Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
జాగింగ్ తో బరువు తగ్గి...శరీరం ఫిట్ గా.. హెల్తీగా.....!

జాగింగ్ చేసేటప్పుడు శరీరంలోని అన్ని అవయవాలకంటే కాళ్ల మీదే ఎక్కువ భారం పడుతుంది. ఒత్తిడి కూడా ఎక్కువే. అందు వలన తేలికగా వుండే షూస్ ధరించడం ముఖ్యం. కాలి వేళ్లల్లో ఎముకల మధ్య కండరాల కదలిక అధికంగా వుంటుంది. దీని వలన రక్తప్రసరణ వేగం ఎక్కువ అవుతుంది.
జాగింగ్ సమయంలో కాలి వేళ్లు ముడుచుకోవడానికి వ్యాపించడానికి తగిన ఖాళీ వుండేలా చూసుకోవాలి. శరీరం నుంచి వేడి బయటకు పోయేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలతో పాటు షూస్ కొనేటప్పడు అప్రమత్తంగా ఉండాలి. జాగింగ్ షూస్ కొనే ముందు బాగా తెలిసి ఉన్న షాపులోనే కొనుగోలు చేయాలి. బ్రాండెడ్ కంపెనీ షూస్ ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. కొత్త వాటి జోలికి వెళ్ళి ప్రయోగాలు చేయకూడదు.
షూస్ మీ పాదం సైజు కన్నా కొద్దిగా పెద్దగా ఉన్నవే ఎంచుకోవాలి. ముఖ్యంగా కాలి వేళ్ల మధ్య వెడల్పు ఎక్కువగా వుండాలి. పాదాలు కదిలినా రక్తప్రసారంలో అంతరాయం కలగదు. షూ లేసులు కట్టుకొని పరిగెత్తడం మొదలు పెట్టిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ షూ వదులు కాకుండా చూసుకోవాలి.
షూస్ ఎప్పుడూ బరువుగా ఉండకూడదు. తేలికపాటి బరువుతో వుండే షూసే మంచివి. సాధారణంగా జాగింగ్ ఉదయం సమయంలోనే చేస్తారు కాబట్టి లేతరంగులే అనువుగా వుంటాయి. కాటన్ షూస్ మాత్రమే ఉపయోగించాలి. లెదర్ తో చేసినవి అంత అనువుగా వుండవు. రక్త ప్రసరణ సక్రమంగా జరగకపోతే కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం వుంది. జాగింగ్ చేసేటప్పుడు ఏమాత్రం అసౌకర్యంగా కనిపించినా వెంటనే ఆపివేయాలి.
రోజూ క్రమక్రమంగా జాగింగ్ చేసే సమయాన్ని పెంచుకుంటూ పోవాలి తప్ప ఒకేసారి గంటల కొద్దీ చేయడం మంచిదికాదు. నెమ్మదిగా మీ శరీరాన్ని జాగింగ్ కి అలవాటు చేయాలి. జాగింగ్ కొత్తగా మొదలు పెట్టదలచు కొంటే మొదటి నండినే ఎక్కవు డిస్టెన్స్ ఎంచుకోకూడదు. మొదట కొద్ది దూరంతో ప్రారంబించి తర్వాత ఒక్కోవారానికి కొంత కొంత దూరం పెంచుకొంటూ పోవాలి. రోజుకి కనీసం అరగంట నుంచి గంటన్నర పాటు జాగింగ్ చేస్తే మంచిది. జాగింగ్ చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం.



Click it and Unblock the Notifications
