Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పసుపుతో మిలమిల మెరిసే పాదాలు...!

పసుపు శుభానికి ప్రతీక. ''ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ' అని మన కవులు రాశారు. అందం, ఆరోగ్యం కూడా. ఏ పనిలోనైనా పసుపుదే ప్రథమస్థానం. స్త్రీలకి, పసుపుకి అనుబంధం వున్నదన్న సత్యం జగమెరిగినదే. పసుపును ఆహార పదార్థాలలో వాడుతుంటాం. ఎన్నో వ్యాధులకు మందుగా కూడా ఉపయోగిస్తాం. అలాంటి పసుపు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది.
1. తరచూ పాదాలు ఇన్ఫెక్షణ సమస్యతో బాధపడేవారు నీటికి, రసాయనాలకు దూరంగా ఉండాలి. వీరికి కొన్ని రకాల సబ్బులు, సంబంధిత ద్రవ్యాలు పడువు. దుస్తులు ఉతికే సబ్బులకు, మురికి నీళ్లకు తరచూ నీటిలో పనిచేయడానికి దూరంగా ఉండాలి.
2. గట్టిగా కాకుండా మెత్తని చెప్పులు వేసుకోవడం అలావటు చేసుకోవాలి. మురికి, బురద నీళ్లలో తిరిగినప్పుడు గోరువెచ్చనిటి నీళ్లతో పాదాలను శుభ్రంగా కడగాలి. దాంతో ఫంగల్ ఇన్ ఫెక్షణ్ భాదించదు. కాటన్ సాక్సులు వాడటం మంచిది. వాటి వల్ల పాదాలకు చల్లదనం. పగుళ్లు దూరమవుతాయి.
3. పసుపు చర్మానికి మంచి ఔషదం. ఒక టీస్సూన్ కొబ్బరి నూనెలో పసుపు కలిపి రాస్తే పాదాల సమస్యలు తగ్గుతాయి. మంచినీళ్లు, ఆకు కూరలు, పండ్లు, పప్పుదాన్యాలు, ఎండుఫలాలు బాగా తీసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.
4. నువ్వుల నూనెలో తేనెమైనం, వేపాకుల పొడితో పాటు కలబండ గుజ్జు కలిపితే పాదాలకు మంచి మృదుత్వం వస్తుంది. ఆలివ్ నూనెలో చిటికెడు పసుపు కలిపి రాస్తే ఫలితం ఉంటుంది. పెట్రోలియం జెల్లీలో కలబంద, వేప, పసుపు కలిపి రాయవచ్చు.
5. కొబ్బరి నూనెలో చిటికెడు కర్పూరం, పసుపు వేపపొడి కలిపి రాసినా ఇన్ ఫెక్షన్, సొరియాసిస్, పాదాల వాపులు తగ్గుతాయి.
6. పాదాలను రొజూ గోరువెచ్చని నీటిలో శుభ్రపరచుకోవాలి. పాదాలను పూర్తిగా తడి ఆరనివ్వాలి, ముఖ్యంగా వేళ్ళ మధ్య.
7. పాదాలకి సరిగ్గా సరిపడే బూట్లను వాడాలి. బూటు లోపల వెళ్ళకు సరిపడా ఖాళీ ఉండాలి.
8. రోజూ పాదాలకు (వేళ్ళ మధ్య తప్ప) మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలా రాయడం వల్ల పగుళ్ళను నివారించవచ్చు. వేళ్ళ మధ్య మాయిశ్చరైజర్ రాయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.
9. ఆముదంలో కొంచెం పసుపు కలుపుకొని శరీరానికి పూసుకొని పదినిముషాల తర్వాత సబ్బుతో రుద్దుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే శరీరంపై ఉన్న మచ్చలు, దురద, చర్మవ్యాధులు అన్ని తగ్గిపోతాయి.
10. కరక్కాయచూర్ణం, పసుపు కలిపి కాళ్ళకు పూసినట్లయితే కాళ్ళపగుళ్ళు తగ్గుతాయి. కాళ్లునల్లగా మారడం, పాచిపట్టడం (నీటిలోనానితే) తగ్గుతుంది.



Click it and Unblock the Notifications