Latest Updates
-
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి!
పాదాల పగుళ్లుకు సలభమైన...చక్కటి చిట్కాలు..!

1. గోరువెచ్చని నీరు తీసుకొని అందులో నిమ్మరసం కొన్ని చుక్కలు చేర్చి మీ పాదాలను 5-10నిమిషాలపాటు అందులో ముంచాలి(పాదాలు పూర్తిగా మునిగేటట్లు చేయాలి). తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి ఆపై మాయిశ్చరైజర్ రాసి తర్వాత నిద్రకు ఉపక్రమించాలి.
2. గోరువెచ్చని నీటిలో తేలికపాటి షాంపూను కొన్ని చుక్కలను వేసి, అందులో మీ పాదాలను కొద్దిసేపు నానే విధంగా చూసుకోవాలి. తర్వాత ప్యూమిస్ స్టోన్ (సున్నితమైనటువంటి రాయి)తో రుద్ది శుభ్రపరుచుకొంటే చర్మం మీద ఉండే పొడిబారిన, రఫ్ గా ఉన్న కణాలు తొలగిపోయి పాదాలను సున్నితంగా, నునుపుగా మారుతాయి. షాంపూతో శుభ్రం చేసుకొన్న తర్వాత పాదాలకు మాయిశ్చరైజర్ లేదా నూనెను రాయడం మర్చిపోకండి.
3. ప్రతిరోజూ స్నానం చేసినప్పుడు ప్యూమిస్ స్టోన్ తో కాలి మడమలను రుద్దితే పగుళ్లు సులభంగా పోగొట్టవచ్చు.
4. పాదాల పగుళ్లకు పొడి చర్మం కూడా ఒక ప్రధాన కారణమే. కాబట్టి పాదాల చర్మం ఎప్పుడూ తడిగా ఉండేట్లు చూసుకోవాలి. అందుకోసం ప్రతి రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు తప్పనిసరిగా మాయిశ్చరైజలర్ రాయాలి.
5. పాదాల పగుళ్లకు తేనె కూడా బాగా పనిచేస్తుంది. కొదిగా గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల తేనె, మరికొన్ని చుక్కల నిమ్మరసం కలిపి అందులో పాదాలను 10-15నిమిషాల పాటు నాననిచ్చి తర్వాత మంచినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తర్వాత పొడి వస్త్రంతో శుభ్రం చేసి మాయిశ్చరైజర్ లేదా ఆలివ్ ఆయిల్ రాయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే పాదాల పగుళ్లు పోయి కోమలమౌనటువంటి పాదాలు మీ సొంతం అవుతాయి.
6. గోరువెచ్చని నీళ్లలో బేకింగ్ సోడా రెంచు చెంచాలు వేసి అందులో పాదాలు నాన్చి శుభ్రం చేస్తే మృతకణాలు తొలగిపోయి. పాదాలు సున్నితంగా తయారవుతాయి. ఇది ఒకరకంగా సహజసిద్దమైనటువంటి ఔషదంలా పనిచేసి కాలుకి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే పాదాలు మృదువుగా తయారవుతాయి.



Click it and Unblock the Notifications