Latest Updates
-
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.!
తియ్యటి పదార్థాలు ఎక్కువగా తినాలనిపించినప్పుడు...?

ఈ సమస్యతో బాధపడుతున్న వారు మాటిమాటికీ తినడం కాకుండా ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకొనేలా ధ్యాసను నియంత్రించుకోవాలి. కడుపు నిండిన భావన కలగగానే ఆపేయాలి. అంతే కాదు హడావుడిగా కాకుండా నెమ్మదిగా తినడానికి ప్రాధాన్యమివ్వాలి. ఆ సమయంలో ఎలాంటి ఆలోచనలకు తావివ్వకుండా చూసుకోవాలి.
ప్రతిరోజూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం వల్ల మేలు చేసే హార్మోన్లు శరీరంలోకి విడుదలవుతాయి. అంతే కాదు ఎక్కువ ఆహారం తీసుకోవడానికి కారణమయ్యే ఒత్తిడి, కుంగుబాటుతో పోరాడే శక్తి ఈ హార్మోన్ల సొంతం. ఆకలి అనిపించినప్పుడు అదే పనిగా కాఫీలు, నూనె పదార్థాల వైపు మొగ్గు చూపితే రకరకాల అనారోగ్య సమస్యలు బారినపడే అవకాశముంటుంది. ఇవి తీసుకోవాలనిపించినప్పుడు వాటికి బదులుగా గోరువచ్చటి నీళ్లు.. లేదా అందులో నిమ్మరసం, కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది.
జంక్ ఫుడ్, వేపుళ్ల వంటివి తినాలనిపించినప్పుడు వాటికి ప్రత్యామ్నాయ పదార్థాలు ఎంచుకోవాలి. పేస్ట్రీకి బదులు తియ్యని మామిడి పండు ముక్కలకు ప్రాధాన్యమిస్తే సరి. అంతే కాదు కెలొరీలు లభించని ఈ పండు వల్ల ఊబకాయం సమస్యా ఉండదు. అదే సమయంలో కూరగాయ ముక్కల పైన ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని తింటే బాగుంటుంది.
తియ్యటి పదార్థాలు ఎక్కువగా తినాలనిపించినప్పుడు పండ్ల ముక్కలు, బ్రెడ్డు.. వంటి వాటి మీద తేనె చేర్చి తింటే సహజ చక్కెర్లు శరీరానికి అందే అవకాశం ఉంటుంది. ఆహారం తినేటప్పుడు చాలా మంది హడావుడిగా నమలకుండానే మింగేస్తుంటారు. దానికి బదులుగా ఎక్కువ సమయం నమిలి మింగితే కాస్త ఎక్కువ ఆహారం తీసుకొనే అవకాశం ఉంటుంది. చాలా సేటి వరకూ తినాలన్న భావన కలగదు.
చాలా మంది దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతుంటారు. కానీ అరగంటకోసారి గ్లాసు నీళ్లు తాగుతుంటే ఆకలి ఉండదు. ఏదైనా తినాలన్న ఆలోచన కలగదు. అలానే భోజనానికి ముందు గ్లాసు నీళ్లు తాగితే తక్కువ తీసుకొనే ఆవకాశం ఉంటుంది. మధ్యలో కూడా తాగితే త్వరగా కడుపు నిండుతుంది. అధికాహారం తీసుకున్నామన్న భావన ఉండదు.
ఆహారం తీసుకోవడానికి మధ్య మధ్యలో కొద్దిపాటి అల్పాహారం తినడానికి ప్రాధాన్యమివ్వాలి. దీని వల్ల ఎప్పుడూ తింటున్నామన్న భావన కలుగుతుంది. ఉద్యోగినులు పనిమధ్యలో చిరుతిళ్లు వంటివి ఎక్కువ తీసుకొనే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఎండు ఫలాలు, ఉడికించిన మొక్కజొన్న గింజల, తృణధాన్యాలు, మొలకలు వంటివి తాలింపు పెట్టి తీసుకొంటే రుచికరంగా తినొచ్చు. ఎక్కువ తీసుకొన్నా ఇబ్బంది ఉండదు.
ఆకలి లేకపోయినా తినాలనే ఆలోచనలు కలిగినప్పుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. కుంటుంబ సభ్యులతో బయటకు వెళ్లడం, ప్రకృతిలో సేదతీరడం, ఆత్మీయులతో కబుర్లు చెప్పుకోవడం వంటి చిన్నపాటి నియమాలు మేలు చేస్తాయి.



Click it and Unblock the Notifications
