Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
కళ్ళలో మెరుపు కరువవుతోందా?

1. వయసు పెరిగినట్లు కనపడతారు - 30 సంవత్సరాల వయసులోనే 40 సంవత్సరాలు పైబడి కనపడతారు. ప్రయాణాలు చేసిన వారంలో సరైన నిద్ర లేకుంటే దాని ప్రభావం అలసిన మీ ముఖంలో స్పష్టంగా కళ్ళలోను, పెదవులలోను సన్నని ముడుతలుగా కనపడుతుంది. అలసటకు అవే చిహ్నాలు.
2. కళ్ళు ఎంతో ప్రధానం - మెరిసే కళ్ళు మేకప్ తో రావు. సహజంగా మెరిసే కళ్ళు అందానికి అద్దం పడతాయి. మంచి నిద్ర లేకుంటే, జబ్బుపడ్డవారుగా కనపడతారు. మరల పుంజుకోడానికి చాలా సమయం పడుతుంది.
3. అలసిన చర్మం - చర్మం కూడా మెరుపు కోల్పోతుంది. డల్ గా కనపడుతుంది. మంచి నిద్ర పోయి లేచిన తర్వాత వచ్చే ముఖంలోని కాంతిని దేనితోనూ పొందలేము.
4. చర్మంలోని నూనెల అసమతుల్యత - మీ చర్మంలోని ఆయిల్ బ్యాలన్స్ అవాలంటే కనీసం 7 గంటలు నిద్ర కావాలి. నిద్రించేటపుడు శరీరం సహజ ఆయిల్స్ తయారు చేస్తుంది. చర్మాన్ని తేమగా వుంచుతుంది. నిద్ర లేకుండా చర్మం బిరుసుగాను, చేప చర్మం వంటి పొలుసులతోను కనపడి మీకు వయసు పైబడ్డట్లు అనిపిస్తుంది.
5. మరో ఆశ్చర్యకర విషయం నిద్ర సరిగా లేకుంటే బరువు పెరుగుతారనేది. కారణం ...నిద్ర సరిలేని వారు వ్యాయామం వంటివి చేయరు. అంతే కాక తినటానికి ప్రాధాన్యతనిస్తారు. నిద్రసరిగా లేకుంటే రెండు వారాలలో కనీసం 5 పౌండ్ల బరువు పెరగటం ఖాయం అంటారు నిపుణులు.
6. హార్మోన్ల అసమతుల్యత - నిద్ర సరిలేకుంటే ఒత్తిడికి హార్మోన్లలో అసమతుల్యత కలుగుతుంది. హార్మోన్లు సరైన నిష్పత్తిలో లేకుంటే చర్మం ఆరోగ్యంగా వుండదు.
7. నిద్ర సరిలేకుంటే ప్రధానంగా తలనొప్పులు సైతం వచ్చేస్తాయి. ఇక అందంగా వుందామనే భావనలు కూడా మీకు రావు.
కనుక సూచించిన సహజ చిట్కాలు పాటించి అందంగా, కాంతివంతంగా కనపడుతూ ఉల్లాసంతో ఆనందించండి.



Click it and Unblock the Notifications
