Latest Updates
-
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.!
పెట్రోలియం జెల్లీని ఉపయోగించే అనేక మార్గాలు
1.పెట్రోలియం జెల్లీ లిప్ బామ్ గా పనిచేస్తుంది, ప్రతిరోజూ దీనిని మీ పెదాలపై అప్లై చేస్తే పెదాలు తడిగా, మృదువుగా, ఉంటాయి. మంచి ఫలితాల కోసం, పడుకోబోయే ముందు దీనిని మీ పెదాలకు రాయండి, తెల్లారే సరికి మీ పెదాలు మెరుస్తూ, మృదువుగా ఉండడం గమనిస్తారు.
2. మీ పాత లిప్ స్టిక్ లకు పెట్రోలియం ని జతచేయడం వల్ల మీ లిప్స్తిక్స్, గ్లోసేస్ కు కొత్త రూపం వస్తుంది. అవును, కొద్ది పెట్రోలియం జెల్లీని పూసి, దానిని లిప్ గ్లాస్ గా ఉపయోగించండి.
3. పెట్రోలియం జెల్లీ ని పెదాల పగుళ్ళకు కూడా ఉపయోగించ వచ్చు. ఒక సున్నితమైన టూత్ బ్రష్ పై కొద్ది పెట్రోలియం జెల్లీని పూయండి, దానిని మీ పెదాలపై పూయండి. ఇది మీ పెదాలపై ఉన్న డెడ్ స్కిన్ ని తొలగించడానికి సహాయపడి మీ పెదాలు తడిగా, మెరుస్తూ ఉంటాయి. మీరు నిద్ర లేవగానీ దీనిని ప్రయత్నించడం మంచి పద్ధతి.
4. చలిగాలుల నుండి మీ మృదువైన కనురెప్పలను రక్షించి, ఆరోగ్యంగా ఉంచడానికి పెట్రోలియం జెల్లీ ఖచ్చితమైన ఎంపిక. మీరు పడుకోబోయే ముందు మీ కనురెప్పలకు పెట్రోలియం జెల్లీని పలుచని పొరలాగా రాయండి.
5. పెట్రోలియం జెల్లీ సహాయంతో మీ కనుబోమలను తిరిగి పొందాలంటే కొద్ది పెట్రోలియం జెల్లీని కనుబోమలపై రాసి వదిలేయండి. ఇది కనుబొమల ఏర్పాటు చేయకపోయినా మంచిగా పనిచేస్తుంది.

6. మీ చెంపలు, కనుబోమలపై ఈ పెట్రోలియం జెల్లీ ని అప్లై చేస్తే మీ ఫేస్ తాజాగా, మెరుపుగా కనిపిస్తుంది.
పెట్రోలియం జెల్లీని కొద్ది సెకండ్లు వేడిచేసి, నైట్ క్రీమ్ గా వాడుకోవచ్చు, ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల చర్మం మృదువుగా, శుభ్రంగా ఉంటుంది. ఆయిలీ స్కిన్ వారు దీనిని రోజోమర్చి రోజు వాడండి.
7. మీ నాలుగు వేళ్ళతో పెట్రోలియం జెల్లీని తీసుకుని మీ పాదం మొత్తం పూయండి. అప్లై చేసిన తరువాత సాక్స్ ధరించి రాత్రంతా వదిలేయండి. ఈ చికిత్స వల్ల పాదాలు, వేళ్ళు సున్నితంగా ఉంటాయి. ఇది పొడి పాదాలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది, పెట్రోలియం జెల్లీ వాటిని తడిగా, పొడి లేకుండా చేస్తుంది.
ఇలాగే చేతులకు కూడా ప్రయత్నించండి, జెల్లీని చేతులకు పూసి కాటన్ గ్లోవ్స్ ను ధరించండి. రాత్రంతా వదిలేసి, మీ చర్మంపై ఏర్పటిన కొత్త రూపును గమనించండి.
8. కొద్ది పెట్రోలియం జెల్లీని మీ వేళ్ళ గోళ్ళకు రాస్తే ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. రోజుకు రెండుసార్లు దీనిని అప్లై చేస్తే, చర్మం పైపొర మృదువుగా, తేమగా ఉంటుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల తేలికగా గోళ్ళను కత్తిరించి ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
9. కొద్ది పెట్రోలియం జెల్లీని జుట్టు చివర్లకు పూస్తే, విరిగిన జుట్టును కవర్ చేయవచ్చు. ఇలా రోజూ చేయడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది.
10. అనేక పెర్ఫ్యూమ్ లు చాలా తక్కువ సమయంలో వాటి ఫ్రాగ్రన్స్ ని కోల్పోతాయి, మే పెర్ఫ్యూమ్ ఎక్కువ సేపు నిలవాలంటే, మీరు పెర్ఫ్యూమ్ కొట్టిన చోట కొద్ది పెట్రోలియం జెల్లీని అప్లై చేయండి. దీనివల్ల సువాసన మంచి సమయం వరకు ఉంటుంది.



Click it and Unblock the Notifications