For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టాల్డ్ లేబర్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు

స్టాల్డ్ లేబర్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు

|

గర్భిణీలు తమ ప్రసవం ఎటువంటి ప్రసవ వేదన లేకుండా సజావుగా జరగాలని, నార్మల్ డెలివరీ ద్వారా పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటారు. ఇది సహజమైన విషయమే. అయితే, అన్ని విషయాలు మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితమవదు. కొన్ని అనుకోని సంఘటనలు కూడా ఎదురవవచ్చు. ప్రసవ సమయంలో కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురవవచ్చు.

ప్రతి మహిళ యొక్క ప్రసవ అనుభవం విభిన్నంగా ఉంటుంది. అయినా, నార్మల్ లేబర్ కి సంబంధించిన కొన్ని నిర్ధారకాలు ఉంటాయి. కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ తగిన సమయంలో వాటికవే ముందుకు సాగుతూ ఉండాలి.


టెక్స్ట్ బుక్ లో వివరించిన ప్రకారం ముఖ్యంగా డెలివరీ సమయంలో అన్ని విషయాలు అలాగే జరగవు. సాధారణ ప్రసవం కోసం ప్రయత్నిస్తున్న మహిళ సడెన్ గా ప్రసవం ఆగిపోయినట్లుగా భావిస్తే లేదా ప్రోగ్రెస్ అనుకున్నంత వేగంగా ముందుకు సాగటం లేదన్నట్టు భావిస్తే దాన్ని "స్టాల్డ్ లేబర్" అనంటారు.

స్టాల్డ్ లేబర్ అనేది ఆందోళనను పెంచే అంశం. అదృష్టవశాత్తు, దీని వలన బేబీకి గానీ తల్లికి గానీ ఎటువంటి ప్రమాదమూ తలెత్తే అవకాశం లేదు. అయినా, తల్లిలో ఆందోళన కలగడం సహజం. ఈ విషయంపై ఒక అవగాహనకు వస్తే స్టాల్డ్ లేబర్ గురించి ఉన్న అపోహలు తొలగిపోతాయి.

ప్రసవ సమయంలో స్టాల్డ్ లేబర్ గనక మీకు అనుభవంలోకి వస్తే మీరు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండండి. బేబీకి జన్మనిచ్చే ప్రాసెస్ ను తిరిగి ఏ విధంగా ట్రాక్ లో పెట్టాలో ఆలోచించుకోండి. స్టాల్డ్ లేబర్ కి దారి తీసే కారణాలు అలాగే స్టాల్డ్ లేబర్ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్టాల్డ్ లేబర్ కి దారితీసే కారణాలేంటి?

ఇండ్యూస్డ్ లేబర్

ఎమోషనల్ డిస్టాసియా

ఎపిడ్యూరల్ వాడకం

గర్భస్థ శిశువు యొక్క పొజిషన్

స్టాల్డ్ లేబర్ నుంచి ఉపశమనం పొందటామెలా?

పిటోసిన్ వాడుక గురించి చర్చించండి

విశ్రాంతి

మీ పొజిషన్ ను మార్చుకోండి

నడక

నిపుల్ ను ప్రేరేపించండి

షవర్ తీసుకోండి

వాతావరణ మార్పు


• ఇండ్యూస్డ్ లేబర్:

ఇండ్యూస్డ్ పద్దతిలో ప్రసవం జరుగుతున్నట్లయితే స్టాల్డ్ లేబర్ కి గురయ్యే ప్రమాదం ఎదురవవచ్చు. ఈ పద్దతిలో కొన్ని సార్లు ఇండక్షన్ విఫలించి సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉండవచ్చు.

మీ శరీరం జన్మనివ్వడానికి సిద్ధంగా లేనప్పుడు మీరు ఇండ్యూస్డ్ లేబర్ ద్వారా కృత్రిమంగా ప్రసవానికి తయారైనప్పుడు ప్రసవ ప్రక్రియ మీరనుకున్న విధంగా ముందుకు సాగకపోవచ్చు. మీ వైద్యులు ఇండక్షన్ ప్రాసెస్ ను మీకు సూచించినప్పుడు ఈ ప్రాసెస్ వలన కలిగే ఇబ్బందుల గురించి వైద్యునితో చర్చించడం మానవద్దు. మీ ఆరోగ్యాన్ని మీ బేబీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్యులు ఈ పద్దతిని సూచించినప్పుడు వైద్యుల మాటను పాటించడం తప్పదు.

• ఎపిడ్యూరల్:

ఎపిడ్యూరల్ అనేది నడుము కింది భాగాన్ని మొద్దుబారుస్తుంది. అప్పుడు మీకు నడుం కింది భాగం వద్ద స్పర్శ తెలియదు. కాంట్రక్షన్స్ ని గాని నొప్పిని గాని తెలుసుకోవడం కష్టమవుతుంది. అందువలన, మీ పుషింగ్ అనేది ప్రభావితంగా ఉండకపోవచ్చు.

ఎపిడ్యూరల్ అనేది కాంట్రక్షన్స్ ని నెమ్మది చేయవచ్చు లేదా కాస్త సేపు నిలిపివేయవచ్చు. యుటెరస్ వద్ద అలాగే పెల్విస్ వద్ద ఉండే కండరాలు ఎపిడ్యూరల్ ప్రభావంతో విశ్రాంతి చెందడం వలన ఇలా జరుగుతుంది. ఇలా జరిగితే లేబర్ ను రీస్టార్ట్ చేసేందుకు మీకు పిటోసిన్ మోతాదు మరింత అవసరపడవచ్చు.

• ఎమోషనల్ డిస్టాసియా:

మానసిక ఒత్తిడి అలాగే సైకలాజికల్ ఎఫెక్ట్స్ అనేవి ప్రసవంపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ప్రసవ ప్రక్రియ సజావుగా ముందుకు సాగదు. ప్రసవం మొత్తానికి నిలిచిపోయే ప్రమాదం ఉంది. ప్రసవ వేదన వలన కలిగే భయం కావచ్చు, అభద్రతా భావం కావచ్చు, తగినంత ప్రయివసీ లేనందువలన కావచ్చు, లేదా లైంగిక వేధింపులకు గురవడం వలన గురయిన ఆందోళన వలన కావచ్చు ఎమోషనల్ డిస్టాసియా సంభవించే ఆస్కారం ఉంది.

ఈ సమస్యలతో పాటు మరేవైనా సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించండి. ప్రసవ ప్రక్రియ సజావుగా సాగేందుకు సలహాలను స్వీకరించండి. మీకు బాగా దగ్గరి వారిని మీ ప్రసవ సమయంలో వెంట ఉండే విధంగా జాగ్రత్తపడండి. తద్వారా, భద్రతా భావం మీలో మొదలవుతుంది.

• గర్భస్థ శిశువు యొక్క పొజిషన్:

ప్రసవ ప్రక్రియకు తీసుకునే సమయం అనేది గర్భస్థ శిశువు పొజిషన్ పై ఆధారపడి ఉంటుంది. బిడ్డ పొజిషన్ అనుకూలంగా లేకపోతే ప్రసవ ప్రక్రియ ఎక్కువ సమయం తీసుకోవచ్చు. సులభమైన కాన్పుకు బేబీ పొజిషన్ అనేది అనుకూలంగా లేకపోతే, ప్రసవానికి కొంత ఎక్కువ సమయం పట్టవచ్చు లేదా ప్రసవం నిలిచిపోవచ్చు.

అటువంటప్పుడు, వైద్యులు మీ పొజిషన్ ను మార్చుకోమని మీకు సూచించవచ్చు. మిమ్మల్ని నడవమని అనవచ్చు. తద్వారా, బిడ్డ పొజిషన్ ను ప్రసవానికి అనుకూలంగా తెచ్చే ప్రయత్నం చేయవచ్చు. అలాగే, మ్యాన్యువల్ గా బేబీ పొజిషన్ ను మార్చేందుకు వారు ప్రయత్నించవచ్చు. ప్రసవానికి అనుకూలమైన పొజిషన్ లోకి బిడ్డ రాగానే ప్రసవ ప్రక్రియ సాధారణ స్థితికి వస్తుంది.

ప్రసవం నిలిచిపోతే మీరేం చేయాలి?

పైటోసిన్ అనేది లేబర్ ని రీస్టార్ట్ చేసేందుకు లేదా నెమ్మదిగా సాగుతున్న ప్రసవ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వాడతారు. మీ డాక్టర్ పైటోసిన్ ను మీకు అందిస్తున్నప్పుడు దానివలన కలిగే ప్రయోజనాల గురించి చర్చించండి. మీకు అలాగే మీ బేబీకి దాని వలన ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు కలగవని నిర్ధారించుకోండి. ఒకవేళ మీ బిడ్డతో పాటు మీరు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రసవం ప్రక్రియ సహజంగానే తిరిగి ప్రారంభమయ్యే వరకు కొన్ని నేచురల్ మెథడ్స్ ని పాటించండి. మరే పద్దతులూ పనిచేయకపోతే పైటోసిన్ ను యాక్సెప్ట్ చేయండి.

• విశ్రాంతి:

మీరు ప్రసవానికి సంబంధించి భయాందోళనలకు గురయినా లేదా మానసిక ఒత్తిడికి గురయినా ప్రసవం నిలిచిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, మీరు తగినంత విశ్రాంతిని తీసుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని బాధపెట్టే విషయాల గురించి ఆలోచించకుండా ఉండేందుకు ప్రయత్నించండి. మానసిక ఒత్తిడి నుంచి రిలాక్సేషన్ ను పొందండి. మీరు మీ పాపాయి కోసం మీ ఆలోచనలను పాజిటివ్ గా ఉంచుకోవాలని పదే పదే మననం చేసుకోండి. మీ శరీరంతో పాటు మీ మనసు విశ్రాంతి పొందినప్పుడు మీరు తిరిగి ప్రసవ ప్రక్రియపై ఫోకస్ పెట్టగలుగుతారు. ప్రసవం సజావుగా ముందుకు సాగే అవకాశం ఉంది.

• పొజిషన్ ను మార్చుకోండి:

ప్రసవ సమయంలో కాంట్రక్షన్స్ కు తోడ్పడే విధంగా మీ పొజిషన్ ను మార్చుకోవడం ద్వారా ప్రసవ ప్రక్రియకు తోడ్పాటుని అందించవచ్చు. బేబీ బరువుకు తగ్గట్టుగా మీ పొజిషన్ ను మార్చుకోవడం లేదా మజిల్స్ అలాగే యుటెరస్ పై ఒత్తిడిని ని మార్చుతూ పెంచడం వంటివి ప్రసవానికి తోడ్పడతాయి. ఒకవేళ ఎపిడ్యూరల్ వలన మీ లేబర్ ఆగిపోయినా ఈ ప్రక్రియ ద్వారా తిరిగి ప్రసవ ప్రక్రియ సాధారణ స్థితికి చేరే అవకాశం ఉంది.

• నడక:

కాస్తంత శక్తిని కూడదీసుకుని నడిస్తే, నడక ద్వారా ప్రయోజనం పొందవచ్చు. మరే ఇతర సాధారణ పద్ధతులు ప్రసవానికి తోడ్పడనప్పుడు నడక ద్వారా అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు. నడిచేటప్పుడు పెల్విక్ మజిల్స్ వద్ద గ్రావిటీ అనేది లేబర్ ని రీస్టార్ట్ చేసేందుకు తోడ్పడవచ్చు.

• నిపుల్స్ ని ప్రేరేపించడం:

నిపుల్స్ ని ప్రేరేపించడం ద్వారా నిలిచి పోయిన ప్రసవాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చు. నిపుల్ స్టిమ్యులేషన్ ద్వారా ఆక్సీటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది పొడవైన అలాగే బలమైన కాంట్రక్షన్ ని తీసుకువస్తుంది. నిపుల్ ని స్టిములేట్ చేయడానికి చూపుడు మరియు బొటన వేలి మధ్యలోంచి నిపుల్స్ ను సున్నితంగా రబ్ చేయాలి. మీ అరచేతితో కూడా నిపుల్స్ ను స్టిమ్యులేట్ చేయవచ్చు. మీ డాక్టర్ తో నిపుల్ స్టిమ్యులేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ గురించి చర్చించండి.

• షవర్ ని తీసుకోండి:

వెచ్చటి షవర్ ని తీసుకోవడం వలన ప్రసవ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంది. వెచ్చటి షవర్ అనేది మీ శరీరానికి అలాగే మనసుకు విశ్రాంతినిస్తుంది. నీళ్ల వలన కూడా నిపుల్స్ కు తగినంత స్టిములేషన్ జరుగుతుంది. తద్వారా, ఆక్సీటోసిన్ మరియు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి స్టాల్డ్ లేబర్ ని తిరిగి సాధారణ స్థితికి తెచ్చేందుకు తోడ్పడతాయి.

• వాతావరణ మార్పు:

కొన్ని సార్లు హాస్పటల్ లోని బీపింగ్ ఇన్స్ట్రుమెంట్స్, మెడిసిన్ స్మెల్స్ వంటివి గర్భిణీలకు ఆందోళనను అలాగే ప్యానిక్ అటాక్ ను కలిగిస్తాయి. ఇవి ప్రసవాన్ని నిలిపివేసే ప్రమాదం ఉంది. అటువంటి సమయంలో గది మార్పు లేదా లైటింగ్ లో మార్పు వలన గర్భిణీలలో భయాందోళనలను తగ్గించవచ్చు. సూతింగ్ మ్యూజిక్ తో పాటు పెర్ఫ్యూమ్స్ వంటివి పరిస్థితిని అదుపులోకి తెచ్చే అవకాశం ఉంది. గర్భిణీ ఒక్కసారి విశ్రాంతి పొందాక, ప్రసవ ప్రక్రియ సాధారణ స్థితికి చేరుకొని అనుకున్న విధంగా ముందుకు సాగుతుంది.

English summary

Everything You Need To Know About Stalled Labor

Everything You Need To Know About Stalled Labor
Desktop Bottom Promotion