మాంసాహారాన్ని మించే రుచితో స్పైసీ సోయా చుక్కా..రైస్, చపాతీ, దోశలోకి బెస్ట్ సైడ్ డిష్

Posted By:

శాఖాహారులకు ఎక్కుగా ప్రొటీన్ అందించేవాటిలో సోయా(మీల్ మేకర్)ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. మీల్ మేకర్ తో అనేక రకాల వంటకాలు చేస్తుంటారు. పులావ్, ఇతర రైస్ వంటకాల్లో కూడా దీన్ని యాడ్ చేస్తుంటారు. సోయాతో ఏది వండినా దాని రచి అద్భుతమే. అయితే మీరెప్పుడైనా సోయా చుక్క వంటకం ట్రై చేశారా? స్పైసీ, టేస్టీగా ఉండే దీని రుచిని కొన్ని నెలల వరకు నాలుక మరువదు. అంత అద్భుతంగా ఉంటుంది. అన్నం, చపాతీ, దోశ, రసంతో కలిపి నంజుకోడానికి కూడా ఇది సూపర్ గా ఉంటుంది. సౌత్ ఇండియా స్టైల్ లో సోయా చుక్కా మీ ఇంట్లో తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు

సోయా చుక్కా కోసం:

ఉడికించిన మీల్ మేకర్ 2 కప్పులు
నూనె 2 టేబుల్ స్పూన్లు
సోంపు 1 టీస్పూన్
కరివేపాకు 1 రెమ్మ
ఉల్లిపాయ 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్
టమాటో 1
పసుపు పావు టీస్పూన్
కారం 1 టీస్పూన్
ధనియాల పొడి 1 టీస్పూన్
ఉప్పు రుచికి తగినంత
పచ్చిమిర్చి 2
కరివేపాకు కొంచెం
కొత్తిమీర గుప్పెడు
నీరు తగినంత

జస్ట్ 5 నిమిషాల్లో టేస్టీ ఎగ్ పరోటా..ఈజీగా చేసుకోండిలా

చుక్కా పౌడర్ కోసం:

సోంపు 1 టీస్పూన్
మిరియాలు 1 టీస్పూన్
జీలకర్ర 1 టీస్పూన్
దాల్చిన చెక్క 1 చిన్న ముక్క
లవంగాలు 2
యాలకలు 1

Spicy Soya Chukka Recipe in Telguu South Indian Style Meal Maker Fry

తయారీ విధానం

-ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోండి. అందులో కొబ్బరి నూనె లేదా వేరుశెనగ నూనె వేసి వేడి చెయ్యాలి.

-నూనె వేడయ్యాక అందులో సోంపు గింజలు, కరివేపాకు వేసి వేగాక అందులో సన్నని ఉల్లిపాయ చీలికలు, ఉప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి.

-తర్వాత అందులో ఉడికించి నీరు పిండేసిన సోయా చంక్స్(మీల్ మేకర్)వేసి కలపండి. తర్వా ఇందులో టమాటో ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. పాన్ పై మూతపెట్టి మసాలా వేగి సోయా ముక్కలకు అంతా పట్టే వరకు వేయించాలి.

-అది వేగేలోపు, చుక్కా పౌడర్ రెడీ చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్ లో సోంపు గింజలు, మిరియాలు,జీలకర్ర, దాల్చిన చెక్క, యాలక, లవంగాలు వేసి కొంచెం బరక పొడిలా ఉండేలా గ్రైండ్ చేసుకోండి.

-ఈ చుక్కా పొడిని పాన్ లో ఉన్న సోయా మిశ్రమంలో వేసి పెద్ద మంట మీద కలుపుతూ సోయా వేగేదాకా వేయించుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా అడ్జెస్ట్ చేసుకోండి. తర్వాత అందులో తరిగిన కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికల వేసి ఒక నిమిషం కలిపి స్టవ్ ఆపేయండి.

-అంతే సోయా చుక్కా రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, October 27, 2026, 11:35 [IST]
Desktop Bottom Promotion