Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
కాలంతో పనిలేకుండా సంవత్సరాంతం అందంగా ఉంచే చిట్కాలు...!

పాదాల సంరక్షణకు: దుమ్ము, ధూళి వల్ల పాదాలు మురికిగా కనిపిస్తాయి. వాటిని శుభ్రం చేసుకోవడానికి గోరు వెచ్చని నీటిని ఒక బేసిన్ లో తీసుకొని, ఎప్సాన్ ఉప్పు, బాడీ వాష్ కు సంబంధించిన సోప్ క్రీమ్ ను మిశ్రమంగా కలుపుకొని అందులో పాదాలను పదినిమిషాల సేపు ఉంచాలి. తర్వాత ఫ్యూమిస్ స్టోన్ తీసుకొని చర్మాన్ని బాగా రుద్దాలి. ఆరేంజ్ స్టిక్ ను తీసుకొని కాలి గోళ్ళ మధ్య ఉన్న మట్టిని తొలగించాలి. అంతే కాకుండా గోళ్ళను కూడా పాలిష్ చేసుకోవాలి. సుతిమెత్తని పాదాలు ఎల్లప్పుడూ అందంగా కనపడాలంటే... నెలకొకసారైనా ఇలాంటి టిప్స్ ని ఇంట్లో ఉండే చేసుకోవాలి. అప్పుడు ఖర్చు తగ్గడంతో పాటు అందమైన పాదాలు మీ సొంతమవుతాయి.
పాదాలను ఎండాకాలంలోనే సంరక్షించుకోవాలనే రూలేం లేదు. అన్ని కాలాల్లోనూ శ్రద్దతీసుకున్నప్పుడే అవి అందంగా తయారవుతాయి. అందుకోసం ఇంట్లోనే తయారు చేసుకునే పదార్థాలతోపాటు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారానికి ఒక అరగంట సమయం మీ పాదాల కోసం కేటాయిస్తే చాలు అందమైన పాదాలు మీ సొంతం అవుతాయి.
ఒక ప్లాస్టిక్ బౌల్ లో గోరు వెచ్చని నీటిలో సాప్ట్ నెస్ కోసం కొన్ని చుక్కల చామోమైల్ ఆయిల్ వేయాలి. తర్వాత పాదాలను అందులో పదినిమిషాల పాటు ఉంచాలి. తర్వాత తీసి టవల్ తో తుడిచేస్తే చాలు మీ పాదాలు ఎంతో నునుపుగా తయారవుతాయి.
చేతుల సంరక్షణకు: మన శరీరంలో ఎక్కువగా పనిచేసేవి చేతులే.. అందుకోసం చేతుల విషయంలో ... మరీ ముఖ్యంగా గోళ్ళ విషయంలో శ్రద్ద వహించకపోతే.. అందవికారంగా తయారవుతాయి. పెడిక్యూర్ లాగానే.. మేనిక్యూర్ ను కూడా ఇంట్లో కొన్ని సింపుల్ టిప్స్ పాటించి అందంగా మలచుకోవచ్చు. గోరు వెచ్చని నీటిని తీసుకొని అందులో చేతులను ఉంచి, ఆరెంజ్ వుడ్ స్టిక్ తో గోళ్ళను శుభ్రపరుచుకోవాలి. కాళ్ళ కన్నా చేతులపై మనం ఎక్కువ శ్రద్ద చూపాల్సిన అవసరం ఉంది. ఫ్యూమిస్ స్టోన్ తో చేతులను బాగా రుద్దాలి. అంతే కాకుండా ఎవరికి ఇష్టమైన సోప్ క్రీమ్ ను వాడుకొని మరింతగా రుద్దుకోవడం ద్వారా చేతులను మరింత అందంగా మలచుకోవచ్చు.



Click it and Unblock the Notifications