Latest Updates
-
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి!
శారీరక ఆహ్లాదాన్నిచ్చే ఆరోమా వైద్యం...

ఆరోమా థెరఫీ కి ఉపయోగపడే ఆయిల్స్ వివిధ మొక్కల ఆకులు, బెరడు, పూలు, కాండం, వేర్లు ఇలా ప్రతి ఉపయోగపగపడే ప్రతి భాగం నుంచీ సారాన్ని తీసుకొని ఈ ఆయిల్స్ ను తయారు చేస్తారు. వీటినే ‘ఎస్సెన్షియల్ ఆయిల్స్’ అంటారు. అన్నింటిలోకంటే ఎక్కువ ప్రాచుర్య పొందినది లావెండర్ ఆయిల్. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మరి ఆరోమా థెరపీలో వివిధ రకాలైనటువంటి ఆయిల్స్ ఏవిధంగా ఉపయోగపడుతాయో చూద్దాం..
మల్లె: మల్లెపూల వాసన ఎంత ఘాటుగా, ఎంగ రొమాంటిక్ గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. దీని నూనెను డిప్రెషన్ ను తగ్గించేందుకు, మనస్సును ఉత్తేజితం చేసేందుకు ఉపయోగిస్తారు. ఇది మంచి యాంటి సెప్టిక్, డిస్ఇన్ఫెక్టెంట్ అని కూడా తేలింది. అయితే గర్బిణీలు దీనిని వాడకపోవడం మంచిది.
రోజ్: మహిళలకు సంబంధించిన అనేక సమస్యలను తగ్గించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. డిప్రెషన్, ఒత్తిడి, జీర్ణం కోశ సమస్యలు, గుండెకు, రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు, శ్వాసకోస ఇబ్బందులు వంటి ఎన్నింటి నుంచో ఇది కాపాడుతుంది. అలాగే చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే దీనిని గర్బాధరణ సమయంలో ఉపయోగించరాదు
నిమ్మ నూనె: చర్మ సమస్యల నుంచి జీర్ణ సంబంధ సమస్యల వరకూ అనేక వాటికి ఉపశమనం కలిగించగల గుణం నిమ్మ నూనెకు ఉంది. కొవ్వు తగ్గించడంలో, ఇమ్యూనిటీని పెంచడంలో ఇది సహాయపడుతుంది. తలనొప్పులు, జ్వరానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. దీన్ని వేరే మసాజ్ నూనెలలో కలిపి వాడడం మంచిది తప్ప నేరుగా వాడకూడదు. అలాగే ఎండలోకి వెళ్లేటప్పుడు దీనిని వాడకూడదు.
యూకలిప్టస్ నూనె: శ్వాససంబందిత వ్యాధులను తగ్గించడంలో, ఏకాగ్రత పెంచడంలో వీటి సామర్ధ్యం ఎక్కువ. వీటితో పాటుగా దీనిని యాంటీసెప్టిక్ గా, నొప్పులకు, ముక్కులు బ్లాక్ అయినప్పుడు, మైగ్రేన్లు, జ్వరాలు, కండరాల నొప్పులు, ఇతర నొప్పులకు ఉపయోగించవచ్చు. అయితే పిల్లలకు పాలు ఇచ్చే స్త్రీలు దీనిని ఉపయోగించకూడదు.



Click it and Unblock the Notifications
