్రై.. అన్నం, పూరీ, చపాతీల్లోకి అదిరిపోయే సైడ్ డిష్! -
బీహారీ స్పెషల్ దాల్ పిఠీ..ఇది తింటే పిజ్జా, బర్గర్లు కూడా మర్చిపోతారు! -
షుగర్ పేషెంట్లు తినాల్సిన బెస్ట్ హెల్తీ స్నాక్స్ ఇవే.. -
బెండకాయ ఫ్రై ఇలా చేస్తే..కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ..పప్పుచారు, రసంలో నంజుకుంటే కేక -
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన 5 ఫుడ్స్ ఇవే.. -
ఎనకటి తరం హెల్తీ బ్రేక్ ఫాస్ట్..పోషకాలు నిండిన రాగి మునగాకు రొట్టె..చేయడం చాలా ఈజీ -
మా కంపెనీలో ఎందుకు పని చేయాలనుకుంటున్నారు? అభ్యర్థి ఆన్సర్ తో నెట్టింట రచ్చ.. -
గొంతు గరగరను తగ్గించే,రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి కొత్తిమీర సూప్..ఎలా చేసుకోవాలంటే..
జస్ట్ 5 నిమిషాల్లో టేస్టీ ఎగ్ పరోటా..ఈజీగా చేసుకోండిలా
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఎప్పుడూ అవే రొటీన్ ఇడ్లీ, దోశలు, బోండాలు, పూరీలు తిని తని నాలుకకి ఏమీ సహించట్లేదా? కొత్తగా టేస్టీగా ఏదైనా కావాలని మీ నాలుక గుంజేస్తుందా? అయితే ఒక్కసారి ఫ్లఫీ ఎగ్ పరోటా ట్రై చేయండి. దీన్ని చూడగానే ఎప్పెడెప్పుడు తిందామా అనే ఫీల్ కలుగుతుంది. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. దీనిని తయారుచేయడానికి కూడా పెద్దగా సమయం పట్టదు. రెగ్యులర్ గా వంటగదిలో ఉండే పదార్థాలతోనే దీనిని తయారుచేసుకోవచ్చు. జస్ట్ 5 నిమిషాల్లోనే టేస్టీ ఎగ్ పరోటా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఎగ్ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు
-మైదా పిండి
-నీళ్లు
-ఉల్లిపాయ తరుగు
-ఉప్పు
-కొత్తిమీర
-కోడిగుడ్లు
-చిల్లీ ఫ్లేక్స్
-చాట్ మసాలా
-ఆయిల్

ఎగ్ పరోటా తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో 1 కప్పు మైదా పిండి వేయండి,ఇందులో కొద్దిగా నీళ్లు పోసి పిండిని కలుపుకోండి. ఈ పిండిని పక్కన పెట్టుకోండి.
-తర్వాత మరో గిన్నెలో 3 కోడిగుడ్లు కొట్టి వేయండి, ఇందులో 1 టేబుల్ స్పూన్ సన్నని ఉల్లిపాయ తరుగు, 3 ఉల్లిపాయల సన్నని తరుగు, అర టీస్పూన్ ఉప్పు, కొంచెం కొత్తిమీర తరుగు వేసి స్పూన్ లేదా విస్కర్ తో మొత్తం కలిసేలా కలిపి పక్కన పెట్టుకోండి.
ఎనకటి తరం హెల్తీ బ్రేక్ ఫాస్ట్..పోషకాలు నిండిన రాగి మునగాకు రొట్టె..చేయడం చాలా ఈజీ
-తర్వాత కలిపిన పిండి నుంచి కొంచెం తీసుకుని చపాతీ పీట మీద దాన్ని పెట్టి పరోటాలా ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత దీనిమీద చిటికెడు చాట్ మసాలా, చిడికెడు చిల్లీ ఫ్లేక్స్, కొంచెం కొత్తిమీర తరుగు చల్లుకోండి. ఇవి వేసిన తర్వాత కూడా చపాతీ కర్రలో మరోసారి పరోటాని ఒత్తుకోండి. తర్వాత చాకుతో అన్నీ సమానభాగాలుగా కట్ చేసి చిన్న బాక్స్ సైజ్ లో మడతపెట్టి మళ్లీ కర్రతో దాన్ని ఒత్తుకోండి.
-తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి కొంచెం దానిమీద ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయండి. తర్వాత ఒత్తుకున్న పరోటాను కోడిగుడ్ల మిశ్రమంలో ముంచి దాన్ని పెనం మీద వేయండి. ఒకవైపు కాలిన తర్వాత తిప్పి మరోవైపు కాల్చుకోండి. రెండువైపులా బాగా కాలిన తర్వాత స్టవ్ ఆపేయండి.
-అంతే ఎగ్ పరోటా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
