Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
మత్తెక్కించే ప్రకాశవంతమైన కళ్ళు ఇలా సొంతం...!
శరీరంలో అందమైన భాగాలలో కళ్ళు కూడా ప్రధానమైనవే. ముఖంలో కళ్ళు అందంగా ఉంటే ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. అటువంటి కళ్ళు లేకపోతే ప్రకతి అందాన్ని ఆశ్వాదించలేం. సమాజంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. కళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకొనే ఆహారంలో విటమిన్ ‘ఎ మరియు సి'లు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.

అందమైన కళ్ళ గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా..కళ్ళు అందం గురించి వర్ణించలేము. కళ్ళు అందంగా కనబడాలంటే కళ్ళకు మేకప్ అలంకరణ ముఖ్యం. కళ్ళు మంచి ఆకతి కోసం, కొన్ని మేకప్ ఐటమ్స్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ ఎంపిక చేసుకొనే మేకప్ ఐటమ్స్ మీ కళ్ళకు పర్ఫెక్ట్ గా అమరిపోయే విధంగా ఉండాలి. అదేలాగో చూద్దాం.
1. రాత్రి సమయంలో ఒక కప్పులోనికి ఒక చెంచా గ్రూస్బరీ(నల్లికాయ) పౌడర్, కొద్దిగా నీళ్ళు తీసుకొని, ఉదయాన్నే నిద్ర లేవగానే సాధరణమైన మంచి నీళ్ళు ఒక కప్పు నిండుగా తీసుకొని అందులో గ్చూస్బరీని కలుపుకొని కళ్ళకు జల్లుకోవాలి.
2. రెండు చెంచాల రోజ్ వాటర్ లో రెండు, మూడు చుక్కల క్యాస్ట్రాల్ ఆయిల్ వేసి అందులో దూది బాల్స్ ను ముంచి కనురెప్పల మీదు ఇరవైనిమిషాల పాటు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ళు ప్రశాంతంగా తాజా దనంతో ఉంటాయి.
3. అలసిన కళ్ళకు టీ డికాషన్ ను స్ప్రే చేసుకొంటే తక్షణ ఉపశమనమిస్తుంది. కళ్ళను చల్లగా ఉంచుతుంది.
4. అలసిన కళ్ళకు, కళ్ళు బరువుగా శ్రమించిన కళ్ళ కోసం ఒక చెంచా చల్లని టీ డికాషన్ లో కాటన్ బాల్స్ ను ముంచి కనురెప్పలపై పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ళు రిలాక్స్ అవుతాయి.
5. కళ్ళకు మాత్రమే కాదు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎక్కువగా నీరును తాగాలి. ఎటువంటి వ్యాధులు సోకకుండా ఆరోగ్యంగా ఉండటానికి కనీసం రోజుకు రెండు లీటర్లు నీళ్ళైనా తాగితే మంచిది.
6. శరీరంలోని అవయవాల్నీ సవ్యంగా పనిచేయాలంటే తగినంత నిద్ర అవసరం. కనీసం రోజుకు ఎనిమిది గంట సేపు నిద్రపోతే శరీరానికి కావాల్సిన విశ్రాంతితో పాటు కళ్ళు ఆరోగ్యంగా ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
7. ఆల్కహాల్ సేవించడం, ధూమపానం వంటివి ఆరోగ్యానికి హానికరం. ఇవి శరీర పెరుగుదలను అడ్డుకొని కణాలు నిర్జీవపరుస్తాయి.
8. సాధారణంగా మహిళలు కళ్ళు అందంగా కనిపించడం కోసం కొన్ని మేకప్ ఐటమ్స్ ను ఉపయోగిస్తారు. అయితే ఆ ఉపయోగించే మేకప్ సామాగ్రి యాంటిఆక్సిడెంట్స్ విటమిన్స్ సి కలిగిన క్రీములు ఎంపిక చేసుకోవాలి.
9. కొన్ని వారాలపాటు రెండు రోజులకొకసారి విటమిన్ కె ఐ ట్రీట్ మెంట్ తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల కళ్ళు చాలా ఆరోగ్యంగా ఎక్కువ కాలం పాటు ప్రకాశవంతంగా ఉండేట్లు చేస్తుంది.



Click it and Unblock the Notifications
